మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

జాతీయ విద్యావిధానం (ఎన్.ఇ.పి.) 2020:

పాఠశాల విద్య అమలు ప్రణాళిక

Posted On: 18 JAN 2021 6:14PM by PIB Hyderabad
  1. 2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానం (ఎన్.ఇ.పి-2020):. మనదేశ విద్యావిధానాల పరంపరలో ఇది మూడవది. (గతంలో 1968,1986 సంవత్సరాల్లో విద్యావిధానాలు వెలువడ్డాయి. 1986 విధానాన్ని 1992లో సవరించారు). 21వ శతాబ్దానికి ఎన్.ఇ.పి. 2020 తొలి విద్యా విధానం. పాఠశాల విద్యకు సంబంధించి ఎన్.ఇ.పి.-2020 పరిధి కాస్త విస్తృతంగా రూపొందింది. ప్రీ ప్రైమరీనుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకూ మరింత విస్తృతమైన రీతిలో ఎన్.ఇ.పి. 2020 పరిధిని తీర్చిదిద్దారు.
  2. విద్యా విధానాన్ని 20ఏళ్ల గడువుకు వర్తించేలా రూపొందించినందున వివిధ రకాల కాలపరిమితులతో సిఫార్సులను పొందుపరిచారు. అందువల్ల విద్యా విధానం అమలు ప్రక్రియను దశలవారీగా చేపడుతున్నారు.
  3. ఎన్.ఇ.పి.-2020 సిఫార్సులు, వాటి అమలుకు సంబంధించిన వ్యూహాలపై చర్చించేందుకు 2020 డిసెంబరు 8నుంచి శిక్షక్ పర్వ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ భాగస్వామ్య వర్గాలనుంచి దాదాపు 15లక్షల వరకూ సూచనలను, సలహాలను రాబట్టారు. సదరు సూచనలన్నీ ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయి.
  4. ఎన్.ఇ.పి. 2020 లక్ష్యాలు, ధ్యేయాల సాధనకు పాఠశాలవిద్య, అక్షరాస్యతా శాఖ ఆధ్వర్యంలో అమలు ప్రణాళిక ముసాయిదా తయారైంది. ప్రతి సిఫార్సుకు ఒక పనిని అనుసంధానం చేయడం, ఆ పనిని నిర్వర్తించవలసిన బాధ్యతాయుత సంస్థలను గుర్తించడం, కాల పరిమితులు, సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించడం తదితర చర్యలతో ముసాయిదాను తయారు చేశారు. ఈ పనుల జాబితాను వివిధ రాష్ట్రాలకు/కేంద్ర పాలిత ప్రాంతాలకు/స్వయంప్రతిపత్తి సంస్థలకు గత ఏడాది సెప్టెంబరు 10న పంపించారు. గత ఏడాది అక్టోబరు 12లోగా తమ సూచనలతో కూడిన స్పందనను తెలియజేయాలని కోరారు. దీనికి స్పందనగా, పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖకు చెందిన స్వయంప్రతిపత్తి సంస్థలు, 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 7,177 సూచనలను, సలహాలను అందించాయి. ఈ సూచనలన్నింటినీ నిపుణుల బృందాలు విశ్లేషించాయి.  అనంతరం విధానం అమలుకు సంబంధించిన చివరి దశ ప్రణాళికలో ముఖ్యమైన సూచనలను పొందుపరిచారు. వీటన్నింటికీ తోడు ఎన్.ఇ.పి.-2020 అమలుపై జాతీయ స్థాయిలో పలు సదస్సులను నిర్వహించారు. అనంతరం సమగ్ర శిక్షా సవరణ ప్రక్రియను చేపట్టారు. గత ఏడాది నంవబరు 2న, 27న, డిసెంబరు2న పాఠశాల విద్య, అక్షరాస్యతా శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ ప్రక్రియ జరిగింది. అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింపజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన సవివర పత్రం ప్రస్తుతం ఖరారు దశలో ఉంది. త్వరలో అది విడుదలవుతుంది.
  5. విద్యా విధానం అమలుకు సంబంధించిన ప్రణాళిక వాస్తవికంగా, సరళంగా, సహకార యోగ్యంగా ఉండేలా చూసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం సమాజంలోని అన్ని వర్గాలనుంచి సూచనలను, సలహాలను ఆహ్వానించారు. ఇలా అన్ని సంఘాలనుంచి అందిన అభిప్రాయాలతో, ఖరారైన అమలు ప్రణాళిక మాత్రమే క్షేత్రస్థాయిలో విధాన లక్ష్యాలను ప్రతిబింబిస్తుందన్న ఆశాభావంతో ఈ కసరత్తు జరుగుతోంది. అప్పుడే విద్యా విధానం అట్టడుగు స్థాయికి కూడా చేరుతుందని, సంబంధిత భాగస్వామ్య వర్గాల్లో తగిన అవగాహన, ప్రేరణ, సామర్థ్యాలను కలిగిస్తుందని, తద్వారా  పాఠశాల విద్యలో తగిన పరివర్తనకు వీలుంటుందన్నది మరో ఆశాభావం.
  6. ఎన్.ఇ.పి.లో ఎక్కువ భాగానికి కొత్త పాఠ్యప్రణాళిక వ్యవస్థ (ఎన్.సి.ఎఫ్.), కేంద్రం ఆధ్వర్యంలోని పథకాలే వర్తిస్తాయి.  కొత్త పాఠ్యప్రణాళిక వ్యవస్థకు సంబంధించిన సన్నాహక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2021-21 విద్యా వత్సరంలో ఇది పూర్తి స్థాయికి రూపుదిద్దుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 
  7. ఎన్.ఇ.పి. అమలు ప్రక్రియను పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ ఇప్పటికే ప్రారంభించింది. ఇందుకోసం విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా ఈ కింది కార్యకలాపాలను చేపట్టింది.:
  1.  ఉపాధ్యాయులకు 50 గంటల తప్పనిసరి వ్యవధితో నిర్విరామంగా వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణను చేపట్టడం. ప్రాథమిక విద్యకు సంబంధించిన అన్ని అంశాలకు సమగ్రంగా వర్తింపజేస్తూ 4-5గంటల వ్యవధితో 18 మాడ్యూల్స్.ను గత ఏడాది అక్టోబరు 6న సర్వీసులోని ఉపాధ్యాయులకు శిక్షణను ప్రారంభించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల, టీచర్ల సామర్థ్యాల నిర్మాణానికి సంబంధించిన నిష్తా (ఎన్.ఐ.ఎస్.హెచ్.టి.హెచ్.ఎ.) పథకం కింద దీక్షా ప్లాట్ ఫాంపై ఆన్ లైన్ పద్ధతిలో ఈ శిక్షణ ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకూ కోర్సుల వారీగా 3.4కోట్లమేర రిజిస్ట్రేషన్లు జరిగాయి. 23లక్షలమంది టీచర్ల నుంచి 2.8కోట్ల మేర కోర్సులు పూర్తయ్యాయి.
  2. ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ మిషన్.కు సంబంధించి జాతీయ స్థాయి పథకం ఏర్పాటుకు సూత్రప్రాయమైన ఆమోదం లభించింది. ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ మిషన్ కు సంబంధించిన వ్యవస్థ తయారీ తదితర అంశాలపై పరిశీలన కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
  3. దీక్షా ప్లాట్ ఫాం ద్వారా ఈ-లెర్నింగ్ పద్ధతిని మరింత విస్తృతపరిచారు. పాఠ్యప్రణాళికతో ముడివడిన ఈ-కంటెట్ తో తగిన అనుసంధానాన్ని దీక్షా ప్లాట్ ఫాం ఏర్పరుస్తుంది.  క్యూ.ఆర్. కోడ్ తో కూడిన ఎనర్గైజ్డ్ టెక్స్ట్ బుక్కులు, టీచర్ల కోర్సు పుస్తకాలు, క్విజ్.లు తదితర పరిష్కారాలతో ఈ అనుసంధాన్ని దీక్షా వేదిక అందజేస్తుంది.     ఈ రోజు వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు దీక్షా ప్లాట్ ఫాం పరిధిలో ఈ-కంటెంటుతో కూడిన 3,600 క్యూ.ఆర్.కోడెడ్ పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ 29 రాష్ట్రాలకు సంబంధించినవి.  ఇవి కూడా లక్షా 44వేల ఈ-కంటెంట్సు, 300 కోర్సులకు సంబంధించినవి.   
  4. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, సంక్షేమం లక్ష్యంగా ‘మనో దర్పణ్’ పేరిట ఒక కార్యక్రమాన్ని పాఠశాల విద్య, అక్షరాస్యతా శాఖ ప్రారంభించింది. నిరాశా నిస్పృహల్లోని విద్యార్థులకు భావోద్వేగపరమైన మద్దతును, కౌన్సెలింగ్.ను అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, సూచన ప్రాయమైన మార్గదర్శ సూత్రాలను జారీ చేయడం, వెబ్ పేజీని, జాతీయ స్థాయి టోల్ ఫ్రీ నంబరును, జాతీయ స్థాయి సమాచారంతో డేటా బేస్.ను, కౌన్సెలర్ల డైరెక్టరీని నిర్వహిస్తూ వస్తున్నారు.   .
  5. పాఠశాల విద్యలో భారతీయ సంకేత భాషా నిఘంటువును రూపొందించేందుకు, భారతీయ సంకేత భాష పరిశోధనా శిక్షణా కేంద్రం (ఐ.ఎస్.ఎల్.ఆర్.టి.సి.), జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి (ఎన్.సి.ఇ.ఆర్.టి.) ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.   
  6. కేంద్ర మాద్యమిక విద్యా మండలి (సి.బి.ఎస్.ఇ.) ఆధ్వర్యంలో పరీక్షా సంస్ఖరణలను ప్రారంభించారు.; పరీక్షల్లో ఉత్తీర్ణతా స్థాయి మెరుగుదలకు సంబంధించిన ఇంప్రూవ్ మెంట్ పరీక్షా పద్ధతితిని సి.బి.ఎస్.ఇ. 2021నుంచి ప్రవేశపెడుతుంది.  2021-22 విద్యా సంవత్సరంనుంచి రెండు స్థాయిల్లో ఇంగ్లీషు,  సంస్కృతం ప్రవేశపెడుతుంది. (ఇప్పటికే రెండు స్థాయిల్లో గణితం, హిందీ పాఠ్యాంశాలను అందిస్తోంది). 10వ, 11వ తరగతుల బొర్డు పరీక్షల్లో,.. సామర్థ్యంగా ప్రాతిపదికగా ప్రశ్నలను దశలవారీగా ప్రవేశపెట్టారు. ఈ ప్రశ్నల మోతాదును ప్రతి ఏడాదీ పది శాతం చొప్పున పెంచుకుంటూ పోతారు. 
  7. సెకండరీ స్థాయి వరకూ అభ్యాస ఫలితాలను నోటిఫై చేశారు. సీనియర్ సెకండరీ స్థాయి అభ్యాస ఫలితాల ముసాయిదాను విడుదల చేశారు. తగిన సూచనలను కోరుతూ ఈ ముసాయిదాను వెలువరించారు.  
  8. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలను కూడా ఒకే పరిధిలోకి తీసుకువస్తున్నారు. అంటే,.. ఎన్.ఇ.పి-2020 సిఫార్సుల మేరకు, సమగ్ర శిక్షా పథకాన్ని, మధ్యాహ్న భోజనం పథకాన్ని, పడ్నా, లిఖ్నా అభియాన్ పథకాన్ని ఒకే పరిధిలోకి తెస్తున్నారు. సవరించిన సమగ్ర శిక్షా పథకానికి జాతీయ విద్యా విధానంలో 86 పేరాలను కేటాయించాలని ప్రతిపాదించారు. దీని కింద వివిధ పథకాలను దశలవారీగా ప్రవేశపెడతారు.; పిల్లలందరికీ ఏడాది బాలవాటిక పథకం, విద్యా బోధనా, విద్యాభ్యాస సామగ్రిని అందించడం, నేషనల్ ఫౌండేషనల్, లిటరసీ మిషన్ ను ప్రారంభించడం, గురుకుల పాఠశాలలు, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలతో సహా పాఠశాలలన్నింటినీ సీనియర్ సెకండరీ స్థాయికి నవీకరించడం,  సంపూర్ణ స్థాయి ప్రోగ్రెస్ కార్డు (హెచ్.పి.సి.),  పిల్లల విద్యాభ్యాస ఫలితాలను, పరివర్తనా స్థాయిలను తెలుసుకోవడం, హిందీ, ఉర్దూ భాషోపాధ్యాయుల నియామకం, ఉపాధ్యాయుల సామర్థ్య నిర్మాణం, పుస్తకాల సంచీల బరువును నివారించే రోజులు, ఇంటర్న్.షిప్పులు, బడి బయట పిల్లల విద్యా ప్రయోజనాలకు మద్దతు, పూర్తిస్థాయి వికాసం లక్ష్యంగా పనితీరు, మధింపు, సమీక్ష, విశ్లేషణ, విజ్ఞానం అంశాల పరిశీలన (పరాఖ్), ప్రత్యేక అవసరాల బాలికకు విడిగా పారితోషికం; ప్రత్యేక అవసరాల చిన్నారుల గుర్తింపునకు తగిన ఏర్పాటు,  బ్లాక్ స్థాయిలో రిసోర్స్ సెంటర్, వొకేషనల్ ఎడ్యుకేషన్.లో హబ్, స్పోక్ నమూనా విధానం, స్మార్ట్ తరగతి, దీక్షా వేదిక, రాష్ట్ర విద్యా, శిక్షణా పరిశోధనా మండలి (ఎస్.సి.ఇ.ఆర్.టి.) తదితర సంస్థల్లో మధింపు విభాగాలకు మద్దతు వంటివి కార్యక్రమాలను దశలవారీగా ప్రవేశపెడతారు.

జాతీయ విద్యా విధానం నిబంధనలను తమ పరిధిలో అమలు చేసే  ప్రక్రియకు సారథ్యం వహించేందుకు కావలసిన కార్యదళాలను (టాస్క్ ఫోర్స్.లను) ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఏర్పాటు చేసు

***


(Release ID: 1689912) Visitor Counter : 746