భారత ఎన్నికల సంఘం
ఈసీఐ ప్రకటన
Posted On:
05 MAR 2021 5:35PM by PIB Hyderabad
ఈసీఐలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2021 ఇన్‌ఛార్జిగా ఉన్న డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ టీఎంసీ ఎంపీలు పశ్చిమ బెంగాల్ సీఈవోకు లేఖ రాసినట్టుగా మీడియాలోని ఒక విభాగం ఈ రోజు (5.3.2021న) వార్తలను వెలువరించాయి. ప్రశ్నలతో కూడిన ఈ ఫిర్యాదు పశ్చిమ బెంగాల్ సీఈఓకు ఇవ్వడమైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీఈఓ దీనికి సంబంధిచిన ఒక కాపీని.. ఈసీఐ ప్రధాన కార్యాలయానికి పంపినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి కమిషన్ వివరణనిస్తూ.. తమ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు, ఇతర అధికారులు ఈసీఐ ప్రధాన కార్యాలయంలో మరియు / లేదా క్షేత్రస్థాయిలో పనిచేసే ఇతర అధికారులు భారత రాజ్యాంగం మరియు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉన్న వివిధ నిబంధనల ప్రకారం తమ విధులను కచ్చితంగా నిర్వర్తిస్తున్నారని స్పష్టం చేసింది. అలా కాకుండా ఈ విషయమై అక్కడక్కడ కొంత భిన్న ధోరణి కనిపించిన సందర్భంలో ఈసీ వెంటనే తగు దిద్దుబాటు చర్య తీసుకుంటుందని కమిషన్ తెలిపింది. ఇదే సందర్భంలో డీఈసీ శ్రీ సుదీప్ జైన్ యొక్క సమగ్రత, నిబద్ధతపై కమిషన్ పూర్తి నమ్మకాన్ని వ్యక్తీకరించింది. దురదృష్టవశాత్తు ఎన్నికల ప్రక్రియ సందర్భంగా కమిషన్ యొక్క సీనియర్ అధికారులపై అభూత ప్రచారాలకు దిగడం ఇది మొదటిసారి కాదని పేర్కొంది. పైన పేర్కొన్న వార్తలలో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో శ్రీ జైన్ తీసుకున్న రెండు నిర్ణయాలను టీఎంసీ ఎంపీలు ఉదహరిస్తూ చేసిన ఆరోపణలను ప్రస్తావించింది. అప్పడు కూడా శ్రీ జైన్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఈసీఐలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఇన్‌ఛార్జిగా ఉన్న విషయాన్ని కమిషన్ గుర్తు చేసింది. ఈ రెండు నిర్ణయాలు స్వేచ్ఛగా న్యాయమైన మరియు శాంతియుత వాతావారణంలో ఎన్నికలను నిర్వహించాలనే ఉద్దేశ్యంతో కమిషన్ తీసుకున్నాయేనని తెలిపింది. డీఈసీ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, పోలీస్ నోడల్ ఆఫీసర్ మరియు ఇతర సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం వీటిని అమలు చేసిందని స్పష్టం చేశారు. వాట్సాప్ / ఎస్ఎంఎస్ సందేశాలు మొదలైన వాటిపై ప్రశ్నల ద్వారా ఈ సమస్యను ఇతర విభాగాల మీడియా లేవనెత్తుతున్నందున, ఈ ప్రకటన కాపీని ఈసీఐ (eci.gov.in) వెబ్‌సైట్‌లో కూడా ఉంచడమైంది.
*****
(Release ID: 1702856)
Visitor Counter : 139