వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 16.56% పెరిగిన వరి సేకరణ

మొత్తం సేకరించిన 202.82 లక్షల మెట్రిక్ టన్నులలో పంజాబ్ వాటా 30.79%

3,09,307.12 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజలను సేకరించిన ప్రభుత్వ సంస్థలు

పప్పుధాన్యాలు, నూనె గింజల సేకరణతో 1,67,752 మంది రైతులకు ప్రయోజనం

26,605.19 కోట్ల రూపాయల విలువ చేసే 91,68,064 పత్తి బేళ్ల సేకరణ

Posted On: 24 FEB 2021 11:41AM by PIB Hyderabad

2020 -21 ఖరీఫ్ పంట మార్కెటింగ్  సీజన్ లో కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఖరీఫ్ పంటలను రైతుల నుంచి ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది . గత సీజన్లలో మాదిరిగానే ఈ ఏడాది కూడా అమలులో ఉన్న కనీస మద్దతు ధర పథకం కింద ఈ కార్యక్రమం అమలు జరుగుతున్నది.
వరిని పండిస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పంట సేకరణ సజావుగా సాఫీగా సాగుతున్నది.   ప్రస్తుత ఖరీఫ్ 2020-21 సీజన్ లో 22.02.2021 వరకు  పంజాబ్, హర్యానా , ఉత్తరప్రదేశ్ , తెలంగాణా, ఉత్తరాఖండ్ ,తమిళనాడు, చండీఘర్, జమ్మూ కాశ్మీర్, కేరళ,గుజరాత్, ఆంధ్రప్రదేశ్,ఛత్తీస్ ఘర్, ఒడిశా, మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర ,బీహార్, ఝార్ఖండ్, అస్సాం, కర్ణాటక ,పశ్చిమ బెంగాల్ మరియు త్రిపుర   రాష్ట్రాలలో రైతుల నుంచి  658.61  లక్షల మిలియన్ టన్నులకు పైగా  వరిని సేకరించడం  జరిగింది.  గత ఏడాది ఇదే సమయానికి రైతుల నుంచి 565. 03 లక్షల మిలియన్ టన్నుల వరిని కొనుగోలు చేయడం జరిగింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఇంతవరకు వరి సేకరణ 16.56% పెరిగింది.  సేకరించిన  మొత్తం 658.61  లక్షల మిలియన్ టన్నుల వరిలో 30.79 శాతం అంటే 202.82 లక్షల మిలియన్ టన్నులను ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే  సేకరించడం జరిగింది.

 

ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో ఇంతవరకు 1,24,345.66  కోట్ల రూపాయల విలువ చేసే వరిని 95.23  లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ వారినుంచి  సేకరించడం జరిగింది.

 

 

     ఇంతే కాకుండా రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ కాలం 2020లో  రైతుల నుంచి ధర మద్దతు పధకం (పిఎస్ఎస్ ) కింద 51.92   లక్షల మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు, నూనె గింజలను కొనుగోలు చేయడానికి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీనితోపాటు  1.23 లక్షల మిలియన్ టన్నుల ఎండు కొబ్బరిని రైతుల నుంచి కొనుగోలు చేయడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు అనుమతులు జారీ అయ్యాయి. దీనితోపాటు  2020-21 రబీ మార్కెటింగ్ సీజన్ లో రైతుల నుంచి 26.69 లక్షల మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజలను సేకరించడానికి గుజరాత్, మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మరియు  తమిళనాడు రాష్ట్రాలకు అనుమతులు జారీ అయ్యాయి. ప్రతిపాదనలు అందిన వెంటనే ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ధర మద్దతు పధకం కింద  పప్పు ధాన్యాలు,నూనె గింజలు, కొబ్బరిని  సేకరించడానికి అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది. దీనివల్ల 2020-21 ఖరీఫ్ పంట కాలంలో  నిర్ణీత గ్రేడ్ కలిగిన ఈ పంటలను నమోదు చేసుకున్న రైతుల నుంచి ఆయా రాష్ట్రాలలో కనీస మద్దతు ధర కన్నా మార్కెట్ ధర తగ్గినప్పుడు కేంద్రం నియమించే నోడెల్ ఏజెన్సీల ద్వారా రాష్ట్రాలు నియమించే సేకరణ ఏజెన్సీల  ద్వారా  కనీస మద్దతు ధరకు నేరుగా సేకరించడానికి అవకాశం కలుగుతుంది.

22.02.2021 వరకు ప్రభుత్వం తన ఏజెన్సీల ద్వారా 1,665.82  కోట్ల రూపాయల విలువ చేసే 3,,09,037.12  మిలియన్ టన్నుల సెనగలు, వేరుశెనగ, సోయాబీన్ మరియు మినుములను సేకరించింది. దీనివల్ల తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాలలో 1,67,752  మంది రైతులు లబ్ది పొందారు. 2020-21 రబీ పంటకాలంలో ఆంధ్రప్రదేశ్ లో 23 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ వారి నుంచి 0.19 కోట్ల రూపాయల విలువ చేసే 37.85 మిలియన్ టన్నుల పెసలను సేకరించడం జరిగింది. 

 

 



    ఇదేవిధంగా కర్నాటక మరియు తమళనాడులలో 3961 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ వారినుంచి 52.40  కోట్ల రూపాయల విలువ చేసే 5089  మిలియన్ టన్నుల ఎండుకొబ్బరిని 22.02.2021 నాటికి సేకరించడం జరిగింది. కొబ్బరి, మినుములు ఎక్కువగా సాగవుతున్న రాష్ట్రాలలో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు  ఖరారు చేసే తేదీ నుంచి ఖరీఫ్ పప్పు ధాన్యాలు నూనె గింజలు మార్కెట్టుకు రావడం ప్రారంభించిన తరువాత సేకరణ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

          2020 -21 ఖరీఫ్ పంట కాలంలో పత్తిగింజల సేకరణ పంజాబ్, హర్యానా,రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్,  తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మరియు కర్ణాటక రాష్ట్రాలలో చురుగ్గా సాగుతున్నది. 22.02.2021 నాటికి  కనీస మద్దతు ధర  పథకం కింద 26,705.19 కోట్ల  రూపాయల విలువచేసే  91,68,064  బేళ్ల పత్తిని 18,95,966మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ సేకరించడం జరిగింది.

***


(Release ID: 1700405) Visitor Counter : 187