సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఐ అండ్ బి మంత్రి ప్రకాష్ జవదేకర్ పూణేలో కొవిడ్ 19 టీకా మరియు ఆత్మనిర్భర్ భారత్‌పై రాష్ట్ర వ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు

టీకా గురించి సరైన అవగాహన కల్పించడం ఈ ప్రచారం యొక్క ఉద్దేశం: ప్రకాష్ జవదేకర్

మహారాష్ట్ర అంతటా ప్రయాణించడానికి మల్టీమీడియా ఎగ్జిబిషన్ వ్యాన్ల ఏర్పాటులో ప్రాంతీయ ఔట్‌రిచ్‌ బ్యూరో చొరవ తీసుకుంది.

Posted On: 07 FEB 2021 11:53AM by PIB Hyderabad

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ఈ రోజు పూణేలో కోవిడ్ టీకాలు మరియు ఆత్మనిర్భర్ భారత్‌పై మొబైల్ ఎగ్జిబిషన్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.





ఈ ప్రచారం  కింద ప్రత్యేకంగా తయారు చేసిన 16 వ్యాన్లు మహారాష్ట్రలోని 36 జిల్లాల్లో ప్రయాణించి  ప్రజల్లో అవగాహన పెంచుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ మరియు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ యొక్క ఐఇసి డివిజన్ సహకారంతో ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ యొక్క రీజినల్ ఔట్రీచ్ బ్యూరో ఈ ప్రచారానికి రూపకల్పన చేసి అమలు చేసింది. ఈ వ్యాన్లు ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా సందేశాలను కూడా ప్రదర్శిస్తాయి మరియు ఈ వ్యాన్‌లు జీపీఎస్ ద్వారా  ట్రాక్ చేయబడతాయి.

ఈ సందర్భంగా శ్రీ జవదేకర్ మాట్లాడుతూ "మొత్తం ప్రపంచం కరోనాతో పోరాడుతోంది. అయితే 130 కోట్ల జనాభా ఉన్నప్పటికీ భారత్..లాటిన్ అమెరికా, యూరప్, అమెరికా కంటే కొవిడ్‌ ను సమర్ధవంతంగా ఎదుర్కొంది. తద్వారా  దేశంలో తక్కువ నష్టం నమోదయిందని చెప్పారు.






కోవిడ్ టీకా ప్రారంభించడంతో  మనం కొత్త దశ కమ్యూనికేషన్‌లోకి ప్రవేశించామని మంత్రి చెప్పారు.


"భారతదేశ వ్యాక్సిన్ పంపిణీ  ప్రారంభమైంది. కొవిడ్ టీకా కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి దేశంలో 50 లక్షలకు పైగా ఆరోగ్య మరియు ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకాలు వేశారు. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల తరువాత 50 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేస్తారు మరియు తరువాత మొత్తం జనాభాకు టీకాలు వేస్తారు "అని శ్రీ జవదేకర్ అన్నారు.


టీకా కార్యక్రమం గురించి అవగాహన కల్పించడానికి మొబైల్ ఎగ్జిబిషన్ వ్యాన్లు ప్రతిరోజూ 80-100 కిలోమీటర్లు ప్రయాణించనున్నట్లు మంత్రి తెలిపారు. టీకా ప్రణాళిక మరియు కొవిడ్‌ మార్గదర్శకాలకు సంబంధించిన సందేశాన్ని మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకు వెళ్లడమే ఈ ప్రచారం యొక్క లక్ష్యం అని మంత్రి చెప్పారు.

 



పాటలు మరియు నాటక విభాగానికి చెందిన  సాంస్కృతిక కళాకారులు మహారాష్ట్రలోని ఆయా ప్రాంతాలలో ప్రాచుర్యం పొందిన జానపద ప్రదర్శనల ద్వారా  ప్రజలకు సందేశాలను అందిస్తారు.

"వ్యాక్సిన్ల గురించి తప్పుడు సమాచారం మరియు పుకార్లను అరికట్టడం మరియు ఆత్మనిర్భర్ భారత్‌ సాధనకు ప్రభుత్వ ప్రయత్నాల గురించి అవగాహన కల్పించడం ఈ ప్రచారం యొక్క ఇతర లక్ష్యాలు"

కొవిడ్ 19 మహమ్మారిని కట్టడి చేయడంలో  కమ్యూనికేషన్ పెద్ద పాత్ర పోషించింది. ఈ ప్రయత్నంలో ప్రభుత్వ సందేశాన్ని ప్రజల ఇంటి వద్దకు తీసుకెళ్లాలని ఈ ప్రచారం లక్ష్యంగా పెట్టుకుంది.

మహారాష్ట్రలోని ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ యొక్క వివిధ మీడియా యూనిట్ల అధిపతులు, రాష్ట్ర ప్రభుత్వ, డబ్ల్యూహెచ్‌ఓ, యునిసెఫ్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.



 

* * *



(Release ID: 1696099) Visitor Counter : 205