శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కొవిడ్-19 వాక్సిన్ విధాన నిర్ణయంపై చర్చాగోష్ఠి నిర్వహించిన సీఎస్ఆర్ఐ- ఎన్ఐఎస్ టిఎడిఎస్ , సీఎస్ఆర్ఐ- ఎన్ఐఎస్ సిఎఐఆర్

Posted On: 03 MAR 2021 11:35AM by PIB Hyderabad

'కొవిడ్-19 వాక్సిన్ పై స్వయం సమృద్ధి నుంచి ప్రపంచంలో కీలక పాత్ర పోషించడానికి గల అవకాశాలుసవాళ్లు కోవిడ్ అనంతర పరిస్థితుల్లో అమలుచేయవలసిన విధానాలుఅనే అంశంపై జాతీయ సైన్స్ దినోత్సవం రోజున కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్( సీఎస్ఆర్ఐ) అనుబంధ సంస్థలైన  సీఎస్ఆర్ఐ- నిఐఎస్ టిఎడిఎస్ , సీఎస్ఆర్ఐ- ఎన్ఐఎస్ సిఎఐఆర్ లు ఒక చర్చాగోష్ఠిని నిర్వహించాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో కోవిడ్-19 వాక్సిన్ ను రూపొందించిన నేపథ్యంలో  కోవిడ్-19 వాక్సిన్ తో పాటు వాక్సిన్ ల రంగంలో భారత్ ప్రపంచంలో కీలక పాత్ర పోషించడానికి అమలు చేయవలసిన విధానాల రూపకల్పన పై ప్రముఖుల అభిప్రాయాలను సేకరించాలన్న లక్ష్యంతో ఈ చర్చాగోష్ఠిని నిర్వహించారు. 

 ఈ కార్యక్రమంలో డిఎస్ఐఆర్ కార్యదర్శిసీఎస్ఆర్ఐ డైరెక్టర్ జనరల్  డాక్టర్ శేఖర్ సి. మాండేకేంద్రప్రభుత్వ సీనియర్ సలహాదారుడు డాక్టర్ శైల్జా వైద్య గుప్తాడిఎస్ఐఆర్ కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్  డిఎస్టిసలహాదారు మరియు అంతర్జాతీయ సహకార అధిపతి  డాక్టర్ ఎస్ కె వర్షనేసిఎస్‌ఐఆర్-ఐజిఐబి డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ఎస్‌సిడిడిసిఎస్‌ఐఆర్ అధిపతి  డాక్టర్ గీత వాణీ రాయసం , సిఎస్‌ఐఆర్-నిస్టాడ్స్సిఎస్‌ఐఆర్-నిస్కేర్ డైరెక్టర్ డాక్టర్ రంజనా అగర్వాల్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌పై తమ అభిప్రాయాలనుతెలిపారు కార్యక్రమంలో విద్యావేత్తలుయువ పరిశోధకులునిపుణులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

గత ఏడాది కాలంగా కొవిడ్-19 అంశంపై  సీఎస్ఆర్ఐ- నిఐఎస్ టిఎడిఎస్ సీఎస్ఆర్ఐ- ఎన్ఐఎస్ సిఎఐఆర్ లు సదస్సులను నిర్వహించడంతోపాటు కొవిడ్ కు సంబందించిన సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఎస్ టీ ఎస్ విధానంపై గత 25 సంవత్సరాలుగా సీఎస్ఆర్ఐ- ఎన్ఐఎస్ సిఎఐఆర్ సాగిస్తున్న పరిశోధనలకు జాతీయఅంతర్జాతీయ గుర్తింపు లభించింది. 

కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి సహాయసహకారాలను అందించి ప్రభుత్వ కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలు జరిగేలా చూడడానికి దోహదపడే విధాన రూపకల్పనకు నిపుణుల అభిప్రాయాలను సేకరించడానికి లాక్ డౌన్ తరువాత సదస్సులను నిర్వహిస్తున్నాం. మేధావులునిపుణులను ఒక వేదిక మీదకు తీసుకుని రావాలన్న లక్ష్యంతో సదస్సులువర్క్ షాపులను నిర్వహిస్తున్నాం. దీనిద్వారా పటిష్ట విధాన రూపకల్పనకు  అవకాశం కలుగుతుంది' అని సీఎస్ఆర్ఐ- నిఐఎస్ టిఎడిఎస్ సీఎస్ఆర్ఐ- ఎన్ఐఎస్ సిఎఐఆర్ డైరెక్టర్ డాక్టర్ రంజనా వివరించారు. 

కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టే అంశంలో తమ సంస్థ చురుగ్గా పాల్గొందని  సిఎస్ఐఆర్ డిజి డాక్టర్  శేఖర్ సి మాండే పేర్కొన్నారు. కోవాక్సిన్ తయారీలో  భారత్ బయోటెక్ కు హైదరాబాద్ లోని సిఎస్ఐఆర్ ల్యాబ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి)సహకరించిందని తెలిపారు.  ప్రధాని అందుకున్న వ్యాక్సిన్ లో ఎస్ఐఆర్ పాత్ర ఉండడం తమకు గర్వంగా ఉందని  ఆయన చెప్పారు.

కోవిడ్ -19 వ్యాక్సిన్‌పై భారతీయులకు నమ్మకం ఉందని 2021 ఎడెల్మన్ ట్రస్ట్ బేరోమీటర్‌ను ఉటంకిస్తూ డాక్టర్ శైల్జా వైద్య గుప్తా అభిప్రాయపడ్డారు.  కోవిడ్-19 తో ప్రైవేట్ భాగస్వామ్యంతో కలసి పనిచేసే అంశంలో భారత్ కు అనుభవం లభించిందని ఆయన చెప్పారు. వాక్సిన్ పట్ల ప్రజలు విశ్వాసం పొందేలా చూడడానికి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల మధ్య అవగాహన ఉండాలని అన్నారు.   పారదర్శక వ్యవస్థలను అభివృద్ధి ప్రజలకు సమాచారం అందేలా చూడడంతో పాటు వాక్సిన్ నియంత్రణ వ్యవస్థను వికేంద్రీకరించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని మరింతగా పొందడానికి ప్రయత్నించాలని ఆమె సూచించారు. 

శాస్త్రీయ సమాచార వ్యాప్తిపై మాట్లాడిన డాక్టర్ వాణి రాయసం ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడడానికి వారిని చైతన్యవంతులను చేయడంతో పాటు వారికి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని అన్నారు. వాక్సిన్ రంగంలో భారత్ పాత్రపై మాట్లాడిన డీఎస్ట్టీ ప్రతినిధి డాక్టర్ ఎస్ కె వర్షనే భారతదేశ అవసరాలను తీర్చిన తరువాత వాక్సిన్ ను ఇతర దేశాలకు పంపుతున్నారని వీటిని సులువుగా నిల్వ చేయవచ్చునని అన్నారు. వాక్సిన్ అవసరం వున్న దేశాలకు ఇంతవరకు 60లక్షల డోసులను బహుమతిగా ఇచ్చామని మరో 10 మిలియన్ డోసులను వాణిజ్య అవసరాలకు పంపామని చెప్పారు. త్వరలో ప్రపంచ ఆరోగ్య సంస్థయూ ఎన్ ఆరోగ్య కార్యకర్తలకు వాక్సిన్ సరఫరా చేస్తామని తెలిపారు. 

కోవిడ్-19 వాక్సిన్ వివిధ అంశాలను వివరించిన డాక్టర్ అనురాగ్ అగర్వాల్ ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగితేనే వ్యాధి నయమవుతుందనివ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి వాక్సిన్ ను తీసుకోవాలని అన్నారు. 

 నిస్టాడ్స్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వై. మాధవి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో  జీవశాస్త్రం నుంచి  టీకా భద్రత వరకు పలువురు అడిగిన ప్రశ్నలకు నిపుణులు సమాధానం ఇచ్చారు. డాక్టర్ పరమానంద బార్మన్డాక్టర్ ఎన్‌కె ప్రసన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

****


(Release ID: 1702223) Visitor Counter : 218