ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాలపై తాజా సమాచారం

కోవిడ్-19 టీకాల కార్యక్రమంలో భాగంగా తొలినాడే భారత్ లో

పెద్ద సంఖ్యలో టీకాలు; అనేక ప్రధాన దేశాలకంటే ఎక్కువ

ఇప్పటివరకు 2.24 లక్షలమందికి పైగా కోవిడ్ టీకాలు

రెండో రోజున 6 రాష్ట్రాల్లో 17,072 మందికి టీకాలు

టీకాల తరువాత ముగ్గురు ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం

Posted On: 17 JAN 2021 7:55PM by PIB Hyderabad

కోవిడ్-19 టీకాల కార్యక్రమంలో భాగంగా భారతదేశం తొలి రోజే అతిపెద్ద సంఖ్యలో టీకాలు అందించగలిగింది. ప్రపంచంలో నే అతి భారీ కార్యక్రమంగా పేరుతెచ్చుకున్న ఈ టీకాల కార్యక్రమంలో ఇంత భారీగా టీకాలు వేయటం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల కంటే ఎక్కువ కావటం గమనార్హం. తాత్కాలిక నివేదిక ప్రకారం ఇప్పటివరకు  మొత్తం 2,24,301 మంది టీకాలు వేయించుకున్నారు.

దేశవ్యాప్తంగా జరిగిన రెండో రోజు టీకాల కార్యక్రమం కూడా విజయవంతంగా సాగింది. మొత్తం ఆరు రాష్ట్రాల్లోని 553 కేంద్రాలలో రెండవ రోజైన ఆదివారం నాడు  17,072 మంది టీకాలు వేయించుకున్నారు. 

సంఖ్య

రాష్ట్రం

టీకా ప్రదేశాలు

1

ఆంధ్ర ప్రదేశ్

308

2

అరుణాచల్ ప్రదేశ

14

3

కర్నాటక

64

4

కేరళ

1

5

మణిపూర్

1

6

తమిళనాడు

165

  

భారత్ మొత్తం

553

 

రోజువారీ ఆరోగ్య సేవలకు విఘాతం కలగకుండా ఉండటానికి వీలుగా వారంలో నాలుగు రోజులపాటు టీకాల కార్యక్రమం సాగేటట్టు చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.  కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే టీకాలిచ్చే రోజుల సమాచారాన్ని ప్రచారం చేశాయి.

జనవరి 16, 17 తేదీలలో టీకాల అనంతర ప్రతికూల ఘటనలు  447 నమోదయ్యాయి. అందులో ముగ్గురిని మాత్రమే ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. వారిలో ఒకరిని 24 గంటలలోపే  ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. మరొకరిని ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ చేయగా మూడో వ్యక్తి రిషీకేశ్ ఎయిమ్స్ లో డాక్టర్ల పర్యవేక్షణలో కొనసాగుతున్నారు. ఇప్పటిదాకా నమోదైన ప్రతికూల ఘటనల్లో జ్వరం, తలనొప్పి, కళ్ళుతిరగటం లాంటి స్వల్ప సమస్యలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి.

నిజానికి టీకాతో గాని, టీకా ప్రక్రియతోగాని సంబంధం ఉండే అవకాశం లేని చిన్న చిన్న  వైద్య పరమైన సమస్యలే ఈ టీకాల అనంతరం కనబడుతున్న ఆకస్మిక ప్రతికూల అంశాలని తెలుస్తోంది. టీకాల ప్రదేశం దగ్గర ఎలాంటి అవాంఛనీయ లక్షణాలు కనబడినా తక్షణ సాయం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. రవాణా, ఆస్పత్రికి తరలింపు, వైద్య పరీక్షలు, తక్షణ చికిత్స, తీవ్రత అంచనా కోసం కూడా ఏమేం చేయాల్లో అన్నిటికీ తగిన పూర్తిస్థాయి ఏర్పాట్లు సిద్ధం చేశారు.

టీకాల కార్యక్రమంలో పురోగతిని సమీక్షించటంతోబాటు ఈ ప్రక్రియలో ఎదురైన సమస్యలు, అవరోధాలు తగుతర అంశాలను చర్చించటంతోబాటు మరింత మెరుగ్గా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలమీద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్షా సమావేశం కూడా జరిగింది.

 

****



(Release ID: 1689575) Visitor Counter : 256