జల శక్తి మంత్రిత్వ శాఖ

జాతీయ నీటి అభివృద్ధి సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశానికి, నదుల అనుసంధానంకోసం ప్రత్యేక కమిటీ సమావేశానికి కేంద్ర జల్ శక్తి రాష్ట్ర మంత్రి రతన్ లాల్ కటారియా అధ్యక్షత వహించారు.

ఆహార భద్రతను పెంచడానికి నీటి కొరత, కరువు పీడిత వ్యవసాయ ప్రాంతాలకు నీటిని అందించడానికి నదుల అనుసంధానం చాలా ముఖ్యమని రతన్ లాల్ కటారియా అన్నారు.

Posted On: 07 DEC 2020 6:26PM by PIB Hyderabad

జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) సొసైటీ 34 వ వార్షిక సర్వసభ్య సమావేశం, నదుల ఇంటర్‌లింకింగ్ ప్రత్యేక కమిటీ (ఎస్‌సిఐఎల్ఆర్)  18 వ సమావేశానికి కేంద్ర జల శక్తి  మంత్రి  రత లాల్ కటారియా ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల జల వనరుల మంత్రులు / జల్ శక్తి, ఐఎల్ఆర్ పై ఏర్పాటయిన టాస్క్ ఫోర్స్ చైర్మన్,  మంత్రి సలహాదారు పాటు  డబ్ల్యుఆర్, ఆర్డీ & జిఆర్ కార్యరద్శి,  వివిధ కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుండి ఇతర అధికారులు పాల్గొన్నారు.

దేశంలో ఆహార భద్రతను పెంచడానికి నదుల ఇంటర్‌లింకింగ్ కార్యక్రమం చాలా ముఖ్యమైనదని, నీటి కొరత తీర్చడానికి, కరువు పీడిత ప్రాంతాలకు నీటిని అందించడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుందని జల్ శక్తి మంత్రి సమావేశంలో స్పష్టం చేశారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయం  సహకారంతో ఐఎల్ఆర్ (ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్)కార్యక్రమాన్ని అమలు చేయడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ధృవీకరించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని  అటల్ బిహారీ వాజ్‌పేయిని గుర్తుచేసుకున్న  కటారియా, ఈ ప్రాజెక్ట్ ఆయన ఆశయమని, తనకు కూడా వ్యక్తిగతంగా ఎంతో ప్రియమైనదని అన్నారు.

ఐదు ప్రధాన లింక్ ప్రాజెక్టుల డీపీఆర్‌ల తయారీ,  అంతర్-రాష్ట్ర నదుల మధ్య అనుసంధానానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల పిఎఫ్ఆర్‌లు / ఎఫ్ఆర్‌ల రూపకల్పనలో ఎన్డబ్ల్యూడీఏ సాధించిన పురోగతి గురించి  కటారియా అందరికీ వివరించారు. కెన్ - బెట్వా లింక్ ప్రాజెక్ట్ కోసం చాలా క్లియరెన్సులు ఇచ్చామని,  డీపీఆర్ లు ఇప్పటికే ఎంపీ,యూపీ రాష్ట్రాలకు ఇచ్చామని వెల్లడించారు. యూపీ, ఎంపీల మధ్య లీన్ సీజన్లో నీటి భాగస్వామ్యంపై ఏకాభిప్రాయం వంటి కొన్ని చిన్న నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్నాయని, సంప్రదింపుల ద్వారా వాటిని పరిష్కరించుకుంటామని అన్నారు.  పార్ - తాపి - నర్మదా లింక్ ప్రాజెక్టులో నీటి పంపిణీపైనా చర్చిస్తున్నామని రతన్ చెప్పారు.  ఇంటర్‌లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రోగ్రాం విజయవంతంగా అమలు చేయడానికి సభ్యులందరూ సాయపడాలని, ముఖ్యంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ముఖ్యమని స్పష్టం చేశారు.

కోహీ - మెచి లింక్ ప్రాజెక్టుకు ఇప్పటికే 4,900 కోట్ల రూపాయల పెట్టుబడి క్లియరెన్స్‌ను మంత్రిత్వ శాఖ మంజూరు చేసిందని అన్నారు. ఇది బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతానికి వరప్రదాయిని అని కటారియా వివరించారు. ఇది ఉత్తర బీహార్లోని భారీ భూభాగాలను వరదలు నుండి రక్షిస్తుంది. అంతేగాక 2.14 లక్షల హెక్టార్ల కు సాగునీరు అందిస్తుంది.

వివిధ ఐఎల్ఆర్ ప్రాజెక్టులపై రాష్ట్రాలు లేవనెత్తిన ఆందోళనలన్నింటినీ పరిష్కరిస్తామని, సంబంధిత రాష్ట్రాల సహకారంతో ఐఎల్ఆర్ కార్యక్రమం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నామని మంత్రి రతన్ లాల్ వివరించారు.

 

డైరెక్టర్ జనరల్, ఎన్డబ్ల్యూడీఏ  ఐఎల్ఆర్ ప్రాజెక్టుల స్థితిగతులు  పెండింగ్‌లో ఉన్న సమస్యలు, అడ్డంకుల గురించి ఈ సమావేశం ఎజెండాలోని అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు.  అంతేగాక కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. బీహార్ డబ్ల్యుఆర్‌డి మంత్రి  విజయ్ కుమార్ చౌదరి, ఉత్తర ప్రదేశ్ జల్ శక్తి మంత్రి  మహేంద్ర సింగ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర డబ్ల్యుఆర్‌డి మంత్రి  రామ్ కిషోర్‌కవ్రే, ఐజిఎన్‌పి మంత్రి  ఉదయ్ లాల్ అంజనా కూడా ఐఎల్ఆర్ ప్రాజెక్టులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

***



(Release ID: 1679233) Visitor Counter : 103