వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి మరిన్నిఉపాధి అవకాశాలు కల్పించడానికి నూతన విద్యా విధానం సహాయపడుతుంది: శ్రీ తోమర్

వ్యవసాయ పరిశోధన మరియు విద్యలో ఐసిఎఆర్ కీలక పాత్ర పోషించింది: శ్రీ పియూష్ గోయల్



ఐసిఎఆర్ సొసైటీ యొక్క 92 వ వార్షిక సర్వసభ్య సమావేశం

Posted On: 27 JAN 2021 8:19PM by PIB Hyderabad

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూరైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయ సాధనకు  ఐసిఎఆర్ కృషి చేస్తున్నాదని కేంద్ర వ్యవసాయరైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ అన్నారు. ఈ రోజు జరిగిన  ఐసిఎఆర్ సొసైటీ 72వ వార్షిక సదస్సులో మంత్రి పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన మంత్రి 2022 నాటికీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో కేంద్రం రూపొందించిన వివిధ పథకాలు అమలు జరిగేలా చూడడానికి  ఐసిఎఆర్ సహకరిస్తున్నదని అన్నారు. సొసైటీ సభ్యులుగా వున్న వ్యవసాయ శాస్త్రవేత్తలుఉపాధ్యాయులువిద్యార్థులురైతులు చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సిద్ధం చేసిన నూతన సాంకేతికతకు రైతుల శ్రమ తోడవడంతో ప్రపంచస్థాయిలో భారతదేశం పాల ఉత్పత్తిమత్స్య రంగాలలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించిందని మంత్రి పేర్కొన్నారు. 

వ్యవసాయ దిగుబడులను అధికం చేసి రైతులకు సాధికారతను కల్పించడానికి కేంద్రప్రభుత్వం అనేక సమగ్ర ప్రణాళికలను అమలు చేస్తున్నాదని మంత్రి తెలిపారు. వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే అంశంలో రైతులుఉత్పత్తిదారుల సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు. కోవిడ్ సమయంలో కూడా ఆహారధాన్యాల దిగుబడి గణనీయంగా పెరిగేలా చూసి  ఐసిఎఆర్ తన పాత్రను సమర్ధవంతంగా పోషించిందని మంత్రి అన్నారు.  ఐసిఎఆర్ అభివృద్ధి చేసిన అనేక వంగడాలు ఆహార ధాన్యాల దిగుబడిని ఎక్కువ చేశాయని దీనివల్ల దేశానికి ఎంతో ప్రయోజనం కల్గిందని అన్నారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల వల్ల వ్యవసాయరంగంలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని మంత్రి అన్నారు. నూతన విద్యా విధానం,  ఐసిఎఆర్వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరి వ్యవసాయ రంగం అధివృధి చెంది రైతుల ఆదాయాన్ని పెంచి వారికి సాధికారతను కల్పిస్తుందన్న ధీమాని మంత్రి వ్యక్తం చేశారు. 

సమావేశంలో పాల్గొన్న కేంద్ర రైల్వే,వాణిజ్యం పరిశ్రమలువినియోగదారుల వ్యవహారాలు ప్రజాపంపిణీ శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్ వ్యవసాయ పరిశోధన వ్యవసాయ విద్య రంగాల అభివృద్ధికి ఐసిఎఆర్ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు ఐసిఎఆర్ కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు సాగాలని మంత్రి సూచించారు. 

కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల మాట్లాడుతూ కోవిడ్ -19 వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొంటూ వ్యవసాయ రంగం రికార్డు స్థాయిలో ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయడమే కాకుండా ఉపాధి అవకాశాలను కల్పించిందని అన్నారు. 

దేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి శ్రీ కైలాష్ చౌదరి అన్నారు. రైతుల ఆదాయాన్ని ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన విత్తనాలుఎరువులు సరఫరా చేయడంతో పాటు వారు పండించిన పంటలను నిల్వ చేసుకోవడానికి సౌకర్యాలను కల్పిస్తూ పంటలకు అధిక ధర లభించేలా చూడడానికి చర్యలను తీసుకుంటున్నదని అన్నారు. సేంద్రీయ వ్యవసాయ సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. 

ఐసిఎఆర్ డైరెక్టర్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ విద్యపరిశోధనకు ప్రాధాన్యత ఇస్తూ రైతులకు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. 

ఐసిఎఆర్ ఉత్పత్తులనుప్రచురణాలను మంత్రులు విడుదల చేశారు.  

వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయంఉద్యానపశుసంపద మరియు మత్స్యశాఖ మంత్రులు,  ఐసిఎఆర్ సొసైటీ సీనియర్ అధికారులుఐసిఎఆర్ పాలకమండలి సభ్యులుఅదనపు కార్యదర్శి (డేర్)కార్యదర్శి (ఐసిఎఆర్) శ్రీ సంజయ్ కుమార్ సింగ్ తో పాటు కౌన్సిల్  సీనియర్ అధికారులువ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు సిబ్బంది  ఈ సమావేశంలో  పాల్గొన్నారు.

***


(Release ID: 1692858) Visitor Counter : 87


Read this release in: English , Urdu , Hindi , Manipuri