ప్రధాన మంత్రి కార్యాలయం
35వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
Posted On:
27 JAN 2021 8:24PM by PIB Hyderabad
ఐసిటి ఆధారిత మల్టి- మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇమ్ ప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్యమం ద్వారా న్యూ ఢిల్లీ లో బుధవారం జరిగిన 35వ సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ ప్లాట్ ఫార్మ్ లో కేంద్ర ప్రభుత్వం తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పాలుపంచుకొంటూ వస్తున్నాయి.
తొమ్మిది ప్రాజెక్టులు, ఒక కార్యక్రమం తో సహా మొత్తం పది చర్చనీయాంశాల పై ఈ సమావేశం లో సమీక్ష జరిగింది. తొమ్మిది ప్రాజెక్టులలోనూ రైల్వే మంత్రిత్వ శాఖ కు చెందిన మూడు ప్రాజెక్టులు, ఎమ్ ఒఆర్ టి హెచ్ కు చెందిన మరో మూడు ప్రాజెక్టులు, డిపిఐఐటి, విద్యుత్తు మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ల కు చెందిన తలా ఒక ప్రాజెక్టు ఉన్నాయి. ఈ తొమ్మిది ప్రాజెక్టుల మొత్తం వ్యయం 54,675 కోట్ల రూపాయలు గా ఉంది. ఈ ప్రాజెక్టులు 15 రాష్ట్రాలకు సంబంధించినవి. ఆ పదిహేను రాష్ట్రాలలో ఒడిశా, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, పంజాబ్, ఝార్ ఖండ్, బిహార్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బంగాల్, హరియాణా, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి.
చర్చ లు జరిగిన క్రమం లో ‘ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన’ ను కూడా ప్రధాన మంత్రి సమీక్షించారు.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆటంకం కలిగించే సమస్యలను త్వరగా పరిష్కరించేలా చూడాలని అధికారులందరిని ప్రధాన మంత్రి ఆదేశించారు. ‘ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన’ కు విస్తృత ప్రచారం లభించడానికి, ఆ పథకం ప్రభావశీలత్వాన్ని పెంపొందించడానికి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవలసిందిగా ఫార్మాస్యూటికల్స్ విభాగాన్ని, రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా ఆయన ప్రోత్సహించారు.
ప్రగతి తాలూకు 34 సమావేశాలు ముగిసే సరికల్లా, మొత్తం 13.14 లక్షల కోట్ల రూపాయల వ్యయం తో కూడిన 283 ప్రాజెక్టులను సమీక్షించడం జరిగింది.
***
(Release ID: 1692863)
Visitor Counter : 169
Read this release in:
English
,
Hindi
,
Tamil
,
Assamese
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam