ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచంలో అతి పెద్ద టీకా కార్యక్రమం అమలుపై రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల మంత్రులతో సమీక్షించిన డాక్టర్ హర్షవర్ధన్

పుకార్లు తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టి సరైన సమాచారం ప్రజలకు చేరేలా చూడాలన్న డాక్టర్ హర్షవర్ధన్

Posted On: 16 JAN 2021 9:05PM by PIB Hyderabad

దేశవ్యాపితంగా అమలు జరుగుతున్న టీకాల కార్యక్రమంపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు / అదనపు ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన టీకాల కార్యక్రమం దేశం నలుమూలలా అమలు జరుగుతోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వాక్సినేషన్ కార్యక్రమంగా గుర్తింపు పొందింది.

కార్యక్రమాన్ని అమలు చేయడానికి రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులు చూపిన పట్టుదలను ప్రశంసించిన డాక్టర్ హర్షవర్ధన్ వారు చూపిన వ్యక్తిగత శ్రద్ధను అభినందించారు. రాష్ట్రాలు చూపిస్తున్న శ్రద్ధతో ప్రపంచంలోనే అతి పెద్ద టీకాల కార్యక్రమం విజయవంతంగా దేశంలో అమలు జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. ' ఈ రోజు మనందరికీ ఒక ప్రత్యేకమైన రోజు. వాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో గత అయిదు నెలల నుంచి జరుగుతున్న సన్నాహాలు కార్యరూపం దాల్చాయి. కార్యక్రమం అమలు జరుగుతున్న తీరుపై సంతృప్తికర నివేదికలు అందుతున్నాయి. కరోనా వైరస్ పై మనం విజయం సాదిస్తున్నామని చెప్పడానికి ఇది నిదర్శనం.' అని మంత్రి అన్నారు.

గుజరాత్ ఉప ముఖ్య ఆరోగ్యమంత్రి నితిన్‌భాయ్ పటేల్, మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే,ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్, రాజస్థాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ, హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్, బీహార్ ఆరోగ్య మంత్రి మంగల్ పాండే, కర్ణాటక ఆరోగ్య మంత్రి కె. సుధాకర్, జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా, మధ్యప్రదేశ్ ఆరోగ్య మంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌదరి, ఒడిశా ఆరోగ్య మంత్రి శ్రీ నాబా కిషోర్ దాస్, శ్రీ, తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేంద్ర, సిక్కిం ఆరోగ్య మంత్రి డాక్టర్ మణి కుమార్ శర్మ, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ కుమార్ జైన్, డామన్ , డియు అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ దాద్రానగర్ హవేలీ ఆరోగ్య అదనపు ప్రధాన కార్యదర్శి ఛత్తీస్ ఘర్ ఆరోగ్య ముఖ్య కార్యదర్శి శ్రీమతి రేణు పిళ్ళై, అమిత్ సతీజా, గోవా ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ ఎస్. రంజన్, మణిపూర్ ముఖ్యమంత్రి ఆరోగ్య సలహాదారు, నాగాలాండ్ ప్రధాన కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా మేఘాలయ ఆరోగ్య కార్యదర్శి సంపత్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

క్షేత్ర స్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు , ఫ్రంట్ లైన్ సిబ్బంది చేసిన కృషిని అభినందించిన మంత్రి ' కరోనాను నియంత్రించే అంశంలో భారతదేశం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, డాక్టర్లు మరియు ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి క్లినికల్ పరీక్షల్లో పాల్గోవడంతో 10 నెలల కాలంలో రెండు వ్యాక్సీన్లు దేశంలో ఉత్పత్తి అయ్యాయి' అని అన్నారు.

కార్యక్రమాన్ని అమలు చేయడానికి ముందు చేపట్టిన కార్యక్రమాలను వివరించిన మంత్రి ' టీకాలు ఇచ్చేవారికి శిక్షణ , సమయాల కేటాయింపు లాంటి అంశాలపై సమగ్ర శిక్షణ ఇవ్వడంతో కార్యక్రమం విజయవంతం అయ్యింది. కరోనాపై సాగుతున్న పోరాటంలో ఈ వాక్సిన్ సంజీవనిలా పనిచేస్తుంది.' అని మంత్రి అన్నారు.

కోవిడ్ -19 వాక్సిన్ భద్రతకు సంబంధించి సాగుతున్న పుకార్లు, తప్పుడు సమాచారం పై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ హర్ష్ వర్ధన్ ఆరోగ్య మంత్రులను అభ్యర్థించారు. ప్రజలకు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఇటువంటి ప్రచారాల వల్ల వసిసినిపై ప్రజల్లో అపోహలు ఏర్పడుతున్నాయని అన్న మంత్రి వీటిని తిప్పి కొట్టి వాస్తవాలను తెలియచేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మందులు, ఇంజెక్షన్లు ఉండాలన్న ప్రధానమంత్రి పిలుపును ప్రస్తావించిన మంత్రి ' వైరస్ నివారణకు మనం చేస్తున్న ప్రయత్నాలకు వాక్సిన్ సహకరిస్తుంది' అని మంత్రి అన్నారు.

తమ రాష్ట్రాల్లో కార్యక్రమం అమలు జరిగిన తీరును వివరించిన మంత్రులు, కార్యదర్శులు లక్ష్యాల మేరకు టీకాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. లభ్డిదారుల వివరాలను నమోదు చేయడంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని అన్నారు. వాక్సిన్ పట్ల ప్రజలు పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని వ్యక్తం చేశారని అన్నారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, , డిజిహెచ్ఎస్ డాక్టర్ సునీల్ కుమార్, ఎంఎస్ వందన గుర్నాని లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

***

 

 


(Release ID: 1689550) Visitor Counter : 221


Read this release in: English , Urdu , Manipuri , Punjabi