కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
బీమా పరిధిలోని కార్మికుల, మహిళల ప్రయోజనార్థం ఇ.ఎస్.ఐ.సి. ప్రధాన నిర్ణయాలు
Posted On:
23 FEB 2021 6:13PM by PIB Hyderabad
కార్మిక రాజ్య బీమా సంస్థ (ఇ.ఎస్.ఐ.సి.) సేవల యంత్రాగాన్ని మెరుగుపరిచేందుకు, బీమా పరిధిలోని ఉద్యోగుల వైద్యపరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు సంబంధించి ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ స్వతంత్ర హోదా సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ అధ్యక్షతన 2021 ఫిబ్రవరి 22వ తేదీన జరిగిన ఇ.ఎస్.ఐ.సి. 184వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
నిర్ణయాల ముఖ్యాంశాలు
|
- బీమా పరిధిలో ప్రసూతి ప్రయోజాలను పొందే మహిళల అస్వస్తతా ప్రయోజనాలకు
సంబంధించిన షరతుల సడలింపు
|
- అస్వస్థత, ప్రసూతి ప్రయోజనాలకు సంబంధించి 2021 జనవరి నుంచి జూన్ వరకూ గల వ్యవధికి
షరతుల సడలింపు.
|
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో 50సూపర్ స్పెషాలటీ పడకలతో సహా మొత్తం 300 పడకల ఆసుపత్రిని
నిర్మాణానికి ఇస్.ఎస్.ఐ.సి. నిర్ణయం.
|
- ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఆదనంగా 50 పడకల ఎస్.ఎస్.టి. విభాగంతో సహా 350 పడకల ఆసుపత్రి
నిర్మాణం.
|
- తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్.లో ఉన్న ఇ.ఎస్.ఐ.సి. సూపర్ స్పెషాలటీ ఆసుపత్రి, మెడికల్ కళాశాలలో
నెగిటెవ్ ప్రెషర్ ఐ.సి.యు. ఏర్పాటు.
|
- 2020-21, 2021-22 సంవత్సరాలకు సవరించిన అంచనాలను, బడ్జెట్ అంచనాలను
2021-22వ సంవత్సరానికి ఫెర్మార్మెన్స్ బడ్జెట్ ను ఇ.ఎస్.ఐ.సి. ఆమోదించింది.
|
- బీమా పరిధిలో ప్రసూతి ప్రయోజాలను పొందే మహిళల అస్వస్తతా ప్రయోజనాలకు సంబంధించిన షరతుల సడలింపు
ప్రసూతి ప్రయోజనాలు పొందే వ్యవధిని ఇదివరకటి 12 నెలలనుంచి 26నెలలకు పెంచిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో బీమా పరిధిలోని మహిళలు తమ ప్రసూతి ప్రయోజనాల అనంతరం లభించే అస్వస్తత ప్రయోజనాలకు అర్హలు కాలేకపోతున్నారు. కనీసం 78 రోజులు సేవలందించాలన్న షరతును నెరవేర్చలేకపోతున్నందున ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో బీమా పరిధిలోని మహిళలు సేవలందించే రోజుల సంఖ్య సగంవరకే ఉన్నా ప్రసూతి అనంతర అస్వస్థతా ప్రయోజనాలకు వారిని అర్హులుగా చేయాలని ఇ.ఎస్.ఐ.సి. తాజా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా షరతులను, నిబంధనలను కూడా సడలించారు. ఈ సడలింపు సదుపాయం 2017 జనవరి 20వ తేదీనుంచి అమలులోకి వచ్చినట్టు పరిగణిస్తారు.
- అస్వస్థత, ప్రసూతి ప్రయోజనాలకు సంబంధించి 2021 జనవరి నుంచి జూన్ వరకూ గల వ్యవధికి షరతుల సడలింపు.
దేశంలో కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి నిరోధాకి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఆంక్షలతో పలు ఫ్యాక్టరీలు, సంస్థలు కొన్ని నెలలపాటు మూతబడ్డాయి. దీనితో బీమా పరిధిలో ఉన్న పలువురు పురుషులు, మహిళలు తప్పనిసరిగా సేవలందించవలసిన పనిరోజులకు సంబంధించిన నిబంధనను పాటించడం సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో బీమా పరిధిలోని ఉద్యోగుల కష్టాలను పరిశీలనలోకి తీసుకున్న ఇ.ఎస్.ఐ.సి. వారికి తగిన సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. 2021 జనవరి ఒకటవ తేదీనుంచి 2021 జూన్ నెలాఖరువరకూ, గల కాలానికి సంబంధించి ఈ విషయంలో షరతులను సడలించాలని, వారు ప్రసూతి, అస్వస్థత ప్రయోజనాలను వినియోగించుకునేలా చూడాలని ఇ.ఎస్.ఐ.సి. నిర్ణయించింది.
ఈ నిర్ణయం మేకు ప్రస్తుతం బీమా పరిధిలోని మహిళలు తమ వేతనంతో కూడిన సేవల 35 రోజులకు తగ్గకుండా ఉండే పక్షంలో వారు ప్రసూతి ప్రయోజనాలకు అర్హత పొందుతారు. బీమాపరిధిలోని ఉద్యోగులు, మహిళలు 2020, ఎప్రిల్-సెప్టెంబరు నెలలకు ముందే నియమితులైన పక్షంలో వారు,.. 2019 సెప్టెంబరు-2020 మార్చి నెలల్లో అందించిన సేవలను ప్రాతిపదికగా తీసుకుని ప్రసూతి, అస్వస్థత ప్రయోజనాలకు అర్హతను నిర్ణయిస్తారు. అస్వస్థత, ప్రసూతి ప్రయోజనాలకు సంబంధించి 2021 జనవరి నుంచి జూన్ వరకూ గల వ్యవధికి కూడా
అమలులో ఉన్నషరతులను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో 50సూపర్ స్పెషాలటీ పడకలతో సహా మొత్తం 300 పడకల ఆసుపత్రిని నిర్మించనున్న ఇస్.ఎస్.ఐ.సి.:
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్, పరిసర జిల్లాల్లోని బీమా ఉద్యోగుల వైద్య అవసరాలను నెరవేర్చేందుకు హరిద్వార్ లో ఐదెకరాల విస్తీర్ణంలో 300 పడకల ఆసుపత్రిని నిర్మించాలని ఇ.ఎస్.ఐ.సి. నిర్ణయించింది. ఈ ఆసుపత్రిలో 50 పడకలను సూపర్ స్పెషాలటీ సదుపాయాలతో ఏర్పాటు చేయాలని, ఉద్యోగుల నివాసంకోసం క్వార్టర్స్ ను నిర్మించాలని కూడా నిర్ణయించారు. ఈ ఆసుపత్రి నిర్మాణంతో 2.55లక్షల మంది బీమా పరిధిలోని ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య చికిత్సా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
- ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఆదనంగా 50 పడకల ఎస్.ఎస్.టి. విభాగంతో సహా 350 పడకల ఆసుపత్రి నిర్మాణం.:
బీమా పరిధిలోని ఉద్యోగులకు మంచి వైద్య సదుపాయాలను కల్పించేందుకు, వైద్య మౌలక సదుపాయాలను బలోపేతం చేసేందుకు తీసుకున్న దృఢ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని అంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో 350 పడకల ఆసుపత్రిని నిర్మించే ప్రాజెక్టుకు ఇ.ఎస్.ఐ.సి. ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలోని షీలానగర్ లో దాదాపు 8.72 ఎకరాల స్థలంలో ఈ ఆ,సుపత్రిని నిర్మించనున్నారు. ఈ ఆసుపత్రి ఆవరణలో అదనంగా 50పడకలతో ఎస్.ఎస్.టి. విభాగాన్ని ఏర్పాటు చేయడంతోపాటుగా, 128 ఉద్యోగ నివాసాలను కూడా నిర్మించనున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణంతో విశాఖపట్నంతో పాటు పరిసర ప్రాంతాల్లోని 14లక్షలమంది ఇ.ఎస్.ఐ.సి. బీమా పరిధిలో ఉన్న వారికి వైద్యసేవలందనున్నాయి.
- తెలంగాణలోని హైదరాబాద్ ఇ.ఎస్.ఐ.సి. సూపర్ స్పెషాలటీ ఆసుపత్రి, మెడికల్ కళాశాలలో నెగిటెవ్ ప్రెషర్ ఐ.సి.యు. ఏర్పాటు.:
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఉన్న ఇ.ఎస్.ఐ.సి. సూపర్ స్పెషాలటీ ఆసుపత్రిలో నెగిటివ్ ప్రెషర్ ఐ.సి.యు. విభాగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. నెగిటెవ్ ప్రెషర్ ఐ.సి.యు. ఏర్పాటుతో ఆరోగ్య రక్షణ సిబ్బందికి ఇన్ ఫెక్షన్ సోకే అవకాశాలు తగ్గుతాయి. అలాగే, ఐ.సి.యు.లోని విషమ పరిస్థితిలో చికిత్సపొందుతున్న రోగులకు ఉద్యోగులనుంచి ఇన్ ఫెక్షన్ సోకే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.
- 2020-21, 2021-22 సంవత్సరాలకు సవరించిన అంచనాలను, బడ్జెట్ అంచనాలను
2021-22వ సంవత్సరానికి ఫెర్మార్మెన్స్ బడ్జెట్ ను ఇ.ఎస్.ఐ.సి. ఆమోదించింది.:
2020-21, 2021-22 సంవత్సరాలకు సవరించిన అంచనాలను, బడ్జెట్ అంచనాలను కూడా ఇ.ఎస్.ఐ.సి. ఆమోదించింది. 2021-22వ సంవత్సరానికి సంబంధించి ఫెర్మార్మెన్స్ బడ్జెట్ ను ఇ.ఎస్.ఐ.సి. ఆమోదించింది.
- వీటితో పాటుగా, సేవల యంత్రాంగం మెరుగుదలకు సంబంధించి అజెండాలోని 25 ఇతర అంశాలను కూడా ఆమోదించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, అదనపు కార్యదర్శి అనూరాధ, ఇ.ఎస్.ఐ.సి. డైరెక్టర్ జనరల్, ఇ.ఎస్.ఐ.సి.కి చెందిన ఇతర గౌరవ సభ్యులు, ఇ.ఎస్.ఐ.సి. ఆర్థిక వ్యవహారాల కమిషనర్ సంధ్యా శుక్లా, ఇ.ఎస్.ఐ.సి. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గరిమా భట్, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
*******
(Release ID: 1700351)
Visitor Counter : 231