రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
2021-జన్ ఔషధీ దివస్ వారోత్సవాలలో భాగంగా 6వ రోజు కార్యక్రమం
Posted On:
06 MAR 2021 5:02PM by PIB Hyderabad
తక్కువ ధరలకు లభించే నాణ్యమైన జనరిక్ ఔషధాల గురించి అవగాహన కల్పించడం కోసం, 2021-జన్ ఔషధీ దివస్ వారోత్సవాలలో భాగంగా 6వ రోజు కార్యక్రమం, ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా, దేశవ్యాప్తంగా ఉన్న బి.పి.పి.ఐ. బృందాలు; జన్ ఔషధీ మిత్రా; జన్ ఔషధీ కేంద్రాల యజమానులు - బైక్ ర్యాలీలు, పాదయాత్రలు; మానవ హారాలు వంటి కార్యకలాపాలను నిర్వహించారు. ఈ సంఘటనల ద్వారా, జన్ ఔషధీ కేంద్రాలలో చాలా తక్కువ ధరలకు విక్రయించబడుతున్న జెనెరిక్ ఔషధాల సమర్థత, శక్తి గురించి ప్రజలకు వివరించారు. తద్వారా జనరిక్ ఔషధాల గురించి ప్రజల్లో ఉన్న సాధారణ అపోహలను పరిష్కరించారు.
పి.ఎం.బి.జె.పి. క్రింద ఉన్న ఒక ఔషధం షధం మొదటి మూడు బ్రాండెడ్ ఔషధాల సగటు ధరలో గరిష్టంగా 50 శాతంగా ఉండాలనే సూత్రంపై ధర నిర్ణయించబడుతుంది. అందువల్ల, జన్ ఔషధాల ధర కనీసం 50 శాతం, కొన్ని సందర్భాల్లో, బ్రాండెడ్ ఔషధాల మార్కెట్ ధర కంటే 90 శాతం తక్కువగా ఉంటాయి. ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరంలో, 2021 మార్చి, 5వ తేదీ వరకు - పి.ఎం.బి.జె.పి. 593.84 కోట్ల రూపాయల మేర (ఎమ్.ఆర్.పి.వద్ద) విక్రయాలను సాధించింది. దీంతో దేశంలోని సాధారణ పౌరులకు సుమారు 3,600 కోట్ల రూపాయల మేర వ్యయం, ఆదా అయ్యింది.
2021-జన్ ఔషధీ దివస్ వారోత్సవాలను, 7,400 కి పైగా ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధీ కేంద్రాల ద్వారా, దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆరోగ్యం, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడానికి జన్ ఔషధీ కేంద్ర యజమానులు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బ్లడ్ ప్రెషర్ చెక్-అప్, షుగర్ లెవల్ చెక్-అప్, ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, ఉచిత ఔషధ పంపిణీ మొదలైన వాటిని అందించే ఆరోగ్య తనిఖీ శిబిరాలను నిర్వహించడం ద్వారా 2021 మార్చి, 1వ తేదీన ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. రెండవ రోజు నిర్వహించిన ‘జన్ ఔషధీ పరిచార్చా’ కార్యక్రమంలో బి.పి.పి.ఐ; జన్ ఔషధీ మిత్ర, జన్ ఔషధీ కేంద్ర యజమానులు వైద్యులు, ఆసుపత్రులు, క్లినిక్ లు, ఇతర వాటాదారులు పాల్గొన్నారు. జన్ ఔషధీ దివస్ వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు, అంటే 2021 మార్చి, 3వ తేదీన, బి.పి.పి.ఐ; జన్ ఔషధీ మిత్రా, జన్ ఔషధీ కేంద్ర యజమానులు దేశవ్యాప్తంగా ‘టీచ్ దెమ్ యంగ్’ తరహాలో నిర్వహించారు. బి.పి.పిఐ. అధికారులు, ఈ కార్యక్రమాల్లో భాగంగా, పాఠశాలలు, కళాశాలలు, ఫార్మసీ కళాశాలలు మరియు ఇతర విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. 4వ రోజున, పి.ఎమ్.బి.జె.పి. కార్యకలాపాల్లో పాల్గొని, శానిటరీ ప్యాడ్‌ల వాడకం గురించి, మహిళలకు అవగాహన కల్పించడానికి శిబిరాలను నిర్వహించింది. ఈ వారోత్సవాల్లో భాగంగా, 5వ రోజు కార్యక్రమాన్ని, ‘జన్-ఔషధీ-కా-సాథ్’ అనే ఇతివృత్తంతో, మన సీనియర్ సిటిజన్లకు అంకితం చేశారు.
2021 - జన్ ఔషధీ దివస్ వారోత్సవాలు, రేపు, 2021 మార్చి, 7వ తేదీన ముగుస్తాయి. ‘జన్ ఔషధీ దివస్’ వేడుకలనుద్దేశించి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 మార్చి, 7వ తేదీ ఉదయం 10 గంటలకు, దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.
*****
(Release ID: 1702952)
Visitor Counter : 206