భారత పోటీ ప్రోత్సాహక సంఘం
"ఏపీఐ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్" ఈక్విటీ వాటాల కొనుగోలుకు "సీడీపీక్యూ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్"కు సీసీఐ అనుమతి
Posted On:
23 FEB 2021 11:26AM by PIB Hyderabad
"ఏపీఐ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్" (లక్షిత సంస్థ)కు చెందిన ఈక్విటీ వాటాలను కొనుగోలు చేయడానికి, "సీడీపీక్యూ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్" (కొనుగోలు సంస్థ)కు, పోటీ చట్టం-2002లోని 31(1) సెక్షన్ కింద, "కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా" (సీసీఐ) అనుమతినిచ్చింది.
లక్షిత సంస్థలో దాదాపు 2 శాతం వాటాల కొనుగోలుతోపాటు, మరికొన్ని హక్కులను కొనుగోలు సంస్థ పొందేలా ఒప్పందం ఉంది.
కొనుగోలు సంస్థ, సింగపూర్ కంపెనీ అయిన సీడీపీక్యూ సంపూర్ణ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. సంస్థాగత పెట్టుబడి సంస్థగా పనిచేసే సీడీపీక్యూ; ప్రభుత్వ, పారా-పబ్లిక్ పింఛను, బీమా పథకాల నిధులను ప్రధానంగా నిర్వహిస్తుంది. సీడీపీక్యూ అనేది కెనడియన్ సంస్థాగత నిధి. కెనడాలోని క్యూబెక్ నగరంలో, ప్రభుత్వ, ప్రైవేటు పింఛను, బీమా నిధులు కలిగిన 40కి పైగా డిపాజిట్ సంస్థలను నిర్వహిస్తూ, సేవలు అందిస్తోంది.
ఏపీఐ హోల్డింగ్స్ భారతీయ సంస్థ. ఏపీఐ హోల్డింగ్స్ గ్రూపు సంస్థలకు ఇది మాతృ సంస్థ. ఇది నేరుగాగానీ, తన అనుబంధ సంస్థల ద్వారాగానీ ఈ క్రింద పేర్కొన్నవాటితోపాటు వివిధ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
(ఎ) ఔషధాల టోకు అమ్మకాలు, సరఫరా (ఔషధ ఉత్పత్తులు, వైద్య పరికరాలు సహా)
(బి) ఔషధ రంగంపై ప్రత్యేక దృష్టితో రవాణా సేవలు
(సి) ఔషధ ఉత్పత్తులు, వైద్య పరికరాలు, ఓటీసీ ఔషధాల అమ్మకాల కోసం మార్కెట్లు సహా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారాలను అభివృద్ధి చేసేందుకు సాంకేతికత, మేధో సంపత్తిని కలిగి ఉండటం
(డి) ఔషధాలు, ఆయుర్వేద, పోషక ఉత్పత్తులు, వైద్య, పరికరాలు, పరిశుభ్రత ఉత్పత్తులు, ప్రాణాధార మందులు, మూలిక ఉత్పత్తులు, ఆహార భర్తీ పదార్ధాల తయారీ, మార్కెటింగ్
(ఇ) ఔషధ ఉత్పత్తులు, వైద్య పరికరాలు, ఓటీసీ ఔషధాల చిల్లర వర్తకులు, పంపిణీదారుల కోసం 'బిజినెస్ టు బిజినెస్' (బీ2బీ) ఆర్డర్ల నిర్వహణ వ్యవస్థను అందించే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారాన్ని నిర్వహించడం, అందించడం
వాటాల కొనుగోలుకు సంబంధించి సీసీఐ సంపూర్ణ ఆదేశాలు త్వరలోనే విడుదలవుతాయి.
***
(Release ID: 1700160)
Visitor Counter : 152