సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

విఖ్యాత సినీ దర్శకుడు 'సత్యజిత్‌ రే'కు ఘననివాళి అర్పించనున్న ఇప్ఫి

Posted On: 13 JAN 2021 5:17PM by PIB Hyderabad

ప్రపంచ ప్రఖ్యాత సినీ దర్శకుడు 'సత్యజిత్‌ రే'కు, 51వ భారత అంతర్జాతీయ చిత్రోత్సవం ఘననివాళి అర్పించనుంది. సత్యజిత్‌ రే శతజయంతి వేడుకల్లో భాగంగా, 2019లో జరిగిన ఇప్ఫి గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవంలో, కేంద్ర సమాచార &ప్రసారాల శాఖ కార్యదర్శి శ్రీ అమిత్‌ ఖరే ఈ విషయాన్ని ప్రకటించారు.

'సత్యజిత్‌ రే'కు నివాళిగా ఈ క్రింది సినిమాలను ఇప్ఫి ప్రదర్శించనుంది:
చారులత (1964)
ఘరే బైరీ (1984)
పథేర్‌ పాంచాలీ (1955)
షత్రంజ్‌ కే ఖిలారీ (1977)
సోనార్‌ ఖెల్లా (1974)

***



(Release ID: 1688281) Visitor Counter : 200