సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ను కలసిన జమ్మూకాశ్మీర్ ఎయిమ్స్ నూతన డైరెక్టర్ డాక్టర్ శక్తి గుప్త ఎయిమ్స్ అభివృద్ధిపై చర్చలు
50 మంది విద్యార్థులతో ఈ ఏడాది తొలి ఎంబిబిఎస్ తరగతులు ప్రారంభం
Posted On:
26 FEB 2021 1:26PM by PIB Hyderabad
జమ్మూ అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ ( ఎయిమ్స్) డైరెక్టర్ గా నూతనంగా నియమితులైన డాక్టర్ శక్తి గుప్త ఈ రోజు కేంద్ర ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి అంతరిక్ష శాఖల సహాయ ( స్వతంత్ర) మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ను కలసి సంస్థ అభివృద్ధికి అమలు చేయవలసిన కార్యక్రమాలపై చర్చలు జరిపారు. జమ్మూ ఎయిమ్స్ ఈ ఏడాది ఎంబిబిఎస్ లో 50 మంది విద్యార్థులతో తన తొలి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించనున్నది.
తనపై నమ్మకాన్ని ఉంచి తనకు భాద్యతలను అప్పగించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ శక్తి గుప్త ఎయిమ్స్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఎయిమ్స్ ను అభివృద్ధిపథంలో నడిపించి తన బాధ్యతలను డాక్టర్ గుప్త నిర్వర్తిస్తారన్న ఆశాభావాన్ని డాక్టర్ జితేంద్రసింగ్ వ్యక్తం చేశారు.
ఎయిమ్స్ ఢిల్లీలో చెల్లిస్తున్న జీతాలను జమ్మూ ఎయిమ్స్ లో కూడా అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దీనితో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన ఉత్తమ అధ్యాపక సిబ్బందిని, పారా మెడికల్ సిబ్బంది ముఖ్యంగా నర్సింగ్ సిబ్బందిని ఇక్కడ నియమించవచ్చునని మంత్రి అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ వ్యక్తిగతంగా చొరవ తీసుకొవడం వల్లనే జమ్మూ లో ఎయిమ్స్ ఏర్పాటయ్యిందని మంత్రి గుర్తు చేశారు. జమ్మూ ను అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు వైద్యవిద్యను అభ్యసించడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి ప్రధానమంత్రి ఆశయ సాధనకు కృషి చేయాలని మంత్రి కోరారు.
****
(Release ID: 1701258)
Visitor Counter : 110