జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ ద్వారా 3.5 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నీటి కనెక్షన్లు

2021 జనవరి 1 నుండి 50 లక్షలకు పైగా నీటి కనెక్షన్లు అందించబడ్డాయి

Posted On: 17 FEB 2021 1:38PM by PIB Hyderabad

2024 నాటికి ప్రతి గ్రామీణ గృహానికి కుళాయి ద్వారా నీటి కనెక్షన్‌ను అందించే లక్ష్యంతో 2019 ఆగస్టు 15 న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రకటించిన జల్ జీవన్ మిషన్..3.53 కోట్ల గ్రామీణ గృహ కుళాయి నీటి కనెక్షన్లను అందించడం ద్వారా కొత్త మైలురాయిని చేరుకుంది.  15 ఆగస్టు 2019 నాటికి 18.93 కోట్ల గ్రామీణ కుటుంబాలలో 3.23 కోట్లు (17%) కు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా 3.53 కోట్ల కుళాయి నీటి కనెక్షన్లను అందించడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల నిరంతర ప్రయత్నాలు సహాయపడ్డాయి. ప్రస్తుతం 52 జిల్లాలు మరియు 77 వేల గ్రామాలలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి వారి ఇళ్లలో కుళాయి నీటి సరఫరా లభిస్తుంది. ఇప్పుడు 6.76 కోట్లు (35.24%) అనగా 1/3 వ గ్రామీణ కుటుంబాలు కుళాయిల ద్వారా తాగునీటిని పొందుతున్నాయి. 100% కుళాయి నీటి కనెక్షన్‌ను అందించిన మొట్టమొదటి రాష్ట్రంగా గోవా నిలిచింది తరువాతి స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రాలు / యుటిలు ఇప్పుడు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. దేశంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీటిని అందించాలన్న ప్రధాన లక్ష్యానికి కట్టుబడి ఈ పథకం ముందుకు సాగుతోంది.

త్రాగునీటిని తగినంత పరిమాణంలో మరియు నిర్ణీత, దీర్ఘకాలిక ప్రాతిపదికన అందించే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ రాష్ట్రాల భాగస్వామ్యంతో పనిచేస్తోంది.'బాటప్-అప్ విధానం' అనుసరించి రాష్ట్రాలు / యుటిలు విస్తృతమైన కార్యాచరణ చేపట్టాయి. దీని ప్రకారం, ప్రతి గ్రామీణ గృహానికి కుళాయి నీటి కనెక్షన్‌ను అందించే కార్యాచరణ ప్రణాళికను ధృవీకరించారు.ఈ పథకం అమలులో నీటి నాణ్యత ప్రభావిత ప్రాంతాలు, కరువు పీడిత మరియు ఎడారి ప్రాంతాలలో గ్రామం, షెడ్యూల్డ్ కులం / షెడ్యూల్డ్ తెగ మెజారిటీ గ్రామాలు, ఆశాజనక జిల్లాలు మరియు సంసాద్ ఆదర్ష్ గ్రామ యోజన గ్రామాలకు రాష్ట్రాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

ప్రపంచం మొత్తం కోవిడ్ -19 మహమ్మారితో పోరాడుతున్నందున ఇప్పటివరకు జల్ జీవన్ మిషన్ ప్రయాణం సవాళ్లు మరియు అంతరాయాలతో నిండి ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ సమయంలో అన్ని అభివృద్ధి మరియు నిర్మాణ పనులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మహమ్మారితో పోరాడటానికి వ్యక్తుల భద్రత కోసం తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యమైన సాధనంగా మారింది. భౌతిక దూరం మరియు మాస్క్‌లు ఉపయోగించడం వంటి జాగ్రత్తలను అనుసరించి రాష్ట్రాలు / యుటిలు నీటి సరఫరా మౌలిక సదుపాయాలను నిర్మించడం కొనసాగించాయి. కోవిడ్ -19 ఉన్నప్పటికీ నిరంతర పని గ్రామాలకు ఒక వరం అని నిరూపించబడింది. ఇది వారి గ్రామాలకు తిరిగి వచ్చిన వలసదారులకు ఉపాధి కల్పించింది. గతంలో నగరాల్లో పనిచేసి గ్రామాలకు తిరిగివచ్చిన నిర్మాణ కార్మికులు, మసాన్లు, ప్లంబర్లు, ఫిట్టర్లు, పంప్ ఆపరేటర్లకు ఈ పథకం ద్వారా ఉపాధి లభించింది.

రక్షిత మంచినీటి సరఫరా లేని గ్రామాలకు ప్రాంతాలకు త్రాగునీటిని అందించడం జల్ జీవన్ మిషన్ ప్రధాన లక్ష్యం. ప్రధానంగా ఆర్సెనిక్ మరియు ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామీణ నివాసాలకు సురక్షితమైన తాగునీరు అందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. త్రాగునీటి సామర్థ్యానికి జెజెఎం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కలుషిత నీటి కారణంగా తలెత్తే వ్యాధులను అరికట్టడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని ఈ పథకం  మెరుగుపరుస్తుంది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షా ప్రయోగశాలలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు వాటిని ప్రజల కోసం తెరుస్తున్నాయి. వారు తీసుకువచ్చిన నమూనాలను నామమాత్రపు రేటుతో పరీక్షించటానికి అక్కడ అవకాశం లభిస్తుంది.

***



(Release ID: 1698690) Visitor Counter : 205