ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వైద్య సిబ్బంది మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లు ముందుకు వచ్చి కొవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్ హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు.
మీ అంకితభావం మరియు త్యాగనిరతికి దేశం రుణపడి ఉంది- డాక్టర్ హర్షవర్ధన్
"తప్పుడు సమాచారం మరియు అబద్ధాల ప్రచారాలకు బలికాకండి"
"మనదేశానికి చెందిన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అనుమతి ఇచ్చిన రెండు టీకాలూ సురక్షితమైనవి మరియు వ్యాధినిరోదకతను పెంచేవి"
Posted On:
19 FEB 2021 6:26PM by PIB Hyderabad
వైద్య సిబ్బంది మరియు ఫ్రంట్‌లైన్ కార్మికులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య సంరక్షణ మరియు ఫ్రంట్‌లైన్ కార్మికులకు 1 కోటికి పైగా వ్యాక్సిన్ మోతాదులను అందించడం ద్వారా దేశం ఈ రోజు ప్రధాన మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగా కొవిడ్19 టీకా డ్రైవ్‌ను 2021 జనవరి 16 న ప్రధానమంత్రి ప్రారంభించారు.
వైద్యులు, నర్సులు, పారామెడిక్ కార్మికులు, అంగన్‌వాడీ కార్మికులు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు వంటి ఫ్రంట్‌లైన్ కార్మికులందరికీ కేంద్ర ఆరోగ్య మంత్రి విజ్ఞప్తి చేశారు. “వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని నేను అందరు ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ కార్మికులకు వినయంగా మరియు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కొవిడ్-19 కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మనమందరం కలిసి పనిచేద్దాం. వ్యాధి నుండి ప్రపంచానికి ఇంకా విముక్తి లభించలేదు. మన సమిష్టి కృషితోనే ఈ ప్రజారోగ్య సవాలును అధిగమించగలం. ” అని చెప్పారు.
గ్లోబల్ మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఈ విజయాన్ని ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్న డాక్టర్ హర్షవర్ధన్ “1,01,88,007 టీకాల మైలురాయిని సాధించడానికి భారతదేశానికి కేవలం 34 రోజులు పట్టింది. ఇది ప్రపంచంలో రెండవ అత్యంత వేగవంతమైనది. 2.11 లక్షలకు పైగా సెషన్లు (2,11,462 సెషన్లు) ద్వారా 62,60,242 హెల్త్‌కేర్ వర్కర్స్ (హెచ్‌సిడబ్ల్యు) మొదటి వ్యాక్సిన డోస్ పొందారు; 6,10,899 హెచ్‌సిడబ్ల్యులకు 2 వ డోసు ఇవ్వబడింది. అలాగే 33,16,866 మంది ఫ్రంట్‌లైన్ కార్మికులకు (ఎఫ్‌ఎల్‌డబ్ల్యు) 1 వ మోతాదు ఇచ్చారు. ” అని చెప్పారు.
ఈ ఘనతను సాధ్యం చేసిన రెండు టీకాలపై (కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్) మాట్లాడుతూ, “దేశ డ్రగ్స్ కంట్రోలర్ ఆమోదించిన రెండు కోవిడ్ వ్యాక్సిన్లు వాటి భద్రత మరియు రోగనిరోధక శక్తి కోసం పరీక్షించబడ్డాయి మరియు ధృవీకరించబడ్డాయి. అవి పూర్తిగా సురక్షితం. ఇమ్యునైజేషన్ (ఏఈఎఫ్‌ఐ) తరువాత ఆస్పత్రుల్లో ప్రతికూల ప్రభావానికి గురైన కేసులు 40 మాత్రమే నమోదయ్యాయి. ఇవి మొత్తం టీకాలలో 0.0004% మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు తీవ్రమైన ఏఈఎఫ్‌ఐ ఘటనలు నమోదు కాలేదు. టీకాల కారణంగా ఎటువంటి మరణం సంభవించలేదు. ఇప్పటి వరకు నివేదించబడిన 32 మరణాలు మొత్తం టీకాలలో కేవలం 0.0003% మాత్రమే, పోస్ట్‌మార్టం నివేదికలతో ఇవి టీకాలకు సంబంధించినవి కావని వెల్లడయిందని. ” అని చెప్పారు.
అనంతరం డాక్టర్ హర్షవర్ధన్ దేశంలో టీకా యొక్క క్రమాన్ని వివరించారు. మొదటి డోసు తీసుకుని 28 రోజులు పూర్తయిన లబ్ధిదారుల కోసం కొవిడ్19 టీకా యొక్క 2 వ మోతాదు 2021 ఫిబ్రవరి 13 న ప్రారంభమైంది. ఎఫ్‌ఎల్‌డబ్లూల టీకాలు 2021 ఫిబ్రవరి 2 న ప్రారంభమయ్యాయి.
2021 ఫిబ్రవరి 20 లోపు టీకా కోసం కో-విన్ యాప్‌లో రిజిస్టర్ చేయబడిన అందరు హెచ్‌సిడబ్ల్యులను షెడ్యూల్ చేయాలని మరియు 2021 ఫిబ్రవరి 25 లోపు మిగిలిన హెచ్‌సిడబ్ల్యుల కోసం మోప్-అప్ రౌండ్ల ద్వారా షెడ్యూల్ చేయాలని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించారు. 2021 మార్చి 1 నాటికి కనీసం ఒకసారి టీకాలు వేయడానికి మరియు 2021 మార్చి 6 నాటికి లెఫ్ట్- అవుట్ ఎఫ్‌ఎల్‌డబ్లూలకు మోప్-అప్ ద్వారా షెడ్యూల్ చేయవలసి ఉంది.
కొవిడ్-19 నుండి వైద్య సమాజాన్ని టీకా ఎలా కాపాడుతుందన్న విషయాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు “ కొవిడ్-19 అన్ని వర్గాల ప్రజల జీవితాలలో అపారమైన అనిశ్చితులను సృష్టించింది. అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందని, పేద మరియు ధనవంతులు ఇలా అన్ని వర్గాలు ఒకేలా ప్రభావితమయ్యాయి; అయితే చికిత్స, నిఘా మరియు నియంత్రణ కార్యకలాపాలలో వృత్తిపరమైన నిబద్ధత కారణంగా మన వైద్యులు మరియు నర్సులు, పారామెడిక్స్, ఫ్రంట్ లైన్ కార్మికులు వ్యాధి బారిన పడ్డారు. నర్సింగ్ నిపుణులు రోగుల ప్రత్యక్ష సంరక్షణలో పాలుపంచుకున్నందున ఆరోగ్య వ్యవస్థ యొక్క విజయవంతమైన పనితీరుకు వారు కీలకమైన ఆధారం.కొవిడ్-19 రోగులకు అంకితమైన సంరక్షణను అందిస్తూ చాలా మంది ఆరోగ్య కార్యకర్తలు ఈ వ్యాధికి గురయ్యారు. ఈ కారణంగా వారికి కొవిడ్-19 టీకాలు అందించడంలో ప్రాముఖ్యం ఇవ్వబడింది. తద్వారా వారు వ్యాధి నుండి రక్షించబడతారు” అని చెప్పారు.
డాక్టర్ హర్షవర్ధన్ ఈ విషయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తూ "వారి వృత్తిపరమైన అంకిత భావాన్ని పూర్తి చిత్తశుద్ధితో అనుసరిస్తూ నిరంతరాయంగా నిబద్ధత మరియు నిలకడతో పనిచేసిన వైద్య సిబ్బందికి దేశం రుణపడి ఉంది అలాగే వారికి చాలా కృతజ్ఞతలు". "మీ నిస్వార్థ కర్తవ్యం మరియు నిబద్ధత కారణంగానే, భారతదేశం అత్యల్ప కొవిడ్ మరణాల రేటును కలిగి ఉంది మరియు అత్యధిక రికవరీ రేట్లు కలిగిన దేశాలలో ఒకటిగా నిలిచింది." అని తెలిపారు.
సమాజం జరుగుతున్న వాస్తవ విరుద్దమైన తప్పుడు ప్రచారాల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ " కొవిడ్-19 మహమ్మారితో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న టీకా డ్రైవ్‌పై దురదృష్టవశాత్తు తప్పుడు ప్రచారం జరుగుతోంది. పుకార్లు మరియు ప్రతికూల సందేశాలు పలువురిని ప్రభావితం చేస్తున్నాయి. టీకా వల్ల వంధ్యత్వం, టీకాలు వేసిన తరువాత మద్యం సేవించినట్లయితే దుష్ఫ్రభావాలు ప్రభావాలు వస్తాయంటూ జరుగుతున్నవి తప్పుడు ప్రచారాలు. వీటిని మొగ్గ దశలోనే తొలిగించాల్సిన అవసరం ఉంది. 1 కోటికి పైగా డోసులను విజయవంతంగా మరియు సురక్షితంగా నిర్వహించబడుతుడడమే టీకాల భద్రతకు సాక్ష్యం. అందువల్లు ఈ పుకార్లకు బలైపోకుండా ఉండండి. ” అని సూచించారు.
***
(Release ID: 1699594)
Visitor Counter : 310