ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారత్ లో సురక్షితమైన, పర్యావరణ హితమైన జాతీయ రహదారుల అభివృద్ధికి 500 మిలియన్ డాలర్ల ప్రపంచ బ్యాంకు సహాయం
Posted On:
22 DEC 2020 8:15PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో సురస్సాక్షితమైన, విశాలమైన జాతీయ రహదారుల
అభివృద్ధికి 500 మిలియన్ డాలర్ల సహాయానికి ప్రపంచ బ్యాంకు, భారత ప్రభుత్వం మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ప్రాజెక్టు వల్ల సురక్షితమైన, పర్యావరణహితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రధాన స్రవంతిలో చేర్చడంలో కేంద్ర రోడ్డు రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) సామర్ధ్యం పెరుగుతుంది.
దేశవ్యాప్తంగా వివిధ భూభాగాలలో 783కిలోమీటర్ల నిడివి గల రహదారుల నిర్మాణానికి ఈ గ్రీన్ నేషనల్ హై వేస్ కారిడార్ ప్రాజెక్ట్ కేంద్ర రోడ్డు రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు సహాయపడుతుంది. ఇందుకు అవసరమైన నిర్మాణ సామాగ్రిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానికంగా సేకరిస్తారు. పారిశ్రామిక అనుబంధ ఉత్పత్తులు (గౌణఫలము), ఇతర జీవఇంజనీరింగ్ పరిష్కారాలను ఉపయోగిస్తారు. రహదారుల నిర్మాణం, నిర్వహణలో భూతాపాన్ని వృద్ధిచేసే వాయు ఉద్గారాలను తగ్గించడానికి ప్రాజెక్ట్ తోడ్పడుతుంది.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యావరణ సహనీయ అభివృద్ధికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్ధిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి డాక్టర్ సి. ఎస్. మహపాత్ర అన్నారు. సురక్షితమైన రోడ్ల నిర్మాణంలో ఈ ప్రాజెక్టు ఉన్నత ప్రమాణాలను నెలకొల్పగలదని, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ఎంపిక చేసిన ప్రాంతాలు సంధాయకత పెరగడానికి మరియు ఆర్ధిక అభివృద్ధి ప్రోత్సాహానికి కూడా దోహదం చేయగలవు.
భారత ప్రభుత్వం తరపున డాక్టర్ మహపాత్ర, ప్రపంచ బ్యాంకు తరపున తాత్కాలిక కంట్రీ డైరెక్టర్ సుమీలా గుల్యాణి ఒప్పందంపై సంతకాలు చేశారు.
రవాణా మౌలిక సదుపాయాల కల్పనలో తుది ఉద్దేశం ఎలాంటి అంతరాయాలు లేకుండా సంధాయకతను నెలకొల్పడం మరియు నిర్వహణ ఖర్చులు తగ్గించడం. రోడ్ల రంగంలో వసతులను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అనేక పెట్టబడులు చేయడం మొదలెట్టింది. దీనివల్ల సరుకుల రవాణా పరిమాణం పెరుగుతుంది. జాతీయ రహదారులపై వాహనాల కదలిక తీరు మారుతుంది. ఏవైనా అడ్డంకులు ఉంటె వాటిని అధిగమించడానికి వినూత్న పరిష్కారాలను రూపొందిస్తారు.
చారిత్రాత్మకంగా ఇండియా రవాణా రంగంలో మహిళలకు ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయి. ఈ ప్రాజెక్టు రహదారులకు చేరువలో పర్యావరణ హితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మహిళలకు ఉపాధి అవకాశాల సృష్టికి ప్రాజెక్టు కృషి చేస్తుంది.
"ఈ ప్రాజెక్టు నాలుగు రాష్ట్రాలలో రోడ్డు వినియోగదారులకు సమర్ధవంతమైన రవాణా సౌకర్యాన్ని కల్పించడమే కాక ప్రజలు మార్కెట్లను చేరేందుకు , సేవలను పొందడానికి, సమర్ధవంతంగా నిర్మాణ సామాగ్రి, నీరు వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ప్రకృతి వనరుల తరుగుదలను తగ్గించడానికి , భూతాపాన్ని వృద్ధిచేసే వాయు ఉద్గారాల తగ్గుదలకు దోహదం చేసేందుకు తోడ్పడుతుంది" అని ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ జునైద్ అహ్మద్ తెలిపారు.
ఇండియాలో రోడ్డు మార్గంలో జరిగే రాకపోకలతో 40 శాతం జాతీయ రహదారుల ద్వారా జరుగుతుంది. అయితే జాతీయ రహదారులలో చాలా భాగాలు పటిష్టంగా లేకపోవడం, బలహీమైన డ్రైనేజీ వ్యవస్థ ఉండటం వల్ల ప్రమాదాలకు హేతువుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను పటిష్టం చేయడం మరియు విస్తరించడం, రోడ్డు పక్కన కొత్త కాలిబాటలు నిర్మాణం, డ్రైనేజి సౌకర్యాలు మరియు పక్క దారులు (బై పాస్) నిర్మాణం, జంక్షన్లను మెరుగుపరచడం మరియు రోడ్డు భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని రుతువులలో తట్టుకునే విధంగా ప్రాజెక్టు డిజైన్ లో మార్పులు చేసి అమలు చేస్తారు.
అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు (ఐ బి ఆర్ డి) నుంచి పొందే 500 మిలియన్ డాలర్ల ఋణం 13.5 సంవత్సరాలలో చెల్లించాలి. అవసరమైతే చెల్లింపు గడువును మరో ఐదేళ్లు పొడిగిస్తారు.
***
(Release ID: 1683415)
Visitor Counter : 234