కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
జాతీయ సర్వేల సాఫ్ట్ వేర్ అప్లికేషన్లు మార్గదర్శకాలు, ప్రశ్నావళిని రేపు విడుదల చేయనున్న గాంగ్వర్
Posted On:
17 FEB 2021 2:33PM by PIB Hyderabad
జాతీయస్థాయిలో లేబర్ బ్యూరో నిర్వహించనున్న అయిదు సర్వేలకు సంబందించిన సాఫ్ట్ వేర్ అప్లికేషన్లు, మార్గదర్శకాలు మరియు ప్రశ్నావళిని రేపు చండీఘర్ లో కేంద్ర కార్మిక ఉపాధి కల్పనాశాఖ సహాయ మంత్రి ( స్వతంత్ర) శ్రీ సంతోష్ కుమార్ గాంగ్వర రేపు ( గురువారం) విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వా చంద్ర మరియు సీనియర్ కార్మిక, ఉపాధి సలహాదారు, లేబర్ బ్యూరో డైరెక్టర్ జనరల్ శ్రీ డిపిఎస్ నేగి పాల్గొంటారు .
లేబర్ బ్యూరో ఈ కింది అయిదు సర్వేలను జాతీయ స్థాయిలో నిర్వహించనున్నది.
* వలస కార్మికులపై అఖిల భారత సర్వే
* గృహాలలో పనిచేస్తున్న కార్మికులపై అఖిల భారత సర్వే
* నిపుణులు అందిస్తున్న ఉపాధి అవకాశాలపై అఖిల భారత సర్వే
* రవాణా రంగం కల్పించిన ఉపాధి అవకాశాలపై అఖిల భారత సర్వే
*సంస్థల నుంచి లభిస్తున్న ఉపాధిపై అఖిల భారత స్థాయిలో త్రైమాసిక సర్వే
జాతీయస్థాయితో పాటు ప్రధాన రాష్ట్రాలలో కార్మిక శక్తిలో గృహాలలో పనిచేస్తున్న వారి శాతం / వీరికి పని కల్పిస్తున్న గృహాల సంఖ్యలను సామజిక భౌగోళిక అంశాల ప్రాతిపదికగా గణించాలన్న లక్ష్యంతో గృహాలలో పనిచేస్తున్న కార్మికుల సర్వేను నిర్వహించనున్నారు.
దేశంలో వున్న వలస కార్మికుల సంఖ్యను గుర్తించడంతో పాటు వారి జీవనస్థితిగతులు, వారు పనిచేస్తున్న పరిస్థితులు వారి సామాజిక ఆర్ధిక స్థితిగతులను నిర్ధారించడానికి వలస కార్మికుల సర్వే జరగనున్నది.
దేశంలో ఉన్న నిపుణుల సంఖ్యను నిర్ధారించి, వీరు అందిస్తున్న ఉపాధి అవకాశాలను తెలుసుకోవాలన్న రెండు లక్ష్యాలతో నిపుణులు అందిస్తున్న ఉపాధి అవకాశాలపై అఖిల భారత సర్వేను నిర్వహించనున్నారు.
రవాణా రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్యను నిర్ధారించడానికి రవాణా రంగం కల్పించిన ఉపాధి అవకాశాలపై అఖిల భారత సర్వే జరగనున్నది.
భారత రంగంలో వ్యవసాయంతో సంబంధంలేని ఎనిమిది ప్రధాన రంగాలలో ఉపాధి కల్పన అవకాశాలలో వచ్చిన మార్పులను తెలుసుకోవడానికి సంస్థల నుంచి లభిస్తున్న ఉపాధిపై అఖిల భారత స్థాయిలో త్రైమాసిక సర్వే ను నిర్వహించనున్నారు.
సమాచార సేకరణ, నివేదికల రూపకల్పన అంశాలలో సాంకేతిక పరిజ్ఞానం (ఐటి) వినియోగాన్ని ఎక్కువ చేయడానికి లేబర్ బ్యూరో చర్యలు తీసుకుంటున్న సమయంలో నిర్వహించనున్న ఈ సర్వేలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆరు నెలల కేత్ర స్థాయి సర్వేలతో సహా మొత్తం సర్వేలు ఏడు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తవుతాయి.
కార్మిక ఉపాధి రంగాలతో సంబంధం వున్నవారికి అవసరమైన సమాచారాన్ని అందించే అంశంలో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న లేబర్ బ్యూరో 1920 నుంచి కీలక పాత్ర పోషిస్తున్నది. ముఖ్యమైన సమాచార సేకరణలో లేబర్ బ్యూరో జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. కార్మికులకు సంబందించిన వివిధ అంశాలు, ధరల సూచీలపై బ్యూరో అందించే సమాచారం విశ్వవనీయంగా సమగ్రంగా ఉంటుందని గుర్తింపు ఉంది.
***
(Release ID: 1698850)
Visitor Counter : 135