వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప‌రిశుభ్ర‌త‌/ పారిశుద్ధ్య ప్ర‌మాణిక త‌నిఖీ ఏజెన్సీలకు గుర్తింపు ప‌థ‌కాన్ని ప్రారంభించిన క్యూసిఐ

Posted On: 15 DEC 2020 1:59PM by PIB Hyderabad

 గుర్తింపు పొందిన ప‌రిశుభ్ర‌త‌/ పారిశుద్ధ్య ప్ర‌మాణిక త‌నిఖీ ఏజెన్సీల (హైజీన్ రేటింగ్ ఆడిట్ ఏజెన్సీలు) సంఖ్య‌ను దేశంలో పెంచ‌డం ద్వారా పారిశుద్ధ్య ప్ర‌మాణాల‌ను పెంచాల‌ని ప‌రిశుభ్ర‌త‌/ పారిశుద్ధ్య ప్ర‌మాణిక త‌నిఖీల ఆమోదం పొందేందుకై  ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ ఆదేశాల‌తో భార‌త యోగ్య‌తా మండ‌లి (క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా- క్యూసిఐ)  ఒక ప‌థ‌కంతో ముందుకు వ‌చ్చింది. ఈ ప‌థ‌‌కం వివ‌రాలు క్యూసిఐ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయి. 
ఆహారాన్ని నేరుగా కానీ లేక ఆ కార‌ణంతో కానీ వినియోగ‌దారుల‌కు స‌ర‌ఫ‌రా చేసే ఆహార వ్యాపారాల‌కు ఆహార ప‌రిశుభ్ర‌త‌/ పారిశుద్ధ్య ప్ర‌మాణిక ప‌థ‌కం (ఫుడ్ హైజీన్ రేటింగ్ స్కీం) అన్న ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ చొర‌వ ఒక ధృవీక‌ర‌ణ వ్య‌వ‌స్థ‌. త‌నిఖీ స‌మ‌యంలో ఉన్న ప‌రిర‌క్ష‌ణ ప‌రిస్థ‌తుల‌ను, ఆహార పారిశుద్ధ్యాన్ని బ‌ట్టి ఆహార సంస్థ‌ల రేటింగ్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ పరిశుభ్ర‌త‌ రేటింగ్ అనేది స్మైలీల (1- 5వ‌ర‌కు) ఉంటుంది, వినియోగ‌దారులు కూర్చునే ప్రాంతానికి ఎదురుగా ఈ స‌ర్టిఫికెట్‌ను ప్ర‌ద‌ర్శించాలి. ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ  నిర్దేశించిన భ‌ద్ర‌తా విధానాల‌కు, ఆహార పరిశుభ్ర‌త‌కు లోబ‌డి సంస్థ‌‌లు ఉన్నాయా లేదా అని ధృవీక‌రించ‌వ‌ల‌సిన బాధ్య‌త గుర్తింపు పొందిన పారిశుద్ధ్య ప్ర‌మాణాల త‌నిఖీ ఏజెన్సీలది.
పారిశుద్ధ్య, భ‌ద్ర‌త ప్ర‌మాణాల‌ను ఆహార వ్యాపార‌స్తులు మెరుగుప‌ర‌చుకునేలా ప్రోత్స‌హిస్తూ, వినియోగ‌దారులు తాము ఏ ఆహార దుకాణంలో తినాలనే ఎరుక‌తో కూడిన ఎంపిక‌/  నిర్ణ‌యం ‌తీసుకునేందుకు ప‌థ‌కం అనుమ‌తించాల‌న్న‌ది ల‌క్ష్యం. ప్ర‌స్తుతం ఈ ప‌థ‌కం ఆహార సేవా సంస్థ‌లు ( హోట‌ళ్ళు, రెస్టారెంట్లు, కెఫెటేరియాలు, దాభాలు, త‌దిత‌రాల‌కు), స్వీట్ షాపులు, బేక‌రీలు, మాంసం రిటైల్ దుకాణాల‌కు వ‌ర్తిస్తోంది. 
ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ నిర్దేశించిన భ‌ద్ర‌తా విధానాలు, ఆహార పరిశుభ్ర‌తకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న విష‌యాన్ని గుర్తింపు పొందిన ప‌రిశుభ్రత‌ ప్ర‌మాణాల త‌నిఖీ ఏజెన్సీలు ధృవీక‌రిస్తాయి. 
పరిశుభ్ర ప్ర‌మాణాల ప‌థ‌కం అన్న‌ది వినియోగ‌దారుల‌లో చైత‌న్యాన్ని సృష్టించ‌డంలో నూ, ఆహార వ్యాప‌రం చేసేవారిలో స్వీయ అనువ‌ర్త‌న సంస్కృతిని పెంపొందించ‌డంలో ఒక సాధనంగా ఉంటాయ‌ని, ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ సిఇఒ అరుణ్ సింఘ‌ల్ చెప్పారు. 
ఆహార గుణాత్మ‌క‌త‌ను, ప్రాథ‌మిక పారిశుద్ధ్యం ప‌ట్ల భార‌తీయ వినియోగ‌దారుల‌లో, ఆహార సేవా సంస్థ‌ల‌లో విశ్వాసాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో తోడ్ప‌డే అద్భుత‌మైన చొర‌వే ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ, క్యూసిఐల హైజీన్ రేటింగ్‌, దాని గుర్తింపు ప‌థ‌కం అని క్యూసిఐ చైర్మ‌న్ అదిల్ జైనుల్ భాయ్ ఉద్ఘాటించారు. 
ఈ ర‌క‌మైన ప్ర‌మాణాలు, అనుస‌ర‌ణ అంచ‌నా ఎప్ప‌డూ కూడా ఆహార స‌ర్వీసు దుకాణాల‌కు మెరుగైన డిమాండ్ క‌లిగేలా, వినియోగ‌దారునిలో మెరుగైన విశ్వాసానికి  దారి తీస్తుంది. 
మ‌హ‌మ్మారి స‌మ‌యంలో దేశంలో పరిశుభ్ర‌త గురించి వినియోగ‌దారుల‌లో క‌లిగిన చైత‌న్యం, ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ఆహార ప‌రిశుభ్ర‌త‌, భ‌ద్ర‌త అనేది ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ, క్యూసిఐలు చేప‌ట్టిన ముఖ్య చొర‌వ అని క్యూసిఐ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ ఆర్‌.పి.సింగ్ అన్నారు. ముందు ముందు ఈ చొర‌వ వినియోగ‌దారులు స‌రైన దుకాణాలు ఎంచుకోవ‌డానికి తోడ్ప‌డ‌డమే కాక‌, ఆహార దుకాణాలు త‌మ బ్రాండ్ ప‌ట్ల విశ్వాసాన్ని సృష్టించుకుని, వృద్ధి చెందుతున్న ఈ రంగంలో త‌మ ఉనికిని మ‌రింత మెరుగుర‌చుకునే ప్రోత్సాహకాన్ని ఇస్తుంది.

***(Release ID: 1680805) Visitor Counter : 200