హోం మంత్రిత్వ శాఖ
జమ్మూ కాశ్మీర్ పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రప్రభుత్వ పథకానికి సీసీఈఎల్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
' తీవ్రవాదం వేర్పాటువాదాలను నిర్మూలించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు'
' 28,400 కోట్ల రూపాయల కేంద్రప్రభుత్వ పథకంతో జమ్మూకాశ్మీర్ పట్ల శ్రీ మోడీ ప్రత్యేకతను వెల్లడించారు'
' శ్రీ మోడీ దూరదృష్టితో తొలిసారిగా బ్లాకు స్థాయి నుంచి అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం అవుతుంది'
' కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర పథకం ఒక వరం'
' పథకం కాశ్మీర్ లో నూతన అధ్యాయానికి నాంది పలికి పెట్టుబడులను ఆకర్షించి 4. 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది'
' కాశ్మీర్ యువత నైపుణ్యాలను పెంచి, పరిశ్రమల పని తీరు మెరుగుపడడంతో రాష్ట్రం దేశంలోని ఇతర ప్రాంతాలతో పోటీ పడగలుగుతుంది'
Posted On:
07 JAN 2021 5:32PM by PIB Hyderabad
జమ్మూకాశ్మీరులో పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి కేంద్ర రంగ పధకానికి సీసీఈఎల్ ఆమోదం తెలపడంపట్ల కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హర్షంవ్యక్తం చేశారు. ట్వీట్ల ద్వారా శ్రీ షా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీలపై ప్రశంసల జల్లు కురిపించారు. ' తీవ్రవాదం వేర్పాటువాదాలను నిర్మూలించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 28,400 కోట్ల రూపాయల కేంద్రప్రభుత్వ పథకంతో జమ్మూకాశ్మీర్ పట్ల తనకున్న అభిమానాన్ని, రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యతను శ్రీ మోడీ వెల్లడించారు' అని శ్రీ షా పేర్కొన్నారు.
' శ్రీ మోడీ దూరదృష్టితో తొలిసారిగా బ్లాకు స్థాయి నుంచి అభివృద్ధి సాధనకు పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం అవుతుంది. దీనివల్ల స్వదేశీ ఉత్పత్తులు పెరిగి బ్లాకు స్థాయి నుంచి నూతన ఉపాధి అవకాశాలు కలుగుతాయి. రాష్ట్ర అభివృద్ధికి శ్రీ మోడీజీ తీసుకున్న నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను' అని ఆయన అన్నారు.
' కాశ్మీర్ లో కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర పథకం ఒక వరం. ఇది రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులను ఎక్కువ చేస్తాయి. ఉత్పత్తి సేవా రంగాలలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు దోహద పడే ఈ పథకం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కలిగిస్తుంది' అని శ్రీ షా అన్నారు.
' పథకం కాశ్మీర్ లో నూతన అధ్యాయానికి నాంది పలికి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెట్టుబడులను ఆకర్షించి 4. 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. పథకం కాశ్మీర్ యువత నైపుణ్యాలను పెంచి, పరిశ్రమల పని తీరు మెరుగుపడడంతో రాష్ట్రం దేశంలోని ఇతర ప్రాంతాలతో పోటీ పడగలుగుతుంది' అని శ్రీ షా పేర్కొన్నారు.
***
(Release ID: 1686867)
Visitor Counter : 108