శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఎస్& టిలో పాల్గొనడానికి మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరాన్ని నిపుణులు హైలైట్ చేశారు

మహిళల కోసం తరువాతి తరం రోల్ మోడళ్లను సృష్టించడం మరియు సైన్స్, టెక్నాలజీ మరియు ఆవిష్కరణలలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాం: ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, కార్యదర్శి, డిఎస్‌టి

Posted On: 09 MAR 2021 9:33AM by PIB Hyderabad

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశం-జపాన్ సంయుక్త వేడుకలో సైన్స్ అండ్ టెక్నాలజీలో పాల్గొనడానికి మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరాన్ని నిపుణులు చర్చించారు.


"లింగ అసమానత ఒక అంతర్జాతీయ సమస్య. ఈ ఆంశంపై వివిధ రకాల వేదికలపై చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క యుఎన్ ఇతివృత్తం - 'విమెన్ ఇన్ లీడర్‌షిప్' దాని సందర్భం మరియు కంటెంట్ రెండింటినీ అర్థం చేసుకోవాలి, ”అని  జపాన్‌లో భారత రాయబారి శ్రీ సంజయ్ కుమార్ వర్మ అన్నారు. ఈ కార్యక్రమాన్ని కిరన్ డివిజన్, డిఎస్‌టి  భారత రాయబార కార్యాలయం, టోక్యో, భారతదేశ ప్రభుత్వం, జపాన్ సైన్స్ & టెక్నాలజీ ఏజెన్సీ, జపాన్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించాయి.


లింగ అసమానత అనేది ఒక చక్రంతో మాత్రమే నడపలేని సైకిల్‌తో పోల్చిచూడవచ్చు.  సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్‌టి) ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ " దేశం మరియు సమాజ అభివృద్ధి మరియు పురోగతికి మహిళలు మరియు పురుషుల భాగస్వామ్యం అవసరం. భారతదేశంలో మహిళలకు వివిధ సవాళ్లు ఉన్నాయి. వాటిలో సాంస్కృతికమైనవి కూడా ఉన్నాయి. డిఎస్టి వివిధ కార్యక్రమాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించింది. మహిళల కోసం తరువాతి తరం రోల్ మోడళ్లను సృష్టించడం మరియు సైన్స్, టెక్నాలజీ మరియు ఆవిష్కరణలలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై మేం దృష్టి పెట్టాం. సంస్థాగత స్థాయిలో మార్పు చేయడానికి సహాయపడే జెండర్ అడ్వాన్స్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్స్ (జిఎటిఐ)ప్రారంభించాము. అకాడెమి, ఇండస్ట్రీ, ఆర్‌అండ్‌డి ల్యాబ్‌లు మహిళలకు విశ్వాసం మరియు అవకాశాన్ని కల్పించే వాతావరణాన్ని సృష్టించాలని, ఇన్నోవేషన్, స్టార్టప్‌లలో మహిళలను ప్రోత్సహించాలని మరియు వారి పూర్తి సామర్థ్యాన్ని అన్వేషించడంలో వారికి సహాయపడాలని మేము కోరుకుంటున్నాము." అని చెప్పారు.


జపాన్ మహిళలపై, ముఖ్యంగా పేదలపై కొవిడ్-19 పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందని జపాన్ ప్రభుత్వ క్యాబినెట్ కార్యాలయం, జెండర్ ఈక్వాలిటీ బ్యూరో డైరెక్టర్ జనరల్ టోమోకో హయాషి తెలిపారు.  ఒంటరి తల్లిదండ్రుల గృహాల సంఖ్యతో పాటు నిరాశ, గృహ హింస, లైంగిక హింస పెరిగింది. వీటిని పరిష్కరించాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. మరియు  లింగ భేదం కారణంగా మహిళలు బాధపడకుండా ఉండటానికి వివిధ చర్యలు తీసుకున్నాము అని చెప్పారు.

లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన కొత్త కార్యక్రమాల గురించి జపాన్ సైన్స్ & టెక్నాలజీ ఏజెన్సీ డాక్టర్ మిచినారి హమగుచి మాట్లాడుతూ " లింగ సమానత్వం ఇప్పటికే ప్రారంభమైందని మరియు భవిష్యత్తులో మరింత వేగవంతం అవుతుందని అన్నారు. “మేము మహిళా పరిశోధకులను ప్రోత్సహించాలి. అద్భుతమైన మహిళా పరిశోధకుల కోసం ఒక అవార్డును ప్రారంభించాము మరియు జపాన్‌లో కొత్త మహిళా ప్రతిభను కనుగొనడంలో విజయం సాధించాము ”అని డాక్టర్ మిచినారి హమగుచి తెలిపారు.

జపాన్ ప్రభుత్వ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్స్ డివిజన్ (రీసెర్చ్ అండ్ సిస్టమ్ రిఫార్మ్)  డైరెక్టర్,  సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ బ్యూరో, ఎంఈఎక్స్‌టి,  సనో టాకికో మాట్లాడుతూ సంవత్సరాలుగా తీసుకువచ్చిన మార్పుల గురించి తెలిపారు.


ఎస్‌టిఈఎంలో మహిళల తక్కువ ప్రాతినిధ్యం యొక్క సమస్యను పరిష్కరించడానికి డిఎస్‌టి ప్రారంభించిన కార్యక్రమాలను భారత ప్రభుత్వం యొక్క కిరణ్ & ఇన్స్పైర్, హెడ్ & అడ్వైజర్ డాక్టర్ సంజయ్ మిశ్రా తెలిపారు  "భారత ప్రభుత్వం మరియు అన్ని మంత్రిత్వ శాఖల ప్రయత్నాలు విద్యారంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ఆదర్శ పరిస్థితులకు దగ్గరగా తీసుకువచ్చాయి. అయినప్పటికీ, మేము డేటాను పరిశీలిస్తే ఎస్‌టిఈఎంలోని వివిధ రంగాలలో మహిళలు తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారని మేము కనుగొన్నాము."అని తెలిపారు.


నిర్దిష్ట కార్యక్రమాలను డిఎస్‌టి ప్రారంభించింది. అవి సమస్యల మూలాలను పరిష్కరించగలవు. డిఎస్‌టి పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన టిఫాక్ ఈ మహిళ దినోత్సవ వేడుకల సందర్భంగా డిఎస్‌టిలో డబ్లుఓఎస్‌-సి విభాగం రూపొందించిన మహిళలకు సంబంధించిన 100 విజయగాధల పుస్తకాన్ని విడదల చేశారు.

***



(Release ID: 1703424) Visitor Counter : 1130