ఆర్థిక మంత్రిత్వ శాఖ

అంత‌ర్జాతీయ ఆర్థిక సేవ‌ల కేంద్రాల అథారిటీ (బులియ‌న్ ఎక్స్‌చేంజ్) నిబంధ‌న‌లు, 2020ని నోటిఫై చేసిన ఐఎఫ్ ఎస్‌సిఎ

Posted On: 13 DEC 2020 4:26PM by PIB Hyderabad

అంత‌ర్జాతీయ బులియ‌న్ ఎక్స్‌చేంజ్‌ను గుజ‌రాత్‌లో గాంధీ న‌గ‌ర్‌లోని గిఫ్్ట సిటీలో గ‌ల అంత‌ర్జాతీయ విత్త సేవల కేంద్రంలో ఏర్పాటు చేస్తామ‌ని కేంద్ర బ‌డ్జెట్ 2020లో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. అనంత‌రం, భార‌త ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ ఆర్థిక సేవ‌ల కేంద్రాల అథారిటీ (IFSCA) చ‌ట్టం, 2019 కింద బులియ‌న్ డెలివ‌రీ కాంట్రాక్టును, బులియ‌న్ డిపాజిట‌రీ రెసీప్్ట‌ను (అంత‌ర్లీనంగా బులియ‌న్‌)ను ఆర్థిక ఉత్ప‌త్తులుగా, సంబంధిత సేవ‌ల‌ను ఆర్థిక సేవ‌లుగా ప‌రిగ‌ణిస్తూ భార‌త ప్ర‌భుత్వం నోటిఫై చేసింది. 
 ఈ ఎక్స‌చేంజ్ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను ఐఎఫ్ ఎస్‌సిఎకు అప్ప‌గించింది. ఈ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ ఆర్థిక సేవ‌ల కేంద్రాల అథారిటీ (బులియ‌న్ ఎక్స్‌చేంజ్‌) నిబంధ‌న‌లు 2020ని ఐఎఫ్ ఎస్‌సిఎ అక్టోబ‌ర్ 27, 2020న నిర్వ‌హించిన స‌మావేశంలో ఆమోదించింది. ఈ నిబంధ‌న‌ల‌ను నోటిఫై చేసి గెజెట్ ఆఫ్ ఇండియాలో 11 డిసెంబ‌ర్‌, 2020న ప్ర‌చురించ‌డం జ‌రిగింది.
ఈ నిబంధ‌న‌లు ఇత‌ర విష‌యాల‌తో క‌లిసి బులియ‌న్ ఎక్స్‌చేంజి, క్లియ‌రింగ్ కార్పొరేష‌న్‌, డిపాజిట‌రీ, వాల్్ట‌ల‌కు వ‌ర్తిస్తాయి. ఈ నిబంధ‌న‌ల‌ను 16 అధ్యాయాలుగా విభ‌జించారు. నిబంధ‌న‌ల‌లో మొద‌టి సగం ఎక్స్‌చేంజి, క్లియ‌రింగ్ కార్పొరేష‌న్్స లావాదేవీలకు సంబంధించిన‌వి కాగా, రెండ‌వ స‌గం వాల్ట్‌లు, డిపాజిట‌రీలు, సంబంధిత అంశాల‌ను క‌లిగి ఉంది. 
నోటిఫై చేసిన నిబంధ‌న‌ల పూర్తి అంశాలు ఐఎఫ్ ఎస్‌సిఎ వెబ‌సైట్ https://ifsca.gov.in/Regulation లో అందుబాటులో ఉంది.

***


 


(Release ID: 1680492) Visitor Counter : 125