పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

భారతదేశానికి, అఫ్గానిస్తాన్ కు మధ్య సవరించిన వైమానిక సేవల ఒప్పందం పై సంతకాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 23 DEC 2020 4:43PM by PIB Hyderabad

భారతదేశానికి, అఫ్గానిస్తాన్ కు మధ్య సవరించి వైమానిక సేవల ఒప్పందం పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తన ఆమోదాన్ని తెలిపింది.

ఈ సవరించిన వైమానిక సేవల ఒప్పందం రెండు దేశాల మధ్య పౌర విమానయాన సంబంధాల్లో ఒక ముఖ్యమైన ఘటన నిలవనుంది.  పౌర విమానయాన రంగం లో ఏర్పడే పరిణామాలకు అనుగుణం గా, ఉభయ దేశాల మధ్య వ్యాపారం, పెట్టుబడి, పర్యటన, సాంస్కృతిక ఆదాన- ప్రదానాలు మరింత ఎక్కువగా చోటు చేసుకునేందుకు కూడా ఈ ఒప్పందం తోడ్పడుతుంది.  ఇది ఇప్పటి కంటే ఎక్కువ గా విమానాల రాక పోకలకు అనువైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది, అలాగే అంతరాయం ఎదురవనటువంటి రాకపోకలకు వీలు ను కల్పిస్తుంది.  ఇరు పక్షాల విమాన సంస్థలకు వాణిజ్య సరళి అవకాశాలను కల్పిస్తూనే, మరింత భద్రత కు, సురక్ష కు సైతం పూచీ పడుతుంది.



 

***



(Release ID: 1683075) Visitor Counter : 128