శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సుగమ్య భారత్ అభియాన్ యొక్క అమలు వ్యూహాలు - "ప్రాప్యత చేయగల భారతదేశం-సాధికారిత భారతదేశం’ కలను సాకారం చేసుకోవడంలో దివ్యాంగుల కోసం సాంకేతికంగా సాధ్యమయ్యే, ఆర్థికంగా ఆచరణీయమైన సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తాయని - ఐ.ఐ.ఎస్.ఎఫ్-2020 వద్ద జరిగిన "సహాయక సాంకేతికతలు, దివ్యాంగులు పై సదస్సు" లో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.

Posted On: 25 DEC 2020 3:10PM by PIB Hyderabad

ఐ.ఐ.ఎస్.ఎఫ్-2020

"సహాయక సాంకేతికతలు మరియు దివ్యాంగులు"  -  సదస్సు 

"స్వావలంబన భారతదేశం మరియు ప్రపంచ సంక్షేమం కోసం విజ్ఞానశాస్త్రం" అనే ఇతివృత్తంతో, 6వ భారత అంతర్జాతీయ వైజ్ఞానిక ఉత్సవం (ఐ.ఐ.ఎస్.ఎఫ్) రూపొందించబడింది.  సమానమైన సమ్మిళిత వృద్ధి కోసం సర్వతోముఖాభివృద్ధి ప్రక్రియలో దివ్యాంగులను ప్రధాన స్రవంతిలో నిలబెట్టడానికి,  స్థితిస్థాపకత, అనుకూలత మరియు సహజీవనం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.  శాస్త్ర, సాంకేతిక విభాగానికి చెందిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలతో సహా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినప్పటికీ, వికలాంగుల సంఖ్య పెరగడానికి దారితీస్తున్న, అధిక జనాభా సమస్య నేపథ్యంలో, సహాయక సాంకేతికతల రంగంలో పరిశోధన, అభివృద్ధి పనులను వేగవంతం చేయవలసిన అవసరం ఉంది.

సహాయక సాంకేతికతలు మరియు దివ్యాంగులు పై ద్వితీయ సదస్సు - "స్వావలంబన కోసం,  శాస్త్ర, సాంకేతికతలు, ఆవిష్కరణల ద్వారా దివ్యాంగులకు సాధికారత"  అనే ఇతివృత్తంతో జరిగింది.   భారతదేశంలో స్వావలంబన సహాయక సాంకేతికతతో కూడిన పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో సవాళ్ళను పరిష్కరించడానికి - పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలు, వ్యవస్థాపకులు, అంకురసంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, పరిశ్రమలు, సలహాదారులు, దివ్యాంగులు  వంటి సహాయక సాంకేతికత (ఎ.టి) వేల్యూ చెయిన్ లో భాగస్వాములను ఈ సదస్సు ఒక చోట సమావేశ పరిచింది. 

ఈ కార్యక్రమాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి శ్రీ థావర్ చంద్ గెహ్లోట్ ప్రారంభించారు.  రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు - వివిధ పరిష్కారాల గురించి చర్చించడంతో పాటు, దివ్యాంగుల మధ్య స్థితిస్థాపకతను పెంపొందించడానికి సహాయక సాధనాలు, సాంకేతికతలు, పద్దతులపై చురుకైన పరిశోధన, అభివృద్ధి కోసం ఇప్పటికే ఉన్న సమస్యలపై కూడా చర్చిండడానికి,  అదేవిధంగా, దివ్యాంగుల సాధికారత కోసం ఒక స్వావలంబనతో కూడిన పరిశోధన, అభివృద్ధి పర్యావరణ వ్యవస్థను సృష్టించడం కోసం - ఒక సాధారణ వేదికను అందించాయి. 

ఈ కార్యక్రమంలో భాగంగా, భారతదేశంలో సహాయక సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, స్వతంత్ర దైనందిన జీవనం, విద్య, నాపుణ్యాభివృధి, ఉపాధి వంటి వివిధ అంశాలతో పాటు, ముఖ్యంగా, మహిళలు, ఈశాన్య రాష్ట్రాలు, ప్రస్తుత మహమ్మారి సమయంలో సవాళ్లు, స్వావలంబన కోసం స్వదేశీ సహాయక పరికరాలను  అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత పై, ప్రధాన చర్చలుప్యానెల్ చర్చలు జరిగాయి.   ఈ కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన పోస్టర్ల ప్రదర్శనతో పాటు వర్చువల్ ఎక్స్‌పో / ఎగ్జిబిషన్ను కూడా ఏర్పాటు చేశారు.

ఐ.ఐ.ఎస్.‌ఎఫ్-2020 లో దివ్యాంగుల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి శ్రీ థావర్  చంద్ గెహ్లోట్. 

ఈ కార్యక్రమంలో - పరిశోధకులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, వినియోగదారుల బృందాలు, పారిశ్రామికులు, వైద్యులు,  అభ్యాసకులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు చెందిన దాదాపు 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని,  దివ్యాంగుల అపరిష్కృత అవసరాలపై చర్చించారు. సమస్యలను పరిష్కరించడానికి వినూత్న విధానాలను అవలంబించాలని పిలుపునిచ్చారు. వినియోగదారులకు అనువైన ఉత్పత్తి రూపకల్పన, అభివృధి లో - వివిధ వాటాదారుల సహాయక సాంకేతికతలతో కూడిన సమగ్ర అభివృద్ధి, పాత్ర మరియు బాధ్యతలను సాకారం చేయడానికి,  ప్రాప్యత, వినియోగం, సమగ్ర పరిశోధన, అభ్యాసం, అత్యవసరమైన వినియోగదారుల ప్రమేయంతో వివిధ విభాగాల పరిశోధనల మధ్య పెరిగిన సమన్వయాన్ని ప్రోత్సహించడానికి,  ఈ సిఫార్సులు మార్గం సుగమం చేస్తాయని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు భావించారు. సుగమ్య భారత్ అభియాన్ యొక్క అమలు వ్యూహాలను మాత్రమే కాకుండా, ‘ప్రాప్యత చేయగల భారతదేశం-సాధికారిత భారతదేశం’ కలని సాకారం చేసుకోవడంలో దివ్యాంగుల కోసం సాంకేతికంగా సాధ్యమయ్యే , ఆర్థికంగా ఆచరణీయమైన సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో కూడా, విశాల దృక్పథంతో, ఈ సిఫార్సులు సహాయపడతాయని, వారు చెప్పారు. 

సమాజంలో చురుకైన సహకారం అందించే సభ్యులుగా దివ్యాంగులు పాల్గొనడానికి మరియు గుర్తించడానికి, ప్రపంచ దృక్పథంలో, చర్చలు, మంచి అవకాశాలను కల్పిస్తాయి. వికలాంగులకు సంబంధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం 2030 ఎజెండాను సాధించడానికి ఎటువంటి వివక్షను వారు ఎదుర్కోకూడదు.

*****



(Release ID: 1683736) Visitor Counter : 177