ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల కార్యక్రమం తాజా సమాచారం
దేశవ్యాప్తంగా మొత్తం 74.30 లక్షల మందికి కోవిడ్ టీకాలు 27వ రోజు సాయంత్రం 7 గంటలకు 4,13,752 మందికి టీకాలు
Posted On:
11 FEB 2021 7:55PM by PIB Hyderabad
దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా కోవిడ్ టీకాలు అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధుల సంఖ్య 27వ రోజుకు 74.30 లక్షలకు చేరింది. మిజోరం, డామన్-డయ్యూ మినహా అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ రోజు టీకాల కార్యక్రమం సాగింది. ఈ సాయంత్రం 7 గంటలవరకు టీకాలు వేయించుకున్నవారి సంఖ్య 74,30,866 కు చేరింది.
తాత్కాలిక నివేదిక ప్రకారం ఇప్పటివరకు మొత్తం 1,53,799 శిబిరాలు జరిగాయి. ఈ రోజు 10,743 శిబిరాలు నిర్వహించారు. టీకాలు వేయించుకున్నవారిలో 5,790,832 మంది ఆరోగ్య సిబ్బంది కాగా 1,640,034 మంది కోవిడ్ పోరాట యోధులు.
ఈ రోజు టీకాలు వేయించుకున్నవారి సంఖ్య 4,13,752 కాగా, వారిలో 85,604 మంది ఆరోగ్య సిబ్బంది, 3,28,148 మంది కోవిడ్ పోరాట యోధులు. తుది నివేదిక రాత్రి పొద్దుపోయాక అందుతుంది.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
3454
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
3,43,130
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
14,195
|
4
|
ఆస్సాం
|
1,17,603
|
5
|
బీహార్
|
4,48,903
|
6
|
చండీగఢ్
|
7374
|
7
|
చత్తీస్ గఢ్
|
2,32,923
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
2698
|
9
|
డామన్, డయ్యూ
|
1030
|
10
|
ఢిల్లీ
|
1,62,596
|
11
|
గోవా
|
11391
|
12
|
గుజరాత్
|
6,43,438
|
13
|
హర్యానా
|
1,90,390
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
67,689
|
15
|
జమ్మూ కశ్మీర్
|
93,570
|
16
|
జార్ఖండ్
|
1,74,080
|
17
|
కర్నాటక
|
4,76,277
|
18
|
కేరళ
|
3,33,436
|
19
|
లద్దాఖ్
|
2761
|
20
|
లక్షదీవులు
|
920
|
21
|
మధ్యప్రదేశ్
|
4,85,593
|
22
|
మహారాష్ట్ర
|
6,00,456
|
23
|
మణిపూర్
|
15944
|
24
|
మేఘాలయ
|
11514
|
25
|
మిజోరం
|
11046
|
26
|
నాగాలాండ్
|
8,238
|
27
|
ఒడిశా
|
3,83,023
|
28
|
పుదుచ్చేరి
|
4780
|
29
|
పంజాబ్
|
97,769
|
30
|
రాజస్థాన్
|
5,69,717
|
31
|
సిక్కిం
|
8332
|
32
|
తమిళనాడు
|
2,11,762
|
33
|
తెలంగాణ
|
2,61,262
|
34
|
త్రిపుర
|
59,438
|
35
|
ఉత్తరప్రదేశ్
|
7,52,501
|
36
|
ఉత్తరాఖండ్
|
97,618
|
37
|
పశ్చిమ బెంగాల్
|
4,49,649
|
38
|
ఇతరములు
|
74,366
|
మొత్తం
|
74,30,866
|
నేడు 27వ రోజు సాయంత్రం 7 గంటల వరకు టీకా అనంతర అనారోగ్య ఘటనలు 47 నమోదయ్యాయు.
******
(Release ID: 1697341)
|