ఆర్థిక మంత్రిత్వ శాఖ
మోసపూరితంగా రూ.8 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినందుకు ఒకరిని అరెస్ట్ చేసిన డీజీజీఐ గురుగ్రామ్
Posted On:
08 JAN 2021 7:08PM by PIB Hyderabad
చట్ట విరుద్ధంగా వస్తువుల-తక్కువ ఇన్వాయిస్లపై ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను (ఐటీసీ) పాస్ చేశాడనే ఆరోపణల పై హర్యానాలోని జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గురుగ్రామ్ జోనల్ యూనిట్ (జీజీయు) డైరెక్టరేట్ జనరల్.. న్యూఢిల్లీ వాసి అయిన శ్రీ సంజయ్ గోయల్‌ను అరెస్టు చేశారు. ఈ రోజు వరకు జీజీయు నిర్వహించిన దర్యాప్తు ప్రకారం శ్రీ సంజయ్ గోయెల్ తన యాజమాన్యంలో ఉన్న
మెస్సర్స్ రెడమెన్సీ వరల్డ్ ద్వారా ఉనికిలో లేని సంస్థల నుంచి సీసపు కడ్డీలను
కొనుగోలు చేసి సరకుల సరఫరాకు మద్దతు ఇవ్వని మోసపూరిత ఇన్వాయిస్‌లను ఉపయోగించి నకిలీ రవాణా రికార్డులను చూపించినట్టు సమాచారం. ఈ విధంగా
మెస్సర్స్ రెడమెన్సీ వరల్డ్ సంస్థ వివిధ తుది వినియోగదారులకు వస్తువులను
అందించకుండానే రూ.81724829 మోసపూరిత ఇన్వాయిస్‌లను పాస్ చేసింది.
న్యూఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలోని పలు చోట్ల దర్యాపు కార్యకలాపాలు జరిగాయి.
డాక్యుమెంటరీ ఆధారాలు, రికార్డ్ చేసిన స్టేట్‌మెంట్ల ప్రకారం, నకిలీ కంపెనీలు మరియు రవాణాదారుల నెట్‌వర్క్‌లో సంజయ్ గోయెల్ కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారించబడింది. దీని ప్రకారం శ్రీ సంజయ్ గోయెల్‌ను 08.01.2021న అరెస్టు చేసి న్యఢిల్లీ డ్యూటీ ఎంఎం ముందు హాజరుపరిచారు. డ్యూటీ ఎంఎం గోయెల్ని
జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. మొత్తం రూ.8 కోట్ల రూపాయల నకిలీ ఐటీసీ పొందినట్టుగా నిందితుడు ఆమోదించారు. ఈ విషయంలో తదుపరి దర్యాప్తు జరుగుతోంది.
***
(Release ID: 1687318)
Visitor Counter : 172