విద్యుత్తు మంత్రిత్వ శాఖ
850 మెగావాట్ల రత్ లే జల విద్యుత్తు పథకానికి 5281.94 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనను ఆమోదించిన మంత్రిమండలి
Posted On:
20 JAN 2021 5:11PM by PIB Hyderabad
జమ్ము, కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం లో కిశ్త్‌వర్ జిల్లా లో చినాబ్ నది మీద 850 మెగావాట్ సామర్ధ్యం కలిగివుండే రత్ లే జల విద్యుత్తు (హెచ్ఇ) పథకానికి 5281.94 కోట్ల రూపాయలతో కూడిన పెట్టుబడి ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడి ని నేశనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేశన్ (ఎన్‌హెచ్‌పిసి), జమ్ము & కశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేశన్ లిమిటెడ్ (జెకెఎస్‌పిడిసి) లు కలసి స్థాపించే ఒక కొత్త జాయింట్ వెంచర్ కంపెనీ (జెవిసి) పెడుతుంది. జాయింట్ వెంచర్ కంపెనీ లో 51 శాతం ఎక్విటి మద్దతు ను ఎన్‌హెచ్‌పిసి, 49 శాతం ఎక్విటి వాటా ను జెకెఎస్‌పిడిసి సమకూర్చుతాయి.
ప్రధాన అంశాలు
రత్ లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి గాను ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్ కంపెనీ లో జెకెఎస్‌పిడిసి తాలూకు ఎక్విటి వాటా కై 776.44 కోట్ల రూపాయల గ్రాంటు ను భారత ప్రభుత్వం అందించడం ద్వారా కేంద్ర పాలిత జమ్ము, కశ్మీర్ కు కేంద్రం కూడా తన సమర్థన ను అందిస్తోంది. ఎన్‌హెచ్‌పిసి తన అంతర్గత వనరుల నుంచి 808.14 కోట్ల రూపాయల ఎక్విటి ని తన వంతు పెట్టుబడి గా పెడుతుంది. రత్ లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ను 60 నెలల వ్యవధి లో ప్రారంభించవలసివుంది. ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు గ్రిడ్ కు సమతుల్యత ను సాధించడం లో తోడ్పడుతుంది. అంతేకాక, విద్యుత్తు సరఫరా స్థితి ని కూడా ఇది మెరుగుపరుస్తుంది.
అమలు కు సంబంధించిన వ్యూహం
ఈ ప్రాజెక్టు ను స్వయంభరణ శక్తి కలిగింది గా తీర్చిదిద్దడం కోసం కేంద్ర పాలిత జమ్ము, కశ్మీర్ ప్రాంత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనిచేయడం ప్రారంభం అయిన తరువాత జల వినియోగ రుసుము విధింపు పైన మినహాయింపు ను 10 సంవత్సరాల పాటు పొడిగిస్తుంది. అంతేకాకుండా, జిఎస్‌టి లో రాష్ట్రం తాలూకు వాటా ను (అంటే ఎస్ జిఎస్‌టి) తిరిగి ఇస్తుంది. అలాగే, కేంద్ర పాలిత జమ్ము, కశ్మీర్ ప్రాంతానికి ఉచిత విద్యుత్తు సరఫరా ను మాఫీ చేస్తుంది కూడా. అంటే, ఈ ప్రాజెక్టు పని చేయడం ప్రారంభమైన తరువాత, కేంద్ర పాలిత జమ్ము, కశ్మీర్ ప్రాంతానికి ఉచిత విద్యుత్తు ఒకటో సంవత్సరం లో @1 శాతం గా ఉండి, ఆ తరువాత నుంచి ఒక్కో సంవత్సరానికి @1 శాతం వంతు న పెరుగుతూ 12వ సంవత్సరం లో 12 శాతానికి చేరుతుంది.
లక్ష్యాలు
ఈ ప్రాజెక్టు నిర్మాణ కార్యకలాపాలు దాదాపు 4000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన కు తోడ్పడనున్నాయి. కేంద్రపాలిత జమ్ము, కశ్మీర్ ప్రాంతం మొత్తం మీద సామాజికంగాను, ఆర్థికంగాను అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు ను కూడా అందిస్తుంది. పైపెచ్చు, రత్ లే జల విద్యుత్తు పథకం తాలూకు 40 సంవత్సరాల జీవన కాలం లో 5289 కోట్ల రూపాయల విలువైన ఉచిత విద్యుత్తు ను అందుకోవడం తో పాటు 9581 కోట్ల రూపాయల విలువైన జల వినియోగ రుసుము ల విధింపు ద్వారా కూడా ప్రయోజనాలను కేంద్రపాలిత జమ్ము, కశ్మీర్ ప్రాంతం అందుకోనుంది.
***
(Release ID: 1690492)
Visitor Counter : 182