శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

బాధ్యతాయుత వైజ్ఞానిక సమాచారం లక్ష్యంగా సైన్స్, టెక్నాలజీ మీడియా సమ్మేళనం

కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సందేశం

వైజ్ఞానిక శాస్త్రాన్ని ప్రజల వద్దకు చేర్చడానికి స్వల్పవ్యవధి వీడియోలే చక్కని మార్గం: ప్రసారభారతి సి.ఇ.ఒ.

Posted On: 24 DEC 2020 4:57PM by PIB Hyderabad

ఐ.ఐ.ఎస్.ఎఫ్-2020

https://ci4.googleusercontent.com/proxy/IqzQDquaPG_lu4Lxok8TkdBBXLuoIwTuUd9wNT8tQgm3edUZTdq6cFhSJP__ALVzMYPcR9hEtoFhE-IIvgxSa1BDB27J4slDmSo4ghVn6MPpEz-UytJCeNEotw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030QE9.jpg

  ‘సైన్స్, టెక్నాలజీ మీడియా సమ్మేళనం’  అనేది   భారతీయ, అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్ర ఉత్సవం (ఐ.ఐ.ఎస్.ఎఫ్.)లో ప్రధాన కార్యక్రమం. డిజిటల్ మీడియా ఆవిర్భావం, డిజిటల్ మీడియా రూపాంతరాలపై ఈ సదస్సు దృష్టి పెడుతుంది. మహమ్మారి అంటువ్యాధులవంటి వైపరీత్యాలపై పోరులో బాధ్యతాయుతమైన వైజ్ఞానిక ప్రతిస్పందనపై ఈ సమ్మేళనంలో ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తారు.  ప్రారంభ కార్యక్రమంలో విజ్ఞాన శాస్త్ర ప్రతినిధులు, పాత్రికేయులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణయ కర్తలు పాల్గొన్నారు. విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన బహుముఖ అంశాలు, మీడియా రంగ వినియోగం తదితర అంశాలను చర్చించేందుకు వారు ఈ సమ్మేళనంలో పాలుపంచుకున్నారు.

    కేంద్ర విజ్ఞానశాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన, భూగోళ శాస్త్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా ఒక సందేశం ఇచ్చారు.  మహమ్మారి వ్యాధి ప్రబలిన ప్రస్తుత తరుణంలో శాస్త్రీయ, డిజిటల్ మార్గాల ద్వారా విజ్ఞాన శాస్త్రం ఎన్నో సేవలందించిందని హర్షవర్ధన్ తన సందేశంలో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన విజ్ఞానశాస్త్ర ప్రతిస్పందనా శక్తిని ఈ సదస్సు ప్రధానంగా ప్రస్తావిస్తుందని, మహమ్మారి వ్యాప్తిపై ‘విపరీతస్థాయిలో’ అందే భారీ పరిమాణంలోని సమాచారాన్ని వడపోసి సరైన, నిఖార్సయిన సమాచారాన్ని నిగ్గుతేల్చడానికి ఈ సమ్మేళనం దోహదపడుతుందని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.   

ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) శశి ఎస్. వెంపటి  సదస్సులో ప్రధానోపన్యాసం చేశారు. విజ్ఞాన శాస్త్రాన్ని సామాన్య ప్రజలకు చేరవ చేసేందుకు స్వల్పకాల చలనదృశ్యాల వీడియోలు చక్కని మాధ్యమంగా ఉపయోగపడతాయన్నారు. ఇటీవల జరిగిన శని, గురుగ్రహాల సంయోగాన్ని గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ, ఖగోళ పరిణామాలపై జాతీయ టెలివిజన్ వెలువరించే ప్రసారాలపట్ల పదిలక్షల మందికి పైగా వీక్షకులు ఆసక్తి చూపారన్నారు. ఈ ఖగోళ దృశ్యంపై మీడియా దృష్టిని కేంద్రీకరించడంతో ఈ సంఘటనపై, ఖగోళ సంబంధమైన ఇతర అంశాలపై ప్రజల్లో ఎంతో కుతూహలం పెరిగిందని అన్నారు. 

గౌరవ అతిథిగా పాల్గొన్న కుశభావు ఠాక్రే పత్రకారిత ఆవం జనసంచార్ విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ బలదేవో భాయ్ శర్మ మాట్లాడుతూ, ప్రజలకు అర్థమయ్యే భాషలో వైజ్ఞానిక  అంశాలను జనసామాన్యానికి చేరవేసే బాధ్యత విజ్ఞాన శాస్త్ర ప్రతినిధులపై, పాత్రికేయులపై ఉందఅన్నారు. ఈ సమ్మేళనం నేపథ్యంలో,.. ప్రజాదరణ పొందిన విజ్ఞానశాస్త్ర పత్రికల, మ్యాగజైన్ల కవర్ పేజీలను ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన సైన్స్ మీడియా వర్చువల్ ఎగ్జిబిషన్ ను కూడా   ప్రారంభించారు. 

  సైన్స్, టెక్నాలజీ మీడియా సదస్సు ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించిన కేంద్ర సైన్స్ టెక్నాలజీ శాఖ సలహాదారు, శాస్త్రవేత్త,. డాక్టర్ మనోజ్ కుమార్ పతాయిరియా మాట్లాడుతూ,.. విజ్ఞాన శాస్త్రంపై మీడియాలో సమాచారం పరిమాణం మరింత పెరగాలన్నారు. "సమాచార సాధనాల్లో విజ్ఞానశాస్త్ర సమాచారం: గతం, వర్తమానం, భవిష్యత్తు" అన్న అంశంపై జరిగిన ప్యానెల్ చర్చను ఈ సమ్మేళనంలో భాగంగా నిర్వహించారు. నకిలీ వార్తల బెడదను అరికట్టే పోరాటానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యంపై వక్తలు ప్రసంగించారు. కోవిడ్-19 వ్యాప్తిపై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా దుష్ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుందని వారన్నారు.

  ప్యానెల్ చర్చా కార్యక్రమం అనంతరం, "విజ్ఞాన శాస్త్రాన్ని బలోపేతం చేయడం, సమాచార సాధనాలకు తగిన ప్రమేయం కల్పించడం" అన్న అంశంపై కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, మఖన్ లాల్ చతుర్వేది జర్నలిజం, కమ్యూనికేషన్ల నేషనల్ యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ కె.జి. సురేష్ మధ్య సంవాదం జరిగింది. విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించే విద్యార్థుల భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించే అంశంపై ప్రముఖ శాస్త్రవేత్తలు, పేరుపొందిన పాత్రికేయలు, మీడియా నిపుణలు విస్తృతంగా చర్చించారు.

సంప్రదాయ హస్తకళలు, హస్తకళాకారుల సమావేశం, ప్రదర్శన

 భారతీయ విజ్ఞానశాస్త్ర విజయాలు, సృజనాత్మక ఆవిష్కరణలను చాటిచెప్పే లక్ష్యంతో సంప్రదాయ హస్తకళలల, హస్తకళాకారుల సమావేశం, ప్రదర్శనను రూపొందించారు. విజ్ఞాన శాస్త్ర విద్యార్థుల, యువ పరిశోధకుల ప్రయోజనాలు, సామాన్య ప్రజల అవగాహన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్నిరూపొందించారు. సైన్స్, టెక్నాలజీ రంగంలో భారతదేశం సేవలను తెలియజెప్పడం, సమాజాన్ని పీడించే తీవ్రమైన సమస్యలకు పరిష్కారాలకోసం యువ శాస్త్రవేత్తలను కార్యోన్ముఖం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. విజ్ఞానశాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్.ఐ.ఆర్.)కి అనుబంధంగా భోపాల్ లో ఏర్పాటు చేసిన అడ్వాన్స్.డ్ మెటీరియల్స్, ప్రాసెస్ రీసెర్చ్ సంస్థ (ఎ.ఎం.పి.ఆర్.ఐ.) ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వహణా సంస్థగా వ్యవహరించింది.  ప్రారంభ కార్యక్రమానికి భోపాల్ లోని రాజీవ్ గాంధీ ప్రౌద్యోగిక విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ డాక్టర్ సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెంగళూరులోని నేషనల్ అడ్వాన్స్.డ్ స్టడీస్ సెంటర్ (ఎన్.ఐ.ఎ.ఎస్.)కు చెందిన ప్రొఫెసర్, డాక్టర్ శారదా శ్రీనివాసన్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. సి.ఎస్.ఐ.ఆర్.-ఎ.ఎం.పి.ఆర్.ఐ. డైరెక్టర్ డాక్టర్ ఎ.కె. శ్రీవాత్సవ సభ్యులకు స్వాగతం పలికారు. ఐ.ఐ.ఎస్.ఎఫ్. వేడుక ఆవిర్భావాన్ని, ప్రాముఖ్యతను గురించి క్లుప్తంగా ఆయన వివరించారు.

   భారతీయ సంప్రదాయ కళలు, హస్తకళల్లో దాగిఉన్న వైజ్ఞానిక, చారిత్రక, సాంకేతక పరిజ్ఞాన అంశాలను చాటిచెప్పే  విభిన్నమైన ప్రత్యేక కార్యక్రమమే,. ఈ జాతీయ స్థాయి వర్చువల్ సమావేశం. ప్రదర్శన. హస్తకళా ఉత్పాదనల నాణ్యత, హస్తకళాకారుల జీవితాల మెరుగుదలకు చేపట్టాల్సిన విధానాలు, భావి అవకాశాలు తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. అగారియా, భరియా వంటి అనేక ఆదిమతెగల ప్రజల అభ్యున్నతికి చేపట్టే కార్యక్రమాల అమలును తీరును తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం ద్వారా వీలు కలుగుతుంది. పీచు, నూలు, తాడు వంటి, ఉత్పత్తుల తయారీ, చేతిపని వస్తువుల తయారీ తదితర ప్రక్రియలను తెలుసుకోవడానికి ఇది  దోహదపడుతుంది. సంప్రదాయ హస్తకళ నిపుణులు, కళాకారులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, కుటీర పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, విధాన నిర్ణయ కర్తలు, విద్యార్థులు.. వీరందరినీ, ఒకే వేదిక మీదకు తీసుకురావడానికి కూడా ఉపకరిస్తుంది. సంప్రదాయ హస్తకళలను మరింత మెరుగుపరిచి, ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుకోగలిగేలా  తీర్చిదిద్ది స్వావలంబనతో కూడిన (ఆత్మనిర్భర భారత్) కలను సాకారం చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహపడుతుంది.

 

*******

 

 



(Release ID: 1683514) Visitor Counter : 176