మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
నూతన విద్యా విధానం -2020ను సమీక్షించిన కేంద్ర విద్యా మంత్రి
Posted On:
13 JAN 2021 12:11PM by PIB Hyderabad
విద్యా శాఖ సీనియర్ అధికారులతో నూతన విద్యా విధానం-2020 అమలును కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ బుధవారంనాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
విద్యార్ధులు పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్యకు సజావుగా మారేందుకు సౌలభ్యాన్ని కల్పించేందుకు పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖల మధ్య నూతన విద్యా విధాన అమలును సమన్వయపరిచేందుకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి సమావేశంలో సూచించారు. నూతన విద్యా విధానం వేగవంతంగా అమలయ్యేలా చూసేందుకు ఉన్నత విద్యా శాఖ నాయకత్వంలో సమీక్షా కమిటీని, అమలు కమిటీని కూడా ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి చెప్పారు.
ప్యాకేజీ సంస్కృతి నుంచి పేటెంట్ సంస్కృతిపై దృష్టిని మార్చవలసిన అవసరాన్ని పోఖ్రియాల్ నొక్కి చెప్పారు. నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం (ఎన్ ఇటిఎఫ్), నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎన్ ఆర్ ఎఫ్) ఈ విధాన విజయానికి కీలకమని, కనుక వాటిని 2021-2022లో ఏర్పాటు చేయాలన్నారు. నూతన విద్యా విధానం అమలు, ఉనికిలో ఉన్న ప్రభుత్వ విధానాలకు మధ్య సమన్వయం ఉండేలా చూడాల్సిందిగా ఆయన భాగస్వాములకు పిలుపిచ్చారు. మెరుగైన ఫలితాల కోసం విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య లంకెను సాధ్యం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఉన్నత విద్యో అమలు చేసేందుకు మొత్తం 181 టాస్క్‌లను గుర్తించారు, నూతన విద్యా విధానంలో గుర్తించిన ఈ 181 టాస్క్‌ల పురోగతిని పర్యవేక్షించేందుకు డాష్ బోర్డును స్పష్టమైన కాలక్రమాన్ని,లక్ష్యాలతో తయారు చేయాలని అన్నారు. ఈ టాస్కుల అమలుకు నెలవారీ, వారాంతపు కేలండర్‌ను రూపొందించాలని, తద్వారా భాగస్వాములందరికీ అమలు గురించి తాజా సమాచారమివ్వవచ్చాన్నారు.
***
(Release ID: 1688265)
Visitor Counter : 274