హోం మంత్రిత్వ శాఖ

సిసిటిఎన్ఎస్ మరియు ఐసిజెఎస్ లలో ఉత్తమ అభ్యాసాలపై 2 వ సదస్సు ముగింపు సమావేశంలో

కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

Posted On: 16 DEC 2020 7:06PM by PIB Hyderabad

ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 'క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ & సిస్టమ్స్ (సిసిటిఎన్ఎస్) / ఇంటర్‌పెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసిజెఎస్) పై 2 వ కాన్ఫరెన్స్  ముగింపు సమావేశంలో ప్రసంగించిన కేంద్ర హోం కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా ప్రసంగించారు. ఐసిజెఎస్ విభాగాలు ఈ-ఫోరెన్సిక్స్, ఈ-ప్రాసిక్యూషన్ & ఈ-ప్రిజన్స్ అన్నీ అనేక రెట్లు విస్తరించబడ్డాయి మరియు మరెన్నో డేటాబేస్‌లు సిస్టమ్‌తో అనుసంధానమయ్యాయి.

.

సెషన్‌లో పాల్గొన్న కేంద్ర హోం కార్యదర్శి మరియు ఇతర సీనియర్ అధికారులను స్వాగతిస్తూ డైరెక్టర్ ఎన్‌సిఆర్‌బి శ్రీ రామ్ ఫాల్ పవార్ మాట్లాడుతూ సిసిటిఎన్ఎస్ / ఐసిజెఎస్‌కు సంబంధించి అన్ని రాష్ట్రాలు / యుటిలు తమ ఆవిష్కరణలు మరియు విజయాలను ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది.

 

సిసిటిఎన్ఎస్, ఐసిజెఎస్ ప్రాజెక్టుల అమలులో రాష్ట్రాలు / యుటిలు చేస్తున్న నిరంతర కృషిని గుర్తించడానికి, నిన్న జరిగిన సమావేశం ప్రారంభోత్సవంలో అగ్రశ్రేణి రాష్ట్రాలు / యుటిలకు  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అవార్డులు అందజేశారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు, రాష్ట్రాలు / యుటిలకు చెందిన సీనియర్ పోలీసు అధికారులు, సిసిటిఎన్ఎస్ / ఐసిజెఎస్ నోడల్ అధికారులు పాల్గొన్నారు.

 

****



(Release ID: 1681343) Visitor Counter : 73


Read this release in: English , Urdu , Hindi