మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

జాతీయ మైనారిటీ కమిషన్ నిర్వహించిన "మైనారిటీల దినోత్సవం" వేడుకలకు అధ్యక్షత వహించిన - కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ

మైనారిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అంకితభావంతో కృషిచేస్తోంది, ఫలితాలు ప్రశంసనీయం: హర్దీప్ సింగ్ పురీ

మైనారిటీ వర్గాలకు చెందిన కోవిడ్ యోధులను సత్కరించిన - జాతీయ మైనారిటీ కమిషన్

Posted On: 18 DEC 2020 8:36PM by PIB Hyderabad

జాతీయ మైనారిటీ కమిషన్ ఈ రోజు ఇక్కడ "మైనారిటీల దినోత్సవాన్ని" జరుపుకుంది.  ఈ కార్యక్రమానికి గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు శాఖల సహాయ (ఇంచార్జ్) మంత్రి మరియు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ అధ్యక్షత వహించారు.  ఈ కార్యక్రమంలో జాతీయ మైనారిటీల కమిషన్ ఉపాధ్యక్షుడు, శ్రీ అతిఫ్ రషీద్ తో పాటు కమీషన్ కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మహమ్మారి సమయంలో సమాజానికి ఆదర్శవంతమైన సహకారాన్నిఅందించిన ఆరు గుర్తింపు పొందిన మైనారిటీ వర్గాలకు చెందిన 12 మంది కోవిడ్ యోధులను కమిషన్, ఈ సందర్భంగా సత్కరించింది.

మైనారిటీ వర్గాలకు చెందిన కోవిడ్ యోధులను సత్కరించినందుకు, శ్రీ హర్దీప్ సింగ్ పురీజాతీయ మైనారిటీ కమిషన్ను ప్రశంసించారు.  చాలా సంవత్సరాలుగా, ప్రభుత్వం అంకితభావంతో మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేస్తోందనీ, ఫలితాలు ప్రశంసనీయమనీ, ఆయన నొక్కి చెప్పారు.  భారతదేశాన్ని స్వావలంబన దేశంగా మార్చాలన్న ప్రధానమంత్రి ఆశయానికి రూపమే - "ఆత్మ నిర్భర్ భారత్" అని అయన పేర్కొన్నారు.  "వోకల్ ఫర్ లోకల్" అనే ప్రధానమంత్రి పిలుపును విజయవంతం చేయడానికి, ప్రభుత్వం ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా వంటి పథకాలలో, మైనారిటీలు చొరవ తీసుకొని పాల్గొంటున్నారు. ఎక్కువ సమన్వయంతో, మైనారిటీలందరూ, ఆర్థికంగా అధికారం పొందుతారు, దేశ అభివృద్ధికి కలిసి తదుపరి స్థాయికి తీసుకువెళతారు.

జాతీయ మైనారిటీ కమిషన్ ఉపాధ్యక్షుడు శ్రీ అతిఫ్ రషీద్, ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూఆదర్శప్రాయమైన ధైర్యం, అంకితభావంతో సమాజానికి సేవ చేసిన కోవిడ్ యోధులను అభినందించారు.  క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు, అవార్డు గ్రహీతల మాదిరిగా ముందుకు వచ్చి సమాజానికి తోడ్పడాలని, ఆయన, ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ, విజ్ఞప్తి చేశారు. వివిధ వర్గాల మధ్య సామాజిక సామరస్యాన్నీ, శాంతినీ నెలకొల్పడానికి వీలుగా ప్రభుత్వం నిర్వహించవలసిన పాత్ర గురించి కూడా ఆయన సభికులకు తెలియజేశారు.  మైనారిటీల సంక్షేమం కోసం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలు, సామాజిక సమగ్రత మరియు ఆర్థిక అభ్యున్నతి వైపు పెద్ద అడుగు.

 

 

 

****(Release ID: 1681885) Visitor Counter : 13


Read this release in: English , Urdu , Hindi , Manipuri