ఆయుష్

దేశంలో ఆయుర్వేదిక మందుల‌కు ప్రోత్సాహం

Posted On: 09 FEB 2021 12:31PM by PIB Hyderabad

కేంద్ర ప్రాయోజిత ప‌థ‌క‌మైన జాతీయ ఆయుష్ మిష‌న్ (ఎన్ ఎఎం)ను రాష్ట్ర/  కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా ఆయుర్వేద విధానం స‌హా ఆయుష్ వైద్య విధానాల ప్రోత్సాహం, అభివృద్ధి కోసం కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. ఆయుర్వేద విధానం స‌హా ఆయుష్ విధానాల ప్రోత్సాహం కోసం మిష‌న్ దిగువ అంశాల‌ను పేర్కొంది. 
1. ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సి)లు, క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్లు (సిహెచ్‌సి)లు జిల్లా ఆసుప‌త్రులు (డిహెచ్‌)లలో  ఆయుష్ సౌక‌ర్యాల ఏర్పాటు. 
2. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా నిర్వ‌హించే ఆయుష్ ఆసుప‌త్రులు, డిస్పెన్స‌రీల ఆధునీక‌ర‌ణ‌. 
3. క‌నీసం 50 ప‌డ‌క‌లు క‌లిగిన స‌మ‌గ్ర ఆయుష్ ఆసుప‌త్రుల ఏర్పాటు
4. రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించిన అండ‌ర్ గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యా సంస్థ‌ల ఆధునీక‌ర‌ణ‌
5. ప్ర‌భుత్వ రంగంలో ఆయుష్ విద్యా సంస్థ‌లు లేని ప్రాంతాల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నూత‌న ఆయుష్ విద్యా సంస్థ‌ల ఏర్పాటు.
6. ఆయుష్ వైద్య విధానంలో నాణ్య‌త క‌లిగిన మందుల ఉత్ప‌త్తి కోసం రాష్ట్ర ప్ర‌భుత్వ‌/  రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారాలు/ ప‌్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేయ‌డం
7. ఆయుష్ మందుల క‌ఠిన‌మైన నాణ్య‌త నియంత్ర‌ణ చేసేందుకు రాష్ట్ర డ్ర‌గ్ టెస్టింగ్ లాబొరేట‌రీల‌ను బలోపేతం చేయ‌డం
8. ఆయుష్ మందులు, ఇత‌ర ఉత్ప‌త్తుల త‌యారీకి నాణ్య‌త క‌లిగిన ముడిప‌దార్ధాల స‌ర‌ఫ‌రా చేసేందుకు ఔష‌ధ మొక్క‌ల పెంప‌కం స‌హా కోత‌ల నిర్వ‌హ‌ణ చేసేందుకు తోడ్పాటు. 
అంతేకాకుండా, కేంద్ర ప్రాయోజిత ప‌థ‌క‌మైన జాతీయ ఆయుష్ మిష‌న్ (ఎన్ ఎఎం) కింద 2023-24 నాటికి ద‌శ‌ల వారీగా కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదించిన 12,500 ఆయుష్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాల‌ను రాష్ట్ర/  కేంద్ర పాలిత ప్ర‌భుత్వాల ద్వారా ఆయుష్ మంత్రిత్వ శాఖ అమ‌లులోకి తీసుకురానుంది. 
రాష్ట్ర/  కేంద్ర పాలిత ప్ర‌భుత్వాలు గుర్తించిన ఆయుష్ డిస్పెన్స‌రీలు, స‌బ్ హెల్త్ సెంట‌ర్ల‌ను ఆయుష్ ఆధారిత వ్యాధి నివార‌క‌, స్వ‌స్థ‌త‌, పురావాస సంర‌క్ష‌ణ‌ను అందించే ఆయుష్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాలుగా ఆధునీక‌రించాల‌ని యోచిస్తోంది.
దీనికి అద‌నంగా, సాధార‌ణ వ్యాధుల చికిత్స కోసం ఆయుష్ వైద్య విధానాలను మీడియా ద్వ‌రా, ఆరోగ్య ప్ర‌ద‌ర్శ‌న‌లు, స‌మావేశాలు, సెమినార్లు ఇత‌ర ప్ర‌చార కార్య‌క‌లాపాల‌ను ప్ర‌చారం చేసేందుకు ఇన్ఫ‌ర్మేష‌న్ ఎడ్యుకేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్ (ఐఇసి) కింద వివిధ చొర‌వ‌ల‌ను ఆయుష్ మంత్రిత్వ శాఖ తీసుకుంది. అంతేకాక‌, జాతీయ ఆయుష్ మిష‌న్ కింద ఆయుష్ గ్రామ్‌, ప్ర‌జారోగ్య చొర‌వ‌లు, స‌మాచార విద్య‌, క‌మ్యూనికేష‌న్ (ఐఇసి) కార్య‌క‌లాపాలు, యోగ నిర్వ‌హ‌ణ‌, ప‌రిధీయ ఒపిడి, వైద్య శిబిరాలు, ప్ర‌వ‌ర్త‌న మార్పు స‌మాచార మార్పిడి, స్థానిక  ఔష‌ధీయ మూలిక‌ల గుర్తింపు, ఉప‌యోగంలో గ్రామ ఆరోగ్య కార్య‌క‌ర్త‌లకు శిక్ష‌ణ‌.
ప్ర‌జారోగ్యం అనేది రాష్ట్ర అంశం అయినందున‌, ఆయుష్ డిస్పెన్స‌రీల‌ను తెర‌వ‌డం అన్న‌ది ఆయా రాష్ట్ర/  కేంద్ర‌పాలిత ప్రాంతాల ప్ర‌భుత్వాల ప‌రిధిలోకి వ‌స్తుంది. కేంద్ర ప్ర‌భుత్వ ప్రాయోజిత జాతీయ ఆయుష్ మిష‌న్ (ఎన్ ఎఎం) కింద దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి జిల్లాలో, బ్లాకులోనూ నూత‌న ఆయుష్ డిస్పెన్స‌రీల‌ను తెరిచే ప్రొవిష‌న్ లేదు. 
ఆయుర్వేద‌, యోగ‌, నాచురోప‌తి, యునాని, సిద్ధ‌, హోమియోప‌తి మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి ఎస్‌హెచ్‌. కిర‌ణ్ రిజిజు (అద‌న‌పు చార్జి) ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌కు స‌మ‌ర్పించిన లిఖితపూర్వ‌క స‌మాధానంలో పేర్కొన్నారు. 

***



(Release ID: 1696554) Visitor Counter : 175