ఆయుష్
గవర్నమెంట్ ఇ మార్కెట్ (జిఇఎం) పోర్టల్ ద్వారా తమ ఉత్పత్తులను అమ్మనున్న ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఐఎంపిసిఎల్
Posted On:
05 MAR 2021 6:57PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ మెడిసిన్స్ ఫార్మస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఎంపిసిఎల్) సంభావ్య అమ్మకాల పరిమాణం విషయంలో తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ప్రభుత్వ ఇ-మార్కెట్‌తో (జిఇఎం) ఇటీవలే చేసుకున్న ఒప్పందం కారణంగా ప్రేరణను పొందింది. ఐఎంపిసిఎల్, జిఇఎం మధ్య ఒప్పందం 03.03.2021న ఖరారు అయింది. జిఇఎం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సుమారు 311 ఔషధాలను పరిగణలోకి తీసుకుని 31 కేటగిరీలను సృష్టించడంతో ఐఎంపిసిఎల్ ఇప్పుడు ఈ మందులను జిఇఎం పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.
ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఎంపిసిఎల్ రూ. 100 కోట్ల టర్నోవర్‌తో దేశంలో ఆయుష్ మందుల ఉత్పత్తిదారులలో విశ్వసనీయమైన సంస్థలలో ఒకటి. పైగా, దాని సూత్రీకరణల ప్రామాణికతకు పేరొందింది. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న సిపిఎస్ ఇ ఐఎంపిసిఎల్ మాత్రమే, దాని ఆయుర్వేద, యునాని మందుల ధరలను ఆర్థిక మంత్రిత్వ శాఖ (వ్యయ శాఖ) పరిశీలించి, ఖరారు చేసింది. జిఇఎం నిర్ణయం కారణంగా ఐఎంపిసిఎల్ తయారు చేసే ఆయుర్వేద, యునాని మందులు జిఇఎం పోర్టల్‌లో ఆర్థిక శాఖకు చెందిన వ్యయ విభాగం ఖరారు చేసిన ధరలకు వందలాది ప్రభుత్వ రంగ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు తమ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలకు మందులు సేకరించడం సులువు చేస్తుంది. జిఇఎం, ఐఎంపిసిఎల్ మధ్య ఒప్పందం రాష్ట్ర యూనిట్లు ఆయుర్వేద, యునాని మందుల సేకరణ, పంపిణీని క్రమబద్ధం చేస్తుంది. ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులకు వెళ్ళే వేలాదిమంది రోగులు, ఇతర క్లైంట్లు దూరంగా ఉన్న ఆయుష్ ఆసుపత్రులు, క్లినిక్‌లలో కూడా ఈ మందులు సమృద్ధిగా అందుబాటులో ఉండనున్న కారణంగా లబ్ది పొందనున్నారు.
*****
(Release ID: 1702860)
Visitor Counter : 178