యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

కేంద్రీయ విద్యాల‌య విద్యార్ధుల‌తో క‌లిసి ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ఎడిష‌న్ ను జ‌రుపుకున్న కిరణ్ రిజిజు; పాఠ‌శాల జీవితంలో ఫిట్ నెస్ అంత‌ర్భాగ‌మైందని వ్యాఖ్య‌

Posted On: 27 JAN 2021 5:56PM by PIB Hyderabad

ఫిట్ ఇండియా స్కూల్ వీక్ రెండ‌వ ఎడిష‌న్‌ను కేంద్ర యువ వ్య‌వ‌హారాలు, క్రీడా మంత్రి కిర‌ణ్ రిజిజు జ‌న‌వ‌రి 27, 2021న ముగించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్  సందీప్ ప్ర‌ధాన్‌, ఎంవైఎఎస్ సంయుక్త కార్య‌ద‌ర్శి (అభివృద్ధి) అతుల్ సింగ్‌, కెవిఎస్ క‌మిష‌న‌ర్ నిధి పాండే, విద్యా మంత్రిత్వ శాఖ (డిఎస్ ఇఎల్) సంయుక్త కార్య‌ద‌ర్శి సంతోష్ కుమార్ యాద‌వ్‌, ఇత‌ర ప్ర‌ముఖులు పాల్గొన్నారు. 


ఫిట్ ఇండియా స్కూల్ వీక్ కార్య‌క్ర‌మాన్ని జరుపుకునేందుకు కేంద్రీయ విద్యాల‌యం -2, కొచ్చి నావ‌ల్ బేస్‌కు చెందిన విద్యార్థులు దృశ్య‌మాధ్య‌మం ద్వారా ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. ఇందులో భాగంగా వారు సూర్య న‌మ‌స్కారాలు, ఎయిరోబిక్స్‌, ఫ్రీ-హాండ్ వ్యాయామాలు, ఎయిరోబిక్స్‌, నాట్యం, అప్ప‌టిక‌ప్పుడు అనుకున్న ఘ‌ట్టాల‌ను ఆన్‌లైన్‌లో ప్ర‌ద‌ర్శించారు. 


వారి ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌శంసిస్తూ, మ‌నం ఫిట్ ఇండియా మిష‌న్‌ను న‌డిపిన‌ప్ప‌టికీ, దానిని విద్యా మంత్రిత్వ శాఖ‌, పాఠశాల‌లు, భార‌త ప్ర‌జ‌లు ముఖ్యంగా బాల‌లు న‌డుపుతున్నార‌ని రిజిజు అన్నారు.  దేశ‌వ్యాప్తంగా ఉన్న పాఠ‌శాల‌లు ఫిట్ ఇండియా వీక్ కార్య‌క్ర‌మాన్ని పాఠ‌శాల జీవితంలో ఫిట్‌నెస్ అంత‌ర్భాగంగా ఉన్న‌ట్టుగా న‌డ‌ప‌డం చూసి త‌న‌కు ఆనందంగా ఉంద‌న్నారు. చురుకైన‌, తెలివైన విద్యార్ధుల‌ను క‌లిసిన ఈ క్ష‌ణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. ఇటువంటి కార్య‌క్ర‌మానికి వ్య‌క్తిగ‌తంగా హాజ‌రైన‌ప్పుడు అనుభూతి, భిన్న కోణం అనుభ‌వంలోకి వ‌స్తాయ‌ని, ఇక్క‌డ ఢిల్లీలో కూర్చునే కొచ్చిలోని స్కూల్ వీక్ సంబ‌రాల స్పంద‌న‌ను అనుభ‌వించ‌గ‌లుగుతున్నాన‌ని ఆయ‌న చెప్పారు. 

 


ఫిట్ ఇండియా స్కూల్ వీక్ రెండ‌వ ఎడిష‌న్ 01 డిసెంబ‌ర్‌, 2020న ప్రారంభ‌మై, 21జ‌న‌వ‌రి 2021న ముగియ‌నుంది. త‌మ నిత్య‌జీవితంలో భౌతిక కార్య‌క‌లాపాల‌ను, క్రీడ‌ల‌ను భాగం చేసుకునేందుకు పిల్ల‌ల‌ను ప్రోత్స‌హించాల‌న్న ల‌క్ష్యంతో నిర్వ‌హిస్తున్నారు. ఎందుకంటే, అల‌వాట్లు ఏర్ప‌డే తొలి ప్ర‌దేశం పాఠ‌శాలే. ఈ కార్య‌క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న 3.5 ల‌క్ష‌ల పాఠ‌శాల‌లు పాల్గొన్నాయి. ఇందులో దేశం న‌లుమూల‌ల‌కు చెందిన వేలమంది విద్యార్ధులు పాల్గొన్నార‌ని వారు వెల్ల‌డించారు. 


ప్ర‌స్తుత మ‌హ‌మ్మారి ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకుని, స్కూల్ వీక్‌లో కార్య‌క్ర‌మాల‌ను దృశ్య‌మాధ్య‌మం ద్వారాను, మైదానాల‌లోనూ నిర్వ‌హించారు. ఫిట్ ఇండియా స్కూల్ వీక్ కార్య‌క్ర‌మాన్ని గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ప్రారంభించారు. ఇందులో దేశ‌వ్యాప్తంగా 15,000మంది పాఠ‌శాల విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకునేందుకు పాఠ‌శాల‌లు ఫిట్ ఇండియా వెబ్‌సైట్‌లో త‌మ‌ను న‌మోదు చేసుకుని, ఫిట్ ఇండియా స్కూల్ వీక్‌కు కేటాయించిన కాలంలో ఒక వారాన్ని ఎంచుకోవాలి.ఈ ఏడాది స్కూల్ వీక్ కార్య‌క్ర‌మంలో  ప్ర‌ద‌ర్శించిన కార్య‌క్ర‌మాల‌లో - ఎయిరోబిక్స్‌, పెంయింటింగ్, క్విజ్‌/ వ‌క్తృత్వం, నాట్యం, స్టెప్-అప్ ఛాలెంజ్ స‌హా అనేకం ఉన్నాయి. 

 

***
 



(Release ID: 1692812) Visitor Counter : 120