ప్రధాన మంత్రి కార్యాలయం
పాత్రత కలిగిన నాయకుల కు, యోధుల కు తగినంత గౌరవాన్ని ఇవ్వని చరిత్ర తాలూకు పొరపాట్లను మేము సవరిస్తున్నాము: ప్రధాన మంత్రి
భారతదేశం చరిత్ర అంటే అది వలసవాద శక్తులు రాసిన చరిత్ర మాత్రమే అని గాని, లేదా వలసవాద సంబంధిత మనస్తత్వం కలిగిన శక్తులు రాసిన చరిత్ర మాత్రమే అని గాని కాదు: ప్రధాన మంత్రి
Posted On:
16 FEB 2021 2:23PM by PIB Hyderabad
దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకొన్న తరువాత మనం 75వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న నేపథ్యం లో దేశానికి విశేషమైనటువంటి తోడ్పాటు ను అందించిన కథానాయకుల, కథానాయికల యొక్క తోడ్పాటు ను స్మరించుకోవడం మరింత ముఖ్యం అయిపోతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం కోసం, భారతీయత కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన వారికి చరిత్ర పుస్తకాల లో ఇవ్వవలసినంత గౌరవాన్ని ఇవ్వడం జరుగలేదు అంటూ ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ అపసవ్యాలను, భారతదేశ చరిత్ర రచయిత ల ద్వారా దేశ చరిత్ర నిర్మాతల కు జరిగిన అన్యాయాన్ని మనం మన స్వాతంత్య్ర 75వ సంవత్సరం లోకి ప్రవేశించనున్న ఈ తరుణం లో ప్రస్తుతం సరిదిద్దడం జరుగుతున్నదని ఆయన అన్నారు. వారి తోడ్పాటు ను ఈ దశ లో గుర్తు కు తెచ్చుకోవడం అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్ రాయిచ్ లో చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనులకు, మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన తరువాత ప్రధాన మంత్రి ప్రసంగించారు.
భారతదేశం యొక్క చరిత్ర అంటే అది వలసవాద శక్తులు లిఖించిన చరిత్రో, లేదా వలసవాద మనస్తత్వం ఉన్నటువంటి శక్తులు రాసిన చరిత్రో మాత్రమే కాదు అంటూ ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. భారతదేశం చరిత్ర ఏది అంటే అది సామాన్య ప్రజానీకం వారి జానపద సాహిత్యం లో పెంచి పోషించుకొన్నది, తరాల తరబడి ముందుకు తీసుకుపోయినటువంటిదీనూ అని ఆయన అన్నారు.
ఆజాద్ హింద్ ప్రభుత్వం తొలి ప్రధాని నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ కు ఆయన పాత్రత ప్రకారం లభించవలసిన స్థానాన్ని ఇవ్వడం జరిగిందా? అంటూ ప్రధాన మంత్రి ప్రశ్నించారు. నేతాజీ గుర్తింపు ను ఎర్ర కోట నుంచి అండమాన్ నికోబార్ వరకు బలోపేతం చేయడం ద్వారా ఆయన కు మేము గౌరవాన్ని ఇచ్చామని శ్రీ మోదీ అన్నారు.
అదే విధంగా 500కు పైగా సంస్థానాల ను ఒక్కటి గా కలిపిన సర్ దార్ పటేల్ కు ఇచ్చిన ఆదరణ కూడా అందరికీ తెలిసినటువంటిదే అని ప్రధాన మంత్రి అన్నారు. ఇవాళ, ప్రపంచం లోనే అతి ఎత్తయిన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ సర్ దార్ పటేల్ విగ్రహమే అని ప్రధాన మంత్రి అన్నారు.
రాజ్యాంగ కీలక శిల్పి, దోపిడి కి గురైన వర్గాల, ఆదరణ కు నోచుకోని వర్గాల, అణచివేత బారిన పడ్డ వర్గాల వారి గొంతుక గా ఉంటూ వచ్చిన బాబా సాహెబ్ ఆంబేడ్ కర్ ను ఎప్పటికీ రాజకీయ కోణం నుంచే చూడటం జరిగింది. ప్రస్తుతం, భారతదేశం మొదలుకొని ఇంగ్లండ్ వరకు డాక్టర్ ఆంబేడ్ కర్ తో ముడి పడి వున్న అన్ని ప్రదేశాల ను ‘పంచ్ తీర్థ్’ గా అభివృద్ధిపరచడం జరుగుతున్నది. ‘‘వేరు వేరు కారణాల వల్ల గుర్తింపునకు నోచుకోని వ్యక్తులు లెక్కించలేనంత మంది ఉన్నారు. చౌరీ చౌరా పరాక్రమశాలుల విషయం లో ఏమి జరిగిందో మనం మరచిపోగలమా?’’ అంటూ ప్రధాన మంత్రి ప్రశ్నించారు.
భారతీయత ను పరిరక్షించడానికి మహారాజా సుహేల్ దేవ్ అందించిన తోడ్పాటు ను సైతం అదే విధంగా అలక్ష్యం చేయడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. పాఠ్య పుస్తకాల లో మహారాజా సుహేల్ దేవ్ ను అలక్ష్యం చేసినప్పటికీ కూడాను అవధ్, తరాయీ, పూర్వాంచల్ జానపద గాథల ద్వారా ఆయన ప్రజల మనస్సుల లో సజీవం గా కొలువుదీరి ఉన్నారన్నారు. ఒక సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి పాలకునిగా, అభివృద్ధి ప్రధానమైన దృష్టి కలిగినటువంటి పాలకునిగా ఆయన అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.
*****
(Release ID: 1698451)
Visitor Counter : 267
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam