మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

నాగపూర్ వి.ఎన్.ఐ.టి. స్నాతకోత్సవం
విద్యార్థులనుద్దేశించి కేంద్ర విద్యామంత్రి వర్చువల్ ప్రసంగం

Posted On: 28 DEC 2020 6:38PM by PIB Hyderabad

నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య జాతీయ సాంకేతిక సంస్థ (వి.ఎన్.ఐ.టి.) 18వ స్నాతకోత్సవ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్ రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ వర్చువల్ పద్ధతిలో  ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే గౌరవ అతిథిగా పాల్గొన్నారు.  ఎల్. అండ్ టి.-ఎన్.ఎక్స్.టి. డిఫెన్స్ బిజినెస్ సంస్థ పూర్తి కాలం డైరెక్టర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జె. డి. పాటిల్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

https://ci6.googleusercontent.com/proxy/h_NiTeaLMxFDmMZaGsURiLd-8vDdStrLKVnfcnl1yBiXmiebcYPvkTS0Wsx9knshOL3wX1OJYxsUlnaVNp8CUiCoMNrbNng4gg1TcRfRAZizyAa82yo4F4jH=s0-d-e1-ft#http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001KV8W.jpg   

   స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రమంత్రి పోఖ్రియాల్ ‘నిశాంక్’ వీడియో సందేశం ద్వారా విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు. దేశానికి ఉన్న మూడు ‘డి’లను గురించి ఆయన ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్ (డెమోక్రసీ, డెమోగ్రఫిక్స్, డిమాండ్) అన్న అంశాలను ఆయన ప్రస్తావిస్తూ,..‘ఆత్మనిర్భర్ భారత్’ , ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అనే లక్ష్యాలను దేశం సాధించేందుకు వీలుగా ఈ మూడు ‘డి’లను వినియోగించుకోవాలని విద్యార్థులను విజ్ఞప్తి చేశారు. జాతి నిర్మాణ ప్రక్రియలో ఇంజనీరింగ్ పాత్ర ఎంతో ప్రధానమైనదన్నారు.  ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పథకాలను ఆయన వివరించారు. నయా భారత్, స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్, సశక్త్ భారత్ లను నిర్మించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.  సమాజంకోసం, దేశం కోసం ఎనలేని కృషి చేసిన సంస్థ పూర్వ విద్యార్ధులలో కొంతమందైనా  ఈ అంశంపై దృష్టిని కేంద్రీకరించాలని కోరారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి సంస్థ చేసిన కృషిని ప్రశంసించారు.

   కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే మాట్లాడుతూ, తమ విజయాలకోసం  తల్లిదండ్రులు చేసిన త్యాగాలను విద్యార్థులు స్మరించుకోవాలన్నారు. విద్యార్జనలో తాము నేర్చుకున్న విషయాలను విద్యార్థులు వినియోగంలోకి తీసుకురావలసిన తరుణం వచ్చిందన్నారు. ఇటీవలి కాలంలో వేగంగా మారుతున్న భారతదేశ ముఖచిత్రంపై విద్యార్థులు దృష్టిని కేంద్రీకరించాలన్నారు. పోటీతత్వంతో కూడిన ఈ ప్రపంచంలో తమ విలువలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. 

 వి.ఎన్.ఐ.టి.18వ స్నాతకోత్సవం సందర్భంగా 1,134మంది విద్యార్థులకు డిగ్రీల ప్రదానం జరిగింది.   ఇవీ వివరాలు.

    • డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పి.హెచ్.డి.) డిగ్రీలు-61,
    • మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎం.టెక్.)-268,
    • మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎం.ఎస్సీ)-94,
    • వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బి.టెక్.)-648,
    • బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బి.ఆర్క్.)-63.

  ప్రతిభావంతమైన విజయాలు సాధించిన విద్యార్థులను, పరిశోధక విద్యార్థులను ఈ సారి 45 పతకాలు, బహుమతులు, అవార్డులతో వి.ఎన్.ఐ.టి. సత్కరించింది.

  ఈ సంవత్సరపు ప్రతిష్టాత్మకమైన సర్ విశ్వేశ్వరయ్య పతకం,..కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగులో బి.టెక్. చేసిన అబ్దుల్ సత్తార్ మొహ్మద్ అష్రాఫ్ మాపరాకు ఇచ్చారు. బి.టెక్. అన్ని పాఠ్యాంశాల్లోకీ  అత్యధిక సి.జి.పి.ఎ. సాధించినందుకు గుర్తింపుగా ఈ పతకం ప్రదానం చేశారు. ఎన్.జి. జోషీ బహుమతి, డాక్టర్ ఎ.జి. పైథాంకర్ పతకం, మహామహోపాధ్యాయ, పద్మభూషణ్ డాక్టర్ వి.వి. మరాశీ పతకం కూడా అబ్దుల్ సత్తార్ మొహ్మద్ కే దక్కాయి. బి.టెక్. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పాఠ్యాంశంలో అత్యధిక సి.జి.పి.ఎ. సాధించినందుకు ఇచ్చే ప్రతిభా పురస్కారం, పరాగ్ టిజారే బహుమతి కూడా అతనికే లభించాయి.

   బి.టెక్. సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి కుమారి చేతనా శ్రీవాత్సవ అత్యధిక బహుమతులు, పతకాలు గెలుచుకున్నారు. సంస్థ పతకం, ప్రతిభా పాటవాల బహుమతి, వాత్వే ఎడ్యుకేషన్ ట్రస్టు బహుమతి, విష్ణు దివాకర్ అలియాస్ భావ్ సాహెబ్ గిజ్రే బహుమతి, పి.జె. సహస్రబుధే స్మారక బహుమతి, సి.టి. ఘర్పూరే బహుమతి, ఎం.ఎస్. జోషీ పతకం, అమోల్ కృష్ణారావు కవాధ్కర్ పతకం, సివిల్ ఇంజినీరింగులో అత్యధిక సి.జి.పి.ఎ. సాధించినందుకు సాదిక్ వలీ పతకం వంటివన్నీ చేతనా శ్రీవాత్సవ సాధించారు. అడ్వాన్స్.డ్ స్ట్రక్చరల్ అనాలిసిస్ అనే పాఠ్యాంశంలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నందుకు గాను డాక్టర్ ఎస్.ఎస్. అమీన్ బహుమతిని కూడా అందుకున్నారు. బి.టెక్. అన్ని సబ్జెక్టుల్లోకీ 2వ అత్యధిక సి.జి.పి.ఎ. సాధించినందుకు గుర్తింపుగా విశ్రమ్జీ జామ్దార్ స్మారకార్థం కొత్తగా ఏర్పాటు చేసిన పతకాన్ని కూడా చేతనా శ్రీవాత్సవ సాధించారు.

  బి.టెక్. మెటలర్జికల్, మెటీరియల్ ఇంజనీరింగులో రెండవ అత్యధిక సి.జి.పి.ఎ. సాధించినందుకు సాగర్ కులకర్ణి అనే విద్యార్థికి కూడా విశ్రమ్జీ జామ్దార్ పతకం దక్కింది. కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత ఈ అవార్డును ప్రదానం చేయడం ఇది రెండవ సారి. కార్యక్రమం చివర్లో సంస్థ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.ఆర్. సాథే వందన సమర్పణ చేశారు.

   వి.ఎన్.ఐ.టి. గవర్నర్ల బోర్డు (బి.ఒ.జి.) చైర్మన్, సంస్థ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ పి.ఎం. పడోలే సంస్థ తరఫున నివేదికను సమర్పించారు. తమ సంస్థ విజయాలను వివరించారు. పాఠ్యాంశాల, ప్రతిభా పాటవాల,  కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పలు పరిశ్రమలతో అనేక అవగాహనా ఒప్పందాలను తమ సంస్థ కుదుర్చుకున్నదన్నారు. ఫ్రెంచ్ విమానాల తయారీ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్.తో, సీమెన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఉదహరించారు. మెడికల్ ఇంజినీరింగులో వివిధ పరిశోధనా విభాగాలను బలోపేతం లక్ష్యంగా నాగపూర్ అఖిల భారత వైద్యవిజ్ఞాన అధ్యయన సంస్థ (ఎయిమ్స్-ఎ.ఐ.ఐ.ఎం.ఎస్.)తో అవగాహన కుదుర్చుకున్నట్టు తెలిపారు. పరిశోధన, అభివృద్ధికి సంబంధించి  గత ఏడాది వివిధ సంస్థలతో రూ. 55కోట్ల విలువైన ప్రాజెక్టులను దక్కించుకున్నామని, గత ఏడాదికంటే ఇది185శాతం ఎక్కువని ఆయన చెప్పారు.

    తాము ఈ స్థాయికి అభివృద్ధి సాధించేందుకు దేశం, సమాజం తమకు అందించిన ప్రయోజనానికి దీటుగా దేశానికి కూడా తగిన సేవలు అందించవలసిన తరుణం వచ్చిందని జె.డి. పడోలే విద్యార్థులకు పిలుపునిచ్చారు. సమాజానికి, దేశానికి తాము అందించదగినది ఏదో గుర్తించవలసిన బాధ్యత విద్యార్థులదేనన్నారు. ఈ రోజు ఈ స్థాయికి వచ్చేందుకు తమను తీర్చిదిద్దిన సంస్థకు తాము ఏం ఇవ్వాలన్న విషయంలో విద్యార్థులే బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

 

******(Release ID: 1684229) Visitor Counter : 32