రైల్వే మంత్రిత్వ శాఖ

2024 నుంచి రైళ్లలో వెయిటింగ్‌ జాబితాలకు సంబంధించి ప్రచురితమైన వార్తలపై స్పష్టీకరణ


Posted On: 19 DEC 2020 11:41AM by PIB Hyderabad

'జాతీయ రైల్వే ప్రణాళిక' ముసాయిదాపై వివిధ వార్తాపత్రికల్లో, ఆన్‌లైన్‌లో ప్రముఖంగా వార్తలు వచ్చాయి.

 

2024 నుంచి రైళ్లలో వెయిటింగ్‌ జాబితా ఉండదని, లేదా ఖరారైన టిక్కెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ చెప్పినట్లు ఆ వార్తల్లో ప్రచురితమైంది.

 

ప్రయాణీకుల డిమాండ్‌ మేరకు రైళ్లను అందుబాటులో ఉంచే సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేస్తోంది. ప్రయాణీకులు వేచివుండాల్సిన పరిస్థితిని ఇది తగ్గిస్తుంది. సంబంధిత రైల్లోని సీట్లు/బెర్తుల కంటే ప్రయాణీకుల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉంటే వచ్చే నిబంధనే వెయిటింగ్‌ జాబితా. ఈ నిబంధనను తొలగించడం లేదు. సీట్లు/బెర్తుల డిమాండ్‌, లభ్యతలో హెచ్చుతగ్గులను తగ్గించే అనుసంధానంగా వెయిటింగ్‌ జాబితా పని చేస్తుంది.

 

***



(Release ID: 1681934) Visitor Counter : 193