రక్షణ మంత్రిత్వ శాఖ
‘ఆకాశ్’ క్షిపణి వ్యవస్థ ఎగుమతికి ఆమోదం తెలిపి, ఎగుమతులకు త్వరిత గతి న ఆమోదం కోసం ఒక కమిటీ ని కూడా ఏర్పాటు చేసిన మంత్రిమండలి
Posted On:
30 DEC 2020 3:50PM by PIB Hyderabad
‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధన లో భాగం గా భారతదేశం రక్షణ సంబంధిత వ్యవస్థలు, క్షిపణుల తాలూకు విస్తృత శ్రేణి ని తయారుచేసే తన సామర్ధ్యాలను పెంచుకొంటోంది. ‘ఆకాశ్’ భారతదేశ క్షిపణి వ్యవస్థల లో ముఖ్యమైందిగా ఉంది. దీనిని 96 శాతానికి పైగా దేశీయంగానే రూపొందించడం జరిగింది.
ఉపరితలం మీది నుంచి నింగి లోని లక్ష్యాన్ని చేధించే ‘ఆకాశ్’ క్షిపణి దాడి సామర్థ్యం 25 కిలో మీటర్ల వరకు ఉంది. ఈ క్షిపణి ని 2014 వ సంవత్సరంలో భారతీయ వాయు సేన లోకి, 2015 వ సంవత్సరం లో భారతీయ సైన్యం లోకి చేర్చడమైంది.
డిఫెన్స్ సర్వీసెస్ లో దీనిని చేర్చిన అనంతరం, అంతర్జాతీయ ప్రదర్శనలు/డిఫ్ ఎక్స్‌పో/ఏరో ఇండియా లు జరిగిన కాలంలో ‘అనేక మిత్ర దేశాలు ఆకాశ్’ క్షిపణి పట్ల ఆసక్తి ని కనబర్చాయి. మంత్రిమండలి ఆమోదం లభించడం తో వివిధ దేశాలు జారీ చేసే ఆర్ఎఫ్ఐ/ఆర్‌ఎఫ్‌పి లో పాలుపంచుకోవడానికి భారతదేశ తయారీదారు సంస్థలకు అవకాశం లభిస్తుంది.
ఇంతవరకు, భారతదేశ రక్షణ సంబంధిత ఎగుమతులలో విడి భాగాలు/ పరికరాలు వంటివే ఉంటూ వచ్చాయి. పెద్ద వ్యవస్థల ఎగుమతి అతి తక్కువగా ఉంది. మంత్రివర్గం తీసుకొన్న ఈ చొరవ తో దేశం తన రక్షణ ఉత్పత్తులను మెరగుపర్చుకొని, అవి ప్రపంచ స్థాయి లో పోటీ పడే విధంగా రూపొందడంలో తోడ్పాటు లభించగలదు.
‘ఆకాశ్’ తాలూకు ఎగుమతి నమూనా ప్రస్తుతం భారతీయ సాయుధ బలగాలలో మోహరించిన వ్యవస్థ కన్నా భిన్నమైందిగా ఉంటుంది.
‘ఆకాశ్’ కు అదనం గా, కోస్తా తీర ప్రాంత నిఘా వ్యవస్థ, రాడార్ లు మరియు ఎయర్ ప్లాట్ ఫార్మ్‌స్ వంటి ఇతర ప్రధానమైన వ్యవస్థల విషయంలో కూడా ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఆ తరహా వ్యవస్థల ఎగుమతికి సత్వర ఆమోదాన్ని అందించడానికి రక్షణ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి, జాతీయ భద్రత సలహాదారు లతో ఒక కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కమిటీ వేరు వేరు దేశాలకు ప్రధానమైన దేశీయ వ్యవస్థలను రాబోయే కాలంలో ఎగమతి చేయడానికి అధికారాన్ని ఇస్తుంది. ఈ కమిటీ ప్రభుత్వానికి- ప్రభుత్వానికి మధ్య ఐచ్ఛికాలు సహా, అందుబాటు లో ఉండగల వివిధ ఐచ్ఛికాలను గురించి కూడా అన్వేషిస్తుంది.
భారత ప్రభుత్వం 5 బిలియన్ యుఎస్ డాలర్ విలువైన రక్షణ సంబంధిత ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడంతో పాటు, స్నేహపూర్వక విదేశాలతో కలసి వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపర్చుకోవడం కోసం అధిక విలువ కలిగిన రక్షణ ప్లాట్ ఫార్మ్ స్ ను ఎగుమతి చేయడం పట్ల దృష్టి ని కేంద్రీకరించాలనే ఆలోచన చేసింది.
***
(Release ID: 1684893)
Visitor Counter : 118
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam