కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పిజిపి గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్ర‌స్తావించిన‌ వివిధ స‌ముపార్జ‌న‌ల ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం తెలిపిన సిసిఐ

Posted On: 23 FEB 2021 11:22AM by PIB Hyderabad

పిర‌మ‌ల్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ (పిజిపిఎల్‌)కు చెందిన గాజు వ‌స్తువుల ప్యాకేజింగ్‌, గాజు వ‌స్తువుల అలంక‌ర‌ణ ఉత్ప‌త్తి వ్యాపారాన్ని (ii) గాజు వ‌స్తువుల ప్యాకేజింగ్‌, గాజు వ‌స్తువుల డికొరేష‌న్ ఉత్పత్తి/  లేక అమ్మ‌కాల‌లో నిమ‌గ్న‌మై ఉన్న పిజిపిఎల్ అనుబంధ సంస్థ‌ల‌లో వాటా (iii) వివిడ్ గ్లాస్ ట్రేడింగ్ ఎఫ్‌జెడ్ సిఒ (వివిడ్ ట్రేడింగ్‌)లో కొంత వాటా, () అన్సాపాక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కొన్ని వ్యాపార విభాగాల‌ను కాంపిటీష‌న్ యాక్ట్‌, 2002లోని సెక్ష‌న్ 31(1) కింద పిజిపి గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసేందుకు కాంపిటీష‌న్ క‌మిటీ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది. 
ప్ర‌తిపాదిత క‌ల‌యిక ప్ర‌యోజ‌నం కోసం ఇటీవ‌లే కొనుగోలుదారును ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. అది బిసిపి టాప్‌కో వి ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ‌. ఇది బ్లాక్‌స్టోన్ అనుబంధ సంస్థ‌ల సూచిత నిధులు/  లేక నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి లావాదేవీలు జ‌రిపే అనుబంధ వ్య‌వ‌స్థ‌. 
భార‌తీయ చ‌ట్టాల కింద ఏర్పాటు చేసిన ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పిజిపిఎల్‌. ఈ సంస్థ గ్లాస్ ప్యాకేజింగ్‌, గ్లాస్ డెకొరేష‌న్ ఉత్ప‌త్తి, సౌంద‌ర్య సాధ‌నాలు, ప‌రిమ‌ళాలు, ప్ర‌త్యేక ఆహార‌ప‌దార్ధాలు, పానీయాలు, ఔష‌ధ ప‌రిశ్ర‌మ‌ల‌కు అమ్మ‌కాల‌ను , సేవ‌ల‌ను అందిస్తోంది. పిజిపిఎల్‌కు అజ‌య్ పిర‌మ‌ల్‌, కుటుంబం య‌జ‌మానులు. ఈ సంస్థ  ఫార్మా, ఆర్థిక సేవ‌లు, రియ‌ల్ ఎస్టేట్‌, గ్లాస్ ప్యాకేజింగ్ వంటి భిన్న ప్ర‌యోజ‌నాల‌తో కూడా అంత‌ర్జాతీయ వాణిజ్య సంస్థ పిర‌మ‌ల్ గ్రూప్‌కు చెందింది. 
ప్ర‌తిపాదిత క‌ల‌యికలో పేర్కొన్న పిజిపిఎల్ అనుబంధ సంస్థ‌లు - అన్సా డెకో గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ (అన్సా డెకొ), కొసాంబో గ్లాస్ డెకొ ప్రైవేట్ లిమిటెడ్ (కొసాంబో గ్లాస్‌), పిర‌మ‌ల్ గ్లాస్ (యుకె) లిమిటెడ్ (పిర‌మ‌ల్ గ్లాస్ యుకె), పిర‌మ‌ల్ గ్లాస్ యూరోప్ ఎస్‌.ఎ.ఆర్.ఎల్‌. (పిర‌మ‌ల్ గ్లాస్ యూరోప్‌), పిర‌మ‌ల్ గ్లాస్ సిలోన్ పిఎల్‌సి (పిర‌మ‌ల్ గ్లాస్ సిలోన్‌), పిర‌మ‌ల్ గ్లాస్ -యుఎస్ఎ, ఐఎన్‌సి, (పిర‌మ‌ల్ యుఎస్ అనుబంధసంస్థ‌). ఈ అనుబంధ సంస్థ‌ల‌న్నీ విస్త్ర‌తంగా గ్లాస్ ప్యాకేజింగ్‌, గ్లాస్ డెకొరేష‌న్ ఉత్ప‌త్తి / అమ్మ‌కాల వ్యాపారంలో నిమ‌గ్న‌మై ఉన్నాయి. 
వివిడ్ ట్రేడింగ్ సంస్థ దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఫ్రీజోన్ అథారిటీ, దుబాయ్‌లో న‌మోదు చేసి, విలీనం చేసిన సంస్థ‌.  వివిడ్ గ్లాస్ డిస్ట్రిబ్యూష‌న్ ఎఫ్‌జెడ్‌సిఒ పూర్తిగా స్వంతం చేసుకున్న అనుబంధ సంస్థ వివిడ్ ట్రేడింగ్‌. ఇది గాజు సీసాల వ్యాపారం చేస్తుంది. వివిడ్ ట్రేడింగ్ అనేది స్వ‌తంత్ర సంస్థ‌, ఇది పిజిపిఎల్ అనుబంధ లేక అనుబ‌ద్ధ సంస్థ కాదు. 
అన్సాప్యాక్ అన్న‌ది భార‌త‌దేశానికి చెందిన ప్రైవేట్ కంపెనీ. ఇది మ‌డ‌త‌లుపెట్ట‌గ‌ల పెట్టెలు (corrugation boxes ), ప్లాస్టిక్ ఫిల్మ్‌లు స‌హా ప్యాకేజింగ్ సామాగ్రి ఉత్ప‌త్తి, అమ్మ‌కాల లావాదేవీలు సాగిస్తోంది.  అన్సాప్యాక్ స్వ‌తంత్ర కంపెనీ. ఇది పిజిపిఎల్ అనుబంధ లేక అనుబ‌ద్ధ సంస్థ కాదు. 
ఇందుకు సంబంధించిన సిసిఐ వివ‌ర‌ణాత్మ‌క ఉత్త‌ర్వులు జారీ కానున్నాయి. 

***(Release ID: 1700199) Visitor Counter : 12