మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్‌పై కోవిడ్-19 ప్రభావం
Posted On:
05 FEB 2021 4:20PM by PIB Hyderabad
కొవిడ్-19 సమయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు అనుమతించబడింది. దీని ప్రకారం, ఆహార పదార్థాల పంపిణీ మరియు పోషకాహార సహాయాన్ని అంగన్వాడీ వర్కర్స్ (ఎడబ్లూడబ్యూలు) 15 రోజులకు ఒకసారి లబ్ధిదారులకు ఉదాహరణకు పిల్లలు, మహిళలు మరియు పాలిచ్చే తల్లుల ఇంటి వద్దకు వెళ్లి అందించారు. అలాగే అంగన్‌వాడీ కార్మికులు మరియు సహాయకులు కొవిడ్-19 అవగాహన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మరియు పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు సరైన పారిశుధ్యం మరియు ఆరోగ్య విద్య గురించి అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించారు. పిల్లలతో సహా లబ్ధిదారుల సంవత్సర వారీ వివరాలు (6 నెలలు - 6 సంవత్సరాలు) మరియు 2014 - 2020 సంవత్సరాల మధ్య అంగన్వాడీ సేవల పథకం కింద గర్భిణీ స్త్రీలు & పాలిచ్చే తల్లులు వివరాలు అందుబాటులో ఉన్న డేటా డిజిటలైజ్డ్ రికార్డుల ప్రకారం అనుసంధానం చేయబడ్డాయి.
భారతదేశంలో అంగన్వాడీ వర్కర్ల గౌరవ వేతనం నెలకు రూ. 3,000 / - నుండి రూ. 4, 500/ కు పెరిగింది; మినీ అంగన్‌వాడీ సెంటర్లలో అంగన్వాడీ వర్కర్ల గౌరవ వేతనాన్ని నెలకు రూ.2,250 /- నుండి రూ. 3,500 / - మరియు అంగన్‌వాడీ సహాయకులకు నెలకు రూ. 1,500 /నుండి 2,250 /- వరకు పెంచడం జరిగింది.
ఈ సమాచారాన్ని మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.
***
(Release ID: 1695577)
Visitor Counter : 175