భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

సముద్ర సమాచార యాజమాన్య నిర్వహణకు 'డిజిటల్ ఓషన్'.

భూశస్త్ర మంత్రిత్వశాఖ కి చెందిన ఇంకోసిస్ రూపొందించిన మొట్టమొదటి డిజిటల్ ఫ్లాట్ ఫారం.
డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ ఓషన్ పెద్ద అడుగు, 'బ్లూ ఎకానమీ' విస్తరణకు, ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి దోహదపడుతుంది: డాక్టర్ హర్షవర్థన్

Posted On: 29 DEC 2020 5:53PM by PIB Hyderabad

భూశస్త్ర మంత్రిత్వశాఖ అనుబంధ ఇంకోసిస్ అభివృద్ధి చేసిన వెబ్ ఆధారిత అప్లికేషన్ ''డిజిటల్ ఓషన్ (www.do.incois.gov.in)''ని కేంద్ర భూశాస్త్ర, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్.హర్షవర్థన్ ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన వర్చువల్ మీటింగ్ లో ప్రారంభించారు. కేంద్ర భూశాస్త్ర కార్యదర్శి డాక్టర్. రజీవన్, కేంద్ర భూశాస్త్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ విపిన్ చంద్ర ఈ కార్యక్రమంలో కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వశాఖ , ఇంకోసిస్ కు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్థన్ మాట్లాడుతూ సముద్ర సమాచార విశ్లేషణ కోసం తొలిసారిగా 'డిజిటల్ ఓషన్" ఫ్లాట్ ఫారంను రూపొందించడం జరిగిందని అన్నారు. డిజిటల్ ఇండియా రూపకల్పనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ చేస్తున్న ప్రయత్నాలలో   'డిజిటల్ ఓషన్" ఒక పెద్ద అడుగు, డిజిటల్ సాధికారత కలిగిన సమాజం మరియు జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని రూపొందించడానికి ఇది దోహదపడుతుంది " అని డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. " రానున్న రోజులలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం కలిగి దానిని విశ్లేషించగలిగే దేశం శక్తివంతంగా మారుతుంది' అని ఆయన అన్నారు.

సముద్రం అనంత మైన జ్ఞాన భాండాగారం అని ఆయన అన్నారు పరిశోధన సంస్థలు, వివిధ సంస్థలు , వ్యూహాత్మక వినియోగదారులు, విద్యా రంగం, సముద్ర పరిశ్రమ, విధాన నిర్ణేతలతో సహా వివిధ రకాల వినియోగదారులకు 'డిజిటల్ ఓషన్’ ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. సాధారణ ప్రజలకు కూడా 'డిజిటల్ ఓషన్" సమాచారం అందుబాటులో ఉంటుందని అన్నారు.

డిజిటల్ ఓషన్ ప్రయోజనాలను వివరించిన మంత్రి "సముద్ర సంపద సుస్థిర నిర్వహణ, నీలి ఆర్ధికవ్యవస్థ నిర్మాణంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని హిందూ మహాసముద్ర దేశాల సముద్ర సమాచార సామర్థ్యాన్ని పెంపొందించడానికి 'డిజిటల్ ఓషన్’ఒక వేదికగా ప్రమోట్ చేయబడుతుంది."అని అన్నారు.

సముద్ర సంపదను వెలికి తీయడానికి , ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పరిశోధన, ఖనిజ సంపద, ఆహార వనరుల పై పరిశోధనలు వంటి అంశాలపై డీప్ ఓషన్ మిషన్ ను ప్రారంభించామని మంత్రి తెలిపారు. "డీప్ ఓషన్ మిషన్" ద్వారా లభించే సమారాచారం సముద్ర సంపద అన్వేషణకు దోహదపడుతుందని అన్నారు. సమాచార వినియోగంతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుందని పేర్కొన్న మంత్రి ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి ఇది ఉపకరిస్తుందని వివరించారు.

మత్స్య ప్రాంతాల అభివృద్ధి, సముద్ర వాతావరణం, ముందస్తు సునామీ హెచ్చరికలతో సహా సమీప సముద్ర సమాచారం మరియు సలహా సేవలను సకాలంలో అందించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించి అమలుచేస్తున్న ఇంకోయిస్ ను ఆయన ప్రశంసించారు.

వివిధ రూపాలలో అందే సమాచారాన్ని విశ్లేషించి, సమగ్ర సమాచార వ్యవస్థను రూపొందించడానికి " డిజిటల్ ఓషన్" ను సిద్ధం చేశామని భూశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ రజీవన్ పేర్కొన్నారు. సముద్ర వాతావరణ పరిశోధనపై "డిజిటల్ ఓషన్" మరింత అవగాహన కలిగిస్తుందని అన్నారు.

ఇంకోసిస్ డైరెక్టర్ టి. శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ అన్ని సేవలను ఒకే వేదికపై అందించే తొలి వేదికగా " డిజిటల్ ఓషన్"ను అభివృద్ధి చేశామని తెలిపారు.

మత్స్య కేంద్రాల అభివృద్ధి (పిఎఫ్‌జెడ్), సముద్ర వాతావరణం (ఓఎస్ఎఫ్),అలల హెచ్చరికలు, సునామి ముందస్తు హెచ్చరికలు, తుఫానుల వల్ల ఏర్పడే ముప్పు, నూనె తట్టు ప్రమాదం లాంటి అంశాలపై ముందుగానే సమాచారాన్ని అందించడానికి ఇంకోసిస్ పరిశోధనలను నిర్వహించి, వివిధ సాంకేతిక పరిజ్ఞాలను పరిశీలించి తొలిసారిగా అత్యంత ఆధునిక " డిజిటల్ ఓషన్"కు (www.do.incois.gov.in) కు రూపకల్పన చేసింది. . జియోస్పేషియల్ టెక్నాలజీని పరిస్థితులను తెలుసుకోడానికి దీనిలో అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఉపయోగించి సముద్రాలలో నెలకొన్న తాజా వాతావరణ భిన్నమైన సముద్ర శాస్త్ర డేటాను నిర్వహించడానికి మరియు ప్రదర్శించడానికి అభివృద్ధి చేసిన అనువర్తనాల సమితి ఇందులో ఉంది. డేటా ఇంటిగ్రేషన్, 3 డి మరియు 4 డి (3 డి టైమ్ యానిమేషన్‌తో ప్రేరేపిస్తుంది) విశ్లేషణ , సముద్ర లక్షణాల పరిణామాన్ని అంచనా వేయడానికి సమాచార విశ్లేషణ,సమాచార మార్పిడి , రిమోట్ సెన్సింగ్ లాంటి అత్యాధునిక అంశాలతో దీనిని రూపొందించారు.

సమాచారాన్ని వినియోగిస్తున్న వారి వివరాలు, వారు ఏమేరకు సమాచారాన్ని వినియోగించగలరు, విభాగాలు, సమాచార వర్గీకరణ, సమాచార వినియోగ మార్గదర్శకాలు లాంటి అంశాలను " డిజిటల్ ఓషన్" ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ఒకే వేదిక నుంచి వివిధ వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందించి దానిని పర్యవేక్షిండానికి " డిజిటల్ ఓషన్"అవకాశం కలిగిస్తుంది.

***

 



(Release ID: 1684550) Visitor Counter : 168