జౌళి మంత్రిత్వ శాఖ
‘ఇండియా టాయ్ ఫెయర్ 2021’ ని ఈ నెల 27న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
Posted On:
25 FEB 2021 5:36PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఇండియా టాయ్ ఫెయర్ 2021’ ని ఈ నెల 27న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.
బాలల బుద్ధి పెరగడం లో బొమ్మలు ఓ ముఖ్య పాత్ర ను పోషిస్తాయి. అంతేకాదు, బాలల్లో జ్ఞాన సంబంధి ప్రావీణ్యాలు పెంపొందడం లో సైతం బొమ్మ లు తోడ్పడుతాయి. ప్రధాన మంత్రి కిందటి సంవత్సరం ఆగస్టు లో తన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో ప్రసంగిస్తూ, ఆట వస్తువులు చురుకుదనాన్ని వృద్ధి చేయడమొక్కటే కాకుండా ఆకాంక్షల కు రెక్కలను కూడా తొడుగుతాయి అని అభివర్ణించారు. బాలల సంపూర్ణ వికాసం లో ఆట వస్తువుల కు గల ప్రాముఖ్యాన్ని గమనించిన ప్రధాన మంత్రి అంతకు ముందు కూడా భారతదేశం లో ఆట బొమ్మల తయారీ కి ఉత్తేజాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ‘ఇండియా టాయ్ ఫెయర్ 2021’ నుప్రధాన మంత్రి దార్శనికత కు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది.
మేళా ను గురించి..
ఈ మేళా ను ఈ నెల 27వ తేదీ మొదలుకొని మార్చి నెల 2వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఆటవస్తువుల పరిశ్రమ సమగ్ర అభివృద్ధి ని ప్రోత్సహించగల సంభాషణ కు ఆస్కారం కల్పించడానికి కొనుగోలుదారులు, అమ్మకందారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, రూపశిల్పులు వంటి వారు సహా ఆట బొమ్మల లోకం తో సంబంధం కల వివిధ వర్గాలను ఒక వర్చువల్ ఫ్లాట్ ఫార్మ్ మీదకు తీసుకు రావాలనేది ఈ మేళా ఉద్దేశ్యం గా ఉంది. ఆట వస్తువుల రంగం లోకి పెట్టుబడుల ను ఆకర్షించడం, ఆటవస్తువుల ఎగుమతుల ను ప్రోత్సహించడం ద్వారా ఆట బొమ్మల తయారీ కి, ఆట వస్తువుల సరఫరా కు తదుపరి ప్రపంచ కేంద్రం గా భారతదేశాన్ని ఏ విధంగా తీర్చిదిద్దవచ్చో అనే అంశాన్ని ప్రభుత్వం, పరిశ్రమ కలసి ఈ వేదిక ద్వారా చర్చించనున్నాయి.
ఇ-కామర్స్ కు అవకాశం ఉండే వర్చువల్ ఎగ్జిబిశన్ లో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కు చెందిన 1000 కి పైగా ఎగ్జిబిటర్స్ వాటి ఉత్పత్తుల ను ప్రదర్శించనున్నాయి. దీనిలో సాంప్రదాయక భారతదేశ బొమ్మలతో పాటు ఎలక్ట్రానిక్ ఆటవస్తువులు, మెత్తని పదార్థం తో ముస్తీబు చేసిన పిల్లలు ఆడుకొనే పశువుల బొమ్మలు (ప్లశ్ టాయిస్), పజిల్స్, గేమ్స్ వంటి ఆధునిక ఆట వస్తువులు కూడా ప్రదర్శన లో పాలుపంచుకోనున్నాయి. ఈ మేళా బొమ్మల రూపకల్పన లో, తయారీ లో చేయి తిరిగిన ప్రముఖ భారతీయ, అంతర్జాతీయ వక్తల తో అనేక వెబినార్ లకు, సమూహ చర్చల కు కూడా అవకాశాన్ని కల్పించనుంది. ఇక బాలలకయితే సాంప్రదాయక ఆట బొమ్మల తయారీ కి సంబంధించిన హస్తకళా ప్రదర్శనలను, ఆట వస్తువుల కార్ఖానా లను, టాయ్ మ్యూజియమ్ లను వర్చువల్ మాధ్యమం ద్వారా సందర్శించే అవకాశాలతో పాటు అనేక రకాలైన కార్యకలాపాల లో పాల్గొనే అవకాశం కూడా ఈ మేళా ద్వారా దక్కనుంది.
***
(Release ID: 1700810)
Visitor Counter : 193