రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

1 జ‌న‌వ‌రి,2020 నుంచి ఫాస్టాగ్‌ల‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన గ‌డ్క‌రీ

Posted On: 24 DEC 2020 5:09PM by PIB Hyderabad

దేశంలోని అన్ని వాహనాల‌కు సంవ‌త్స‌రం నుంచి ఫాస్టాగ్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తున్న‌ట్టు కేంద్ర రోడ్డు ర‌వాణా, హైవేలు, ఎంఎస్ ఎంఇల మంత్రి నితిన్ గ‌డ్క‌రీ గురువారం ప్ర‌క‌టించారు. దృశ్య మాధ్య‌మం ద్వారా జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ, ఫాస్టాగ్‌ను 1 జ‌న‌వ‌రి, 2020 నుంచి అమ‌లు చేస్తున్న‌ట్టు చెప్పారు. దానివ‌ల్ల వినియోగ‌దారుల‌కు క‌లిగే ల‌బ్ధి గురించి మాట్లాడుతూ, వాహ‌నదారులు న‌గ‌దు చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వ‌ద్ద ఆగాల్సిన ప‌ని ఉండ‌ద‌న్నారు. అలాగే అది ఇంధ‌నాన్ని కూడా ఆదా చేస్తుంద‌న్నారు. 
ఫాస్టాగ్‌ల‌ను 2016వ సంవ‌త్స‌రంలో నాలుగు బ్యాంకులు క‌లిసి ప్రారంభించి, ఒక ల‌క్ష ఫాస్టాగ్ ల‌ను జారీ చేశాయ‌న్నారు. ఈ సంఖ్య 2017లో ఏడు ల‌క్ష‌ల‌కు చేరింద‌ని, 2018 నాటికి 34 ల‌క్ష‌ల ఫాస్టాగ్‌లు జారీ అయ్యాయ‌ని అన్నారు.
1 డిసెంబ‌ర్‌, 2017కు ముందు అమ్మిన ఎం, ఎన్ వ‌ర్గానికి చెందిన వాహ‌నాల‌కు ఫాస్‌టాగ్ (FASTag)ను సిఎంవిఆర్‌, 1989కి చేసిన స‌వ‌ర‌ణ‌ల ద్వారా 1 జ‌న‌వ‌రి, 2021 నుంచి త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర రోడ్డు ర‌వాణా, హైవేల  మంత్రిత్వ శాఖ ఈ ఏడాది న‌వంబ‌ర్ లో నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. 
కేంద్ర మోటార్ వాహ‌నాల నిబంధ‌న‌లు, 1989 ప్ర‌కారం 2017, డిసెంబ‌ర్ 1 నుంచి కొత్త నాలుగు చ‌క్ర‌వాహ‌నాలు అన్నింటి న‌మోదుకు ఫాస్టాగ్ ను త‌ప్ప‌ని చేశారు. దీనిని వాహ‌న ఉత్ప‌త్తిదారులు లేక వారి డీల‌ర్లు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. అలాగే, ర‌వాణా వాహ‌నాల ఫాస్టాగ్ ఫిట్‌మెంట్ త‌ర్వాత‌నే  ఫిట‌నెస్ స‌ర్టిఫికెట్ ను రెన్యువ‌ల్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి చేసింది. అలాగే, జాతీయ ప‌ర్మిట్ ఉన్న వాహ‌నాల‌కు ఫాస్టాగ్ ఫిట్‌మెంట్‌ను 2019, అక్టోబ‌ర్ 1 నుంచి త‌ప్ప‌నిస‌రి చేసింది. 
ఫార్మ్ 51 (ఇన్సూరెన్స్ స‌ర్టిఫికెట్‌) స‌వ‌ర‌ణ ద్వారా 3వ పార్టీ బీమాను పొందే స‌మ‌యంలో ప్రామాణిక‌మైన ఫాస్టాగ్ ఉండటం త‌ప్ప‌నిస‌రి చేసింది. త‌ద్వారా ఫాస్టాగ్ ఐడి వివ‌రాల‌ను సంగ్ర‌హం చేయ‌వ‌చ్చు. ఇది 2021, ఏప్రిల్ 1 నుంచి అమ‌లులోకి వ‌స్తుంది.
టోల్ ప్లాజాల వ‌ద్ద ఫీజు చెల్లింపులు ఎల‌క్ర్టానిక్ ప‌ద్ధ‌తి ద్వారా 100% చెల్లించి, ఫీ ప్లాజాల ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా సాఫీగా చూసేందుకు ఈ నోటిఫికేష‌న్ ఒక ముంద‌డుగ‌ని చెప్ప‌వ‌చ్చు.  ప్లాజాల వ‌ద్ద ఎక్కువ స‌మ‌యం వేచి చూడ‌న‌వ‌స‌రం లేక‌పోవ‌డ‌మే కాక ఇంధ‌నాన్ని కూడా దీని వ‌ల్ల ఆదా చేయ‌వ‌చ్చు. 
బ‌హుళ మార్గాలు - భౌతిక ప్రాంతాలు, ఆన్ లైన్ ప‌ద్ధ‌తి ద్వారా ఫాస్టాగ్ అందుబాటులోకి తీసుకువ‌స్తున్నారు. త‌ద్వారా పౌరులు త‌మ సౌల‌భ్యాన్ని బ‌ట్టి రానున్న రెండు నెల‌ల్లో త‌మ వాహ‌నాల‌కు వాటిని త‌గిలించుకోవ‌చ్చు. 

 

***


 



(Release ID: 1683515) Visitor Counter : 88