వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి మరియు పెంపొందించడానికి ప్రభుత్వం అనేక ప్రయోజనాలను ప్రవేశపెట్టిందని శ్రీ పియూష్ గోయల్ తెలిపారు


రైతులకు అవకాశాలు తెరిచే ప్రయత్నం మన అన్నదాతలకు ఉపయోగ భారీ సంస్కరణ అని మంత్రి చెప్పారు

Posted On: 08 DEC 2020 6:59PM by PIB Hyderabad

స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం అనేక ప్రయోజనాలను ప్రవేశపెట్టిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు చెప్పారు. ఐసిఏఐకు చెందిన స్టార్టప్ మంథన్ 2.0 ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..స్టార్టప్‌లకు అనుకూలమైన పరిస్థితులను కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని..ఆ మేరకు పలు ప్రయోజనాలను అందిస్తోందని తెలిపారు.

స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడంపై మాట్లాడిన శ్రీ గోయల్..అందులో పన్ను ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. " స్టార్టప్‌లు ప్రారంభించేవారికి తొలిదశలో పెట్టుబడికోసం నిధుల అందించేందుకు ₹ 10,000 కోట్లతో నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ స్టార్టప్‌లకు తమ సేవలను మరియు ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలకు అందించడానికి సమానమైన అవకాశాన్ని కల్పిస్తుంది.." అని తెలిపారు.

ప్రస్తుతం భారతదేశం స్వావలంబన సాధించే దిశగా పయనిస్తోందని అందులో స్టార్టప్‌లు ముందున్నాయని శ్రీ గోయల్ అన్నారు. "మనం మానవ చరిత్ర యొక్క క్లిష్టమైన దశలో ఉన్నాము. ఇక్కడ మా చర్యలు బిలియన్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. మా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారి నిబద్ధత, శక్తి మరియు పట్టుదలతో మన స్టార్టప్‌లు అన్ని రంగాలలో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చే స్వర్ణ యుగాన్ని సృష్టించగలరు. స్టార్టప్‌లు కష్టపడి పనిచేస్తున్నందున, మేము వారి ప్రయత్నంలో వారికి మద్దతు ఇస్తాము" అని మంత్రి అన్నారు.

క్రియేటివిటీ, ఇన్నోవేషన్, ఇన్వెన్షన్ & డెవలప్‌మెంట్ న్యూ ఇండియాకు పునాది మరియు తప్పనిసరి అని శ్రీ గోయల్ అన్నారు. " ఈ కొత్త సాధారణ పరిస్థితుల్లో మనం స్వావలంబన సాధించడానికి దీర్ఘకాలిక స్థిరమైన పరిష్కారాలు అవసరం. ఆవిష్కరణ సృష్టించేందుకు అవసరమైన అనుకూలమైన వ్యవస్థను రూపొందించడానికి మేము 2016లో స్టార్టప్ ఇండియా చొరవను ప్రారంభించాము. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో 3 వ అతిపెద్ద స్టార్టప్‌ ఈకో వ్యవస్థను కలిగి ఉంది." అని చెప్పారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో చార్టర్డ్ అకౌంటెంట్లు (సిఏలు) మన మారుమూల గ్రామాలు మరియు పట్టణాల్లో కూడా వ్యవస్థాపకత యొక్క స్ఫూర్తిని తీసుకురావడానికి సహాయపడతారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్లు రాబోయే సంవత్సరాల్లో భారతదేశానికి, దేశ ప్రజలకు గొప్ప విజయాలు సాధించగలరని ఆయన అన్నారు. "స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు సేవలు అందించేటప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్లకు పోటీతత్వం ఉంది". అని తెలిపారు.

"దేశాభివృద్ధికి స్టార్టప్‌లు ఇంజిన్లు, ఆవిష్కరణలు శక్తిని అందిస్తాయి" అని ప్రధాని చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. చార్టెర్డ్ అకౌంటెంట్లు స్టార్టప్ వ్యవస్థాపకులుగా ఉండబోతున్నారని, కొత్త స్టార్టప్‌లకు సేవా ప్రదాత అవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రయోజనాలను వారు అర్ధం చేసుకోవడంలో సహాయం చేయాలని శ్రీ గోయల్ సిఐలను కోరారు. "మేము వారికి మరిన్ని ఎంపికలను అందించడం ద్వారా కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తున్నాము. రైతులకు అవకాశాలను తెరిచే ఈ ప్రయత్నం ఒక భారీ సంస్కరణ. ఇది దీర్ఘకాలంలో మన రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంపొందించడానికి, ఉత్తమ పంట పద్ధతులను అవలంభించడానికి సాంకేతికతను అనుసరించడానికి ఇది సహాయపడుతుంది. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ప్రజలు అర్ధం చేసుకుంటారన్న నమ్మకం ఉంది, ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాము. మా రైతు సోదరులు, మరియు సోదరీమణుల జీవితంలో భారీ మెరుగుదల కనిపిస్తుందిఅని ఆయన అన్నారు.

ఎంఎస్‌ఎంఇ బిజినెస్ కంటిన్యూటీ చెక్‌లిస్ట్ జారీ చేసినందుకు ఐసిఏఐ ఇన్స్టిట్యూట్‌ను శ్రీ గోయల్ అభినందించారు. ఎంఎస్‌ఎంఇ రంగాన్ని హ్యాండ్‌హోల్డ్ చేయడానికి సహాయపడే ఇనిస్టిట్యూట్ మరో అద్భుతమైన ప్రయత్నం అని ఆయన అన్నారు. ఇన్స్టిట్యూట్ అన్ని వర్ధమాన వ్యవస్థాపకులు, ఆలోచనాపరులు మరియు వ్యాపారాలు పంచుకునేందుకు మరియు సహకరించడానికి అందించిన ఈ వేదిక, ఆవిష్కరణ మరియు వ్యాపార అభివృద్ధికి ఆలోచనలతో వారిని శక్తివంతం చేస్తుందని మంత్రి చెప్పారు.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/images/cleardot.gif*****

 



(Release ID: 1679272) Visitor Counter : 167