ఆర్థిక మంత్రిత్వ శాఖ
జనవరి 29వ తేదీ నాటికి రూ.1.76 లక్షల కోట్ల క్రెడిట్ పరిమితి గల 187.03 కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ
Posted On:
09 FEB 2021 5:25PM by PIB Hyderabad
కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) కవరేజ్‌తో రైతులకు భరోసా కల్పించే ఉద్దేశంతో ఫిబ్రవరి, 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు నాబార్డ్ అందించిన సమాచారం మేరకు ఈ ఏడాది జనవరి 29వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా రైతులకు 1.76 లక్షల కోట్ల రూపాయల రుణ పరిమితి కలిగిన దాదాపు 187.03 లక్షల కేసీసీ లు మంజూరు చేయబడ్డాయి. ఈ రోజు రాజ్యసభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంలో భాగంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అర్హులైన రైతులందరికీ వారి వ్యవసాయ కార్యకలాపాలలో ఇబ్బంది రాకుండా సకాలంలో క్రెడిట్ అందేలా చూసేందుకు, రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి సాగు అవసరాలను కొనుగోలు చేయడానికి రైతులకు వీలుగా కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పథకాన్ని ప్రవేశపెట్టారు. 2012 నుంచి కేసీసీ పథకం మరింత సరళీకృతం చేయబడింది. ఏటీఎం సౌకర్యంతో కూడిన డెబిట్‌కార్డ్, ఇంటర్ ఎలియా, ఒకేసారి డాక్యుమెంటేషన్ సౌకర్యం, పరిమితిలో అంతర్ నిర్మిత వ్యయాల పెరుగుదల, నిర్ణీత వ్యవధిలోన అపరిమితి ఉపసంహరణలకు వీలు మొదలైనవి కల్పించడమైంది. గత మూడేండ్ల వ్యవధిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు) మరియు నాబార్డ్ (కోఆపరేటివ్ బ్యాంక్స్ & ఆర్‌ఆర్‌బీ) అందించిన సమాచారం ప్రకారం దేశంలో జారీ చేసిన మొత్తం కేసీసీల సంఖ్య వరుసగా అనుబంధం-1, అనుబంధం-2లో నివేదించబడినాయి.
***
(Release ID: 1696641)
Visitor Counter : 166