సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

మౌలిక సదుపాయాలు, మానవ శక్తి, ఇతర వనరుల సక్రమ వ్యవస్థీకరణ తో ఐదు ఫిల్మ్ మీడియా యూనిట్ ల విలీనానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 23 DEC 2020 4:49PM by PIB Hyderabad

ఒక సంవత్సరం కాలం లో 3,000 కు పైగా సినిమాలను నిర్మించడం తో పాటు భారతదేశం ప్రపంచం లోనే అతి పెద్ద సంఖ్య లో చలనచిత్రాలు నిర్మాణం అవుతున్న దేశం గా ఉంది. అంతే కాదు, ఈ పరిశ్రమ కు ప్రైవేటు రంగం నాయకత్వం వహిస్తోంది.  చలనచిత్ర రంగానికి మద్దతిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం 4 చలనచిత్ర మాధ్యమ విభాగాలైన ఫిల్మ్ స్ డివిజన్ ను, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ను, నేశషనల్ ఫిలిం ఆర్కైవ్జ్ ఆఫ్ ఇండియా ను, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ, ఇండియా ను కలిపేందుకు ఆమోదాన్ని తెలిపింది.  వాటిని జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్ డిసి) లిమిటెడ్ తో విలీనం చేస్తారు.  దీని కోసం ఎన్ ఎఫ్ డిసి తాలూకు మెమొరాండమ్ ఆఫ్ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ ను విస్తరిస్తారు.  ఆ తరువాత ఏర్పడే సంస్థ, ఇంతవరకు ఈ నాలుగు సంస్థలు నిర్వహించిన కార్యకలాపాలన్నింటినీ తాను చేపడుతుంది.  చలనచిత్ర మాధ్యమ విభాగాలను ఒక కార్పొరేషన్ నీడలోకి తీసుకురావడం వల్ల సంబంధిత కార్యకలాపాల, వనరుల కలయిక కు దారి తీయడంతో పాటు చక్కని సమన్వయాన్ని సాధించేందుకు కూడా వీలు ఉంటుంది.  అంతేకాదు, ప్రతి ఒక్క మీడియా యూనిట్ కు నిర్దేశించిన కర్తవ్యాల పాలన లో సమన్వయానికి, దక్షతకు పూచీ పడటం సాధ్యమవుతుంది.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనం లో పనిచేస్తున్న ఫిల్మ్ స్ డివిజన్ ను 1948 వ సంవత్సరం లో ఏర్పాటు చేయడమైంది.  దీనిని ప్రధానం గా ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు భారతదేశ చరిత్ర తాలూకు సినిమేటిక్ రికార్డు తాలూకు ప్రచారానికి గాను వార్తాచిత్రాలను, వార్తాసంచికలను తయారు చేయడానికి స్థాపించడమైంది.

చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ, ఇండియా ను సొసైటీస్ యాక్ట్ లో భాగంగా 1955 వ సంవత్సరం లో స్థాపించడం జరిగింది.  ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ.  ఈ సంస్థ చలనచిత్రాల మాధ్యమం ద్వారా బాలలకు, యువజనులకు విలువలపై ఆధారపడ్డ వినోదాన్నిఅందించాలన్న నిర్దిష్ట లక్ష్యం తో పనిచేస్తోంది.

నేశనల్ ఫిలిమ్స్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనం లో పనిచేసే ఒక కార్యాలయం గా 1964 వ సంవత్సరం లో ఒక మీడియా యూనిట్ రూపం లో నెలకొల్పడం జరిగింది.  దీని ముఖ్యోద్దేశ్యం  భారతదేశ చలనచిత్ర రంగం తో ముడిపడ్డ వారసత్వాన్ని సేకరించి, సంరక్షించడం.  

డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ను కూడా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కు అనుబంధం గా 1973 వ సంవత్సరం లో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ చలనచిత్రాలను, సాంస్కృతిక ఆదాన- ప్రదానాలను ప్రోత్సహించడం కోసం దీనిని నెలకొల్పారు.

ఎన్ఎఫ్ డిసి ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గా 1975 వ సంవత్సరం లో ఏర్పాటైంది.  దీని ప్రధాన ఉద్దేశ్యమల్లా భారతదేశ చలనచిత్ర పరిశ్రమ ను సువ్యవస్థితమైంది గాను, దక్షత కలిగింది గాను, సమగ్రమైంది గాను అభివృద్ధి చేయడానికి తగిన ప్రణాళికలను రూపొందించడమూ, ఆ ప్రణాళికలను అమలుచేయడమూను.

ఈ మీడియా యూనిట్ల విలీనాన్ని కేంద్ర మంత్రివర్గం తన సమావేశంలో ఆమోదిస్తూ దానితో పాటు విలీనం కార్యరూపం దాల్చడానికి సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షించడానికి, ఆస్తుల, ఉద్యోగుల బదిలీ లకు సంబంధించి సలహా ఇవ్వడానికి ఒక ట్రాన్సాక్షన్ అడ్వైజర్ ను, లీగల్ అడ్వైజర్ ను నియమించేందుకు కూడా ఆమోదం తెలిపింది.  

ఈ విభాగాల ఏకీకరణ కసరత్తు ను చేపడుతూనే సంబంధిత మీడియా యూనిట్ ల ఉద్యోగుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించడం జరుగుతుంది. అంతేకాదు... ఏ ఉద్యోగి ని కూడా పదవి నుంచి తొలగించడం జరగదు.

ఒక చత్ర ఛాయ సంస్థగా నిలిచే ఎన్ఎఫ్ డిసి లో ఫిల్మ్ మీడియా యూనిట్ ల విలీనం అనంతరం పదోన్నతులు, చలనచిత్ర సంబంధ కంటెంట్ నిర్మాణం, పరిరక్షణ.. అన్నీ కూడాను ఒక యాజమాన్యం పరిధి లోకి రాగలవు.  కొత్త గా ఏర్పడే సంస్థ భారతదేశ చలనచిత్ర రంగ అభివృద్ధి ని సమతుల్యమైందిగా, అభివృద్ధి ప్రధానమైందిగా తీర్చిదిద్దడం కోసం పాటుపడుతుంది.  ఈ క్రమం లో కథాచిత్రాలు/ఒటిటి ఫ్లాట్ ఫార్మ్ స్ కోసం ఉద్దేశించిన కంటెంట్, బాలల కు ఉద్దేశించిన కంటెంట్, ఏనిమేశన్, లఘు చిత్రాలు, వార్తాచిత్రాలు.. ఇలా అన్ని రకాలైన శైలులను లెక్క లోకి తీసుకోవడం జరుగుతుంది.


ఫిల్మ్ మీడియా యూనిట్ లను ఒకే కార్పొరేశన్ పరిధి లో కలపడం వల్ల వివిధ కార్యకలాపాల మధ్య సమన్వయం తో పాటు అందుబాటులో ఉన్న అన్ని విధాలైన మౌలిక సదుపాయాలను, మానవ శక్తి ని సర్వోత్తమంగా, సమర్ధంగా వినియోగించుకొనేందుకు వీలు చిక్కుతుంది.  దీనితో ఒక సంస్థ నిర్వహించే కార్యకలాపాలనే మరొక సంస్థ కూడా నిర్వహించే ధోరణి ని తగ్గించడంలో,  ఖజానా కు ఖర్చుల భారాన్ని తప్పించడంలో తోడ్పాటు లభిస్తుంది.



 

***



(Release ID: 1683090) Visitor Counter : 118