పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

బలమైన విమానాల లీజింగ్ పరిశ్రమను స్థాపించడానికి భారతదేశం పెరుగుతున్న విమాన రాకపోకలను ప్రభావితం చేయాలి: హర్దీప్ ఎస్ పురీ

కోవిడ్ ముందు స్థాయిలకు చేరుకోవడంలో గణనీయమైన ప్రగతిని సాధించిన - భారత విమానయాన రంగం

ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ సదస్సు-2021 జరిగింది

Posted On: 26 FEB 2021 6:31PM by PIB Hyderabad

బలమైన విమానాల లీజింగ్ పరిశ్రమను స్థాపించడానికి భారతదేశం పెరుగుతున్న విమాన రాకపోకలను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, ఇది కొత్త విమానాల డెలివరీలకు దాని స్వంత విధానాలు, ఉత్పత్తుల ద్వారా ఆర్థిక సహాయం చేస్తుందని, కేంద్ర విమానయాన శాఖ  ఇంచార్జి సహాయ మంత్రి, శ్రీ హర్దీప్ ఎస్. పురి పేర్కొన్నారు.  ఈ రోజు ఇక్కడ జరిగిన ఇండియా ఎయిర్‌-క్రాఫ్ట్ లీజింగ్ సదస్సు 2021- రూపాయి రఫ్తార్‌ను ఉద్దేశించి, శ్రీ పురి మాట్లాడుతూ,  ఆర్థిక సేవల కోసం భారతదేశంలో ఈ కొత్త వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, అంతర్జాతీయ ఆర్థిక సేవల కోసం ప్రపంచ ఆర్థిక కేంద్రాల పటంలో భారతదేశాన్ని చేర్చడం చాలా ముఖ్యమని, అన్నారు. ఈ కార్యక్రమంలో, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ దృశ్య మాధ్యమం ద్వారా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  ఈ శిఖరాగ్ర సదస్సుకు శ్రీ హర్దీప్ ఎస్. పూరి గౌరవ అతిథిగా హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో -  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ప్రదీప్ సింగ్ ఖరోలా,  అంతర్జాతీయ ఆర్ధిక సేవల సాధికార కేంద్రం, చైర్ పర్సన్ శ్రీ ఇంజేటి శ్రీనివాస్,  పౌర విమానయాన మంత్రిత్వశాఖలో సీనియర్ ఆర్ధిక సలహాదారు శ్రీమతి వందన అగర్వాల్, ఫిక్కీ అధ్యక్షుడు, శ్రీ ఉదయ్ శంకర్,  ఎయిర్ బస్ ఇండియా అధిపతి శ్రీ రెమి మెయిలార్డ్ తో పాటు,  భారత పౌర విమానయాన రంగానికి చెందిన వాటాదారులు, పరిశ్రమ సభ్యులు పాల్గొన్నారు. 

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలను నిలిపివేసినప్పటికీ, ప్రపంచ వాణిజ్యం, వివిధ రకాలుగా ప్రభావితమైనప్పటికీ, భారతీయ విమానయాన రంగం మాత్రం, స్థితిస్థాపకత, అమరిక, పునరుత్థానం చూపించిందని, శ్రీ హర్దీప్ ఎస్. పురీ తెలిపారు.  భారత పౌర విమానయాన రంగం ప్రస్తుతం, పుంజుకుంటోందనీ, ప్రయాణీకుల రాకపోకలు, సరుకు రవాణా పరంగా కోవిడ్ ముందు పరిస్థితికి చేరుకోవడంలో, గణనీయమైన ప్రగతిని సాధించిందనీ, ఆయన, వివరించారు.  విమానాల లీజింగు, ఫైనాన్సింగు, ఎం.ఆర్.ఓ. కార్యకలాపాల ద్వారా భారతదేశంలోకి కొత్త వ్యాపారాన్ని ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రానున్న 20 ఏళ్లలో భారత విమానయాన రంగం వృద్ధి సామర్థ్యానికి అనుగుణంగా,  భారతదేశానికి 20,40,000 కోట్ల రూపాయల  (సుమారు 290 బిలియన్ అమెరికా డాలర్లు) విలువైన 1,750 నుండి 2,100 వరకు విమానాలు అవసరం ఉంటుంది. అంటే, ఎయిర్ బస్ మరియు బోయింగ్ సంస్థల అంచనాల ప్రకారం, ప్రతి ఏటా 35,000 కోట్ల రూపాయలు లేదా 5 బిలియన్ల అమెరికా డాలర్ల అంచనా వ్యయంతో, సుమారుగా సంవత్సరానికి 100 విమానాల చొప్పున సరఫరా కావలసిఉంటుందని, శ్రీ పురీ తెలియజేశారు.  గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా లీజుకు విమానాల వాటా గణనీయంగా పెరిగిందని కూడా, ఆయన చెప్పారు.  ఇది 1980 లో 2 శాతంగా ఉండగా, 2018 సంవత్సరానికి 41 శాతంగా పెరిగింది. ఇప్పుడు 2020 లో ఇది 50 శాతానికి చేరుకొని ఉంటుందని,  అంచనా వేయబడింది. 

విమానయాన విలువ వ్యవస్థలో, విమానాలకు ఆర్ధిక సహాయం కల్పించడం, ప్రస్తుతం, అత్యంత లాభదాయక విభాగంగా ఉందన్న విషయాన్ని, విమానయాన శాఖ మంత్రి ప్రముఖంగా పేర్కొంటూ, భారతదేశంలో పెరుగుతున్న అవకాశాలకు, విదేశీ ఫైనాన్షియర్లు మరియు అద్దెదారులు, ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని చెప్పారు.  భారతదేశంలో ఏవియేషన్ లీజింగు, ఫైనాన్సింగ్ హబ్ ‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందనీ, భారతదేశంలో ఈ వ్యాపారాన్ని వేగంగా విస్తరించడానికి, ఫైనాన్సింగ్, ఎం.ఆర్.‌ఓ, తయారీ మొదలైన కార్యక్రమాలు ఇందులో ఉన్నాయనీ, ఆయన తెలియజేశారు. 

ఐ.ఎఫ్.ఎస్.సి. లలో వ్యాపారం యొక్క క్రియాశీల స్వభావానికి అధిక అంతర్-నియంత్రణ సమన్వయం అవసరం కాబట్టి,  ఐ.ఎఫ్.ఎస్.సి. లో వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు, ప్రపంచ స్థాయి నియంత్రణ వాతావరణాన్ని అందించడం కోసం, ఏకీకృత నియంత్రణ సంస్థగా, ఐ.ఎఫ్.ఎస్.సి.ఏ. (అంతర్జాతీయ ఆర్ధిక సేవల సాధికార కేంద్రం) ని స్థాపించడం జరిగిందని, శ్రీ పురీ, చెప్పారు.

విమానాల లీజింగ్ మరియు ఫైనాన్సింగ్‌పై రూపాయి రాఫ్తార్ వర్కింగ్ గ్రూప్ ఆర్.‌బి.ఐ., బ్యాంకులు, ఎన్.‌బి.ఎఫ్.‌సి.లు - ఎసెట్ ఫైనాన్సింగ్ / లీజింగ్ కంపెనీలు, విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు మరియు ఇతర వాటాదారులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపిన తరువాత భారతదేశంలోని స్థానిక భారతీయ ఫైనాన్షియర్లు విమాన ఫైనాన్సింగ్‌కు ఉన్న 360 డిగ్రీల సమీక్షను సమగ్రంగా తీసుకున్నట్లు, శ్రీ పురీ, వివరించారు.  దేశ విమానయాన పరిశ్రమ యొక్క దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, భారతదేశంలో ఐ.ఎఫ్.ఎస్.సి. నగరంగా ఉన్న, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (జిఫ్ట్), ద్వారా పర్యావరణ వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వం భావించిందనీ, పరిశ్రమలో అవసరమైన నిబంధనల సౌలభ్యం, ప్రధాన భూభాగ నిబంధనలను, అది, ప్రభావితం చేయదనీ, ఆయన తెలియజేశారు. 

విమానాల లీజింగ్ మరియు ఫైనాన్సింగ్ కోసం భారతదేశం, ఐర్లాండ్, చైనా, హాంకాంగ్, సింగపూర్ మరియు ఇతర ప్రాంతాలతో పోల్చదగిన, అత్యంత ప్రభావవంతమైన వ్యవస్థను సృష్టించింది. విమానయాన పరిశ్రమ అభివృద్ధికి కీలకమైన భారతదేశ ఫైనాన్సింగ్ మార్కెట్‌ను పెంచడం, ఈ రంగంలో అధికంగా ఆకాంక్షించే ఉద్యోగాలను సృష్టించడంతో పాటు, భారత దేశాఅభివృద్ధిని ప్రోత్సహించడం దీని ఉద్దేశ్యం. ఈ చొరవ క్రింది కీలక ప్రయోజనాలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది: -

*     అంతర్జాతీయ ఆర్థిక సేవల కోసం భారతదేశంలో నూతన వ్యాపార దృక్ఫధం అభివృద్ధి చెందుతుంది.

*     భారతదేశంలో అదనపు ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 

*     భారతదేశంలో అంతర్జాతీయ ఆర్థిక సేవల వ్యాపారం, అదేవిధంగా - బ్యాంకులు, ఎన్.‌బి.ఎఫ్.‌సి.లు, క్రెడిట్ హామీదారులు, భీమా సంస్థలు, ఇతర సహాయక వ్యాపారం మొదలైన వాటికి సాధారణ అదనపు వ్యాపారం, కొనసాగుతాయి.

*     అంతర్జాతీయ ఆర్థిక సేవల కోసం ప్రపంచ ఆర్థిక కేంద్రాల పటంలో భారతదేశం చేరుతుంది. 

*     అనుబంధ పరిశ్రమల నుండి పన్నులు వసూలు చేయడం ద్వారా మరియు అవసరమైతే, విమాన ఫైనాన్సింగ్ ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది.

*     భారతదేశంలో వివిధ విదేశీ అద్దెదారులకు అవకాశం లభిస్తుంది. 

*     విదేశీ మారకద్రవ్యం చెల్లింపులు తగ్గుతాయి.  

*     విమానాశ్రయ అభివృద్ధికి ఆర్ధిక సహాయం మరియు విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, ఎయిర్ టాక్సీలు మొదలైన వాటి తయారీతో పాటు, క్యారియర్లు, ప్రపంచ ఓ.ఎం.ఈ. ల తయారీలో భాగమైన విడిభాగాల సరఫరాదారులకు, "మేక్-ఇన్ ఇండియా" చొరవకు మద్దతు ఇచ్చే "ఏవియేషన్ ఫైనాన్సింగ్"  వ్యవస్థకు ప్రోత్సాహం లభిస్తుంది.  

*****



(Release ID: 1701362) Visitor Counter : 160