ఆర్థిక మంత్రిత్వ శాఖ
సులభతర వాణిజ్యానికి సంబంధించిన సంస్కరణలు పూర్తి చేసిన 8వ రాష్ట్రంగా కేరళ.
రూ 2,373 కోట్ల రూపాయల మేరకు అదనపు రుణ సేకరణకు అనుమతి మంజూరు
సులభతర వాణిజ్యసంస్కరణలు అమలు చేసినందుకు 8 రాష్ట్రాలకు ఇప్పటి వరకు 23,149 కోట్ల రూపాయల మేరకు అదనపు రుణ సేకరణకు అనుమతులు మంజూరు చేయడం జరిగింది.
Posted On:
13 JAN 2021 1:22PM by PIB Hyderabad
కేంద్ర ఆర్ధిక మంత్రి త్వశాఖకు చెందిన వ్యయవిభాగం నిర్దేశించిన రీతిలో సులభతర వాణిజ్యానికి సంబంధించిన సంస్కరణలను విజయవంతంగా అమలు చేసిన 8 వ రాష్ట్రంగా కేరళ రూపుదిద్దుకుంది. దీనితో కేరళ రాష్ట్రానికి సుమారు రూ 2.373 కోట్ల రూపాయలను బహిరంగ మార్కెట్ రుణాలనుంచి సమీకరించుకునేందుకు అర్హత సంపాదించింది.ఇందుకు సంబంధించి 2021 జనవరి 12 న వ్యయ విభాగం అనుమతి మంజూరుచేసింది. దీనితో కేరళ రాష్ట్రం ఇప్పటికే సులభతర వాణిజ్యాన్ని అమలు చేసిన రాష్ట్రాల సరసన 8 వ రాష్ట్రంగా చేరింది. మిగిలిన 7 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. ఇవి సులభతర వాణిజ్య సంస్కరణలను పూర్తి చేశాయి. సులభతర వాణిజ్యసంస్కరణలు పూర్తి చేయడంతో ఈ 8 రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ 23,149 కోట్ల రూపాయల మేరకు అదనపు రుణం తీసుకునే వెసులుబాటు లభించింది. రాష్ట్రాల వారీగా అదనపు రుణాలకు లభించిన అనుమతి కింది విధంగా ఉంది.
క్రమసంఖ్య
|
రాష్ట్రం
|
మొత్తం కోట్ల
రూపాయలలో
|
1.
|
ఆంధ్రప్రదేశ్
|
2,525
|
2.
|
కర్ణాటక
|
4,509
|
3.
|
కేరళ |
2,261
|
4.
|
మధ్యప్రదేశ్
|
2,373
|
5.
|
ఒడిషా
|
1,429
|
6.
|
రాజస్థాన్
|
2,731
|
7.
|
తమిళనాడు
|
4,813
|
8.
|
తెలంగాణ
|
2,508
|
సులభతర వాణిజ్య సూచిక అనేది దేశంలో పెట్టుబడుల అనుకూల వాతావరణానికి ఒక సూచికగా చెప్పుకుంటారు. అందువల్ల భారత ప్రభుత్వం 2020 మేలో సులభతర వాణిజ్యంలో సంస్కరణలను అమలుచేసిన రాష్ట్రాలకు అదనపు రుణాలు తెచ్చుకునేందుకు అనుమతులు మంజూరు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ కేటగిరీలో పేర్కోన్న సంస్కరణలు కింది విధంగా ఉన్నాయి.
(1) జిల్లా స్థాయి వాణిజ్య సంస్కరణల కార్యాచరణ ప్రణాళికతొలి అసెస్మెంట్ పూర్తి
(2)వివిధ చట్టాల క్రింద వ్యాపారాలకు తీసుకునే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అనుమతుల రెన్యువల్ అవసరాల తొలగింపు
(3) వివిధ చట్టాల కింద తనిఖీ వ్యవస్థను కంప్యూటరైజేషన్ ద్వారా సెంట్రల్‌ర్యాండమ్ సిస్టమ్ ద్వారా అమలు. ఇన్సపెక్టర్ల కేటాయింపు కేంద్రీకృతంగా నిర్వహణ. ఒకే ఇన్స్‌పెక్టర్‌ను ఆ తదుపరి సంవత్సురాలలో అదే యూనిట్‌కు కేటాయించకుండా ఉండడం. వ్యాపార యజమానికి తనిఖీకి సంబంధించి ముందస్తు నోటీసు ఇవ్వడం,తనికీ నివేదికను తనిఖీ అనంతరం 48 గంటలలో అప్‌లోడ్ చేయడం.
కోవిడ్ -19 కారణంగా ఎదురైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం 2020 మే 17 న రాష్ట్రాల రుణ సేకరణ పరమితిని వాటి జిఎస్‌డిపి లో 2 శాతం పెంచింది. ఇందులో సగం మొత్తాన్ని రాష్ట్రాలు పౌర కేంద్రిత సంస్కరణలు చేపట్టడంతో అనుసంధానం చేసింది. పౌర కేంద్రిత సంస్కరణలకు సంబంధించి ప్రభుత్వం గుర్తించిన వాటిలో (ఎ) ఒక దేశం, ఒక రేషన్‌కార్డు వ్యవస్థను అమలు చేయడం, (బి) సులభతర వాణిజ్య సంస్కరణలు (సి) పట్టణ స్థానిక సంస్థలు, యుటిలిటీ సంస్కరణలు, (డి) విద్యుత్ రంగ సంస్కరణలు
ఇప్పటివరకు 10 రాష్ట్రాలు ఒక దేశం , ఒక రేషన్ కార్డు వ్యవస్థను అమలు చేశాయి. 8 రాష్ట్రాలు సులభతర వాణిజ్య సంస్కరణలు చేపట్టాయి. 4 రాష్ట్రాలు స్థానిక సంస్థల సంస్కరణలు చేపట్టాయి. సంస్కరణలు చేపట్టిన రాష్ట్రాలకు మొత్తంగా ఇచ్చిన అదనపు రుణ సమీకరణ అనుమతి రూ 56,526 కోట్ల రూపాయలు.
***
(Release ID: 1688437)
Visitor Counter : 210