రైల్వే మంత్రిత్వ శాఖ

ఢిల్లీ - వారణాశి మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం కోసం భూ సర్వేక్షణ జరిపేందుకు జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ సంస్థ (ఎన్ హెచ్ ఎస్ ఆర్ సి ఎల్) కాంతి పరిశోధన మరియు పరిధి సర్వేక్షణ Light Detection and Ranging Survey (LiDAR) -- లిడర్ పద్ధతిలో ఆకాశంలో నుంచి సర్వే జరుపనుంది.

Posted On: 07 DEC 2020 6:42PM by PIB Hyderabad

ఢిల్లీ -  వారణాశి మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ కు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు నివేదికను తయారు చేయడానికి ఎన్ హెచ్ ఎస్ ఆర్ సి ఎల్  సంస్థ  గగనతలం నుంచి లిడర్ పద్ధతిని ఉపయోగించి భూమి సర్వే జరుపనున్నది. ప్రతిపాదిత  ఢిల్లీ -  వారణాశి మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ గురించి సవివరమైన ప్రాజెకు నివేదిక తయారీ కోసం  భూ సర్వే జరిపేందుకు లేజర్ శక్తి సామర్ధ్యం కలిగిన యంత్ర పరికరాలను  హెలికాఫ్టర్ పైన  అధిరోహింపజేస్తారు.  

    ఒకే వరుసలో ఉండే మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మాణంలో  సమలేఖనం లేక భూ సర్వే చాలా కీలకమైన అంశం.  ఈ సర్వే ద్వారా సమలేఖనం జరిపే ప్రాంతం చుట్టూతా ఉండే ప్రాంతాలకు సంబంధించి ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయి.  ఈ టెక్నీక్ లో లేజర్ దత్తాంశాలు, భూగోళస్థానీయ వ్యవస్థ (జి పి ఎస్) దత్తాంశాలు, హెలికాఫ్టర్ ఎగరడానికి సంబంధించిన ప్రమాణాలతో పాటు వాస్తవ చిత్రాలను ఉపయోగించి సర్వే జరపడం ద్వారా సర్వేకు సంబంచింది కచ్చితమైన డేటాను  కనుగొనవచ్చు.  సర్వేలో కనుగొన్న వివరాలను ఉపయోగించి నిర్మాణాల  సమలేఖనం , స్టేషన్లు . డిపోలు ఎక్కడ ఏర్పాటు చేయాలి?  రైల్ కారిడార్ కోసం ఎంత భూమి అవసరమవుతుంది?  ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే ప్లాట్లు / నిర్మాణాలు, దారి హక్కు  వంటి విషయాలను నిర్ణయిస్తారు.  

     ఇండియాలో ఒక రైల్వే ప్రాజెక్టు భూ సర్వే కోసం పై నుంచి  (సర్వే యంత పరికరాలను  హెలీకాఫ్టర్లో ఉంచి) లిడర్ టెక్నీక్ ను   గతంలో ముంబయి - అహమ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టుకోసం ఉపయోగించారు. ఈ పద్ధతిని ఉపయోగించడంలో ప్రధాన ఉద్దేశం  విషయ సేకరణలో ఎక్కువ ఖచ్చితత్వం   ఈ సర్వేకు పట్టే  సమయం కూడా చాలా తక్కువ.  ముంబయి - అహమ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు కోసం పై నుంచి జరిపిన లిడర్ సర్వే కేవలం 12 వారాల్లో పూర్తయ్యింది. అదే సంప్రదాయ పద్ధతిలో జరిపే సర్వేకు 10-12 నెలలు పడుతుంది..  

       ప్రాజెక్టు పరిమాణము మరియు నివేదిక సమర్పించడానికి నిర్ణయించిన కాలపరిమితి దృష్ట్యా ఢిల్లీ -  వారణాశి కారిడార్ సర్వే పనులను అప్పుడే మొదలెట్టారు.  హెలికాఫ్టర్ నుంచి జరిపే సర్వే పనులు దశల వారీగా  2020 డిసెంబర్ 13వ తేదీ నుంచి (వాతావరణం అనుకూలత ఆధారంగా)  మొదలవుతాయి.  సర్వే కోసం హెలికాఫ్టర్ ఉపయోగించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన అనుమతులు కూడా  లభించాయి.  యంత్ర పరికరాలు  మరియు హెలికాఫ్టర్ తనిఖీ కొనసాగుతోంది.  

       ప్రతిపాదిత  ఢిల్లీ -  వారణాశి కారిడార్ రాకపోకలు జరిగే ప్రాంత భూభాగం రకరకాలుగా ఉంటుంది. జనసాంద్రత కలిగిన  పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, రహదారులు, రోడ్లు, కనుమలు, నదులు, పంట పొలాలు మొదలగునవి ఉండటం వల్ల సమలేఖనం  జరపడం సవాళ్లతో కూడుకొని ఉంటుంది.  
 
        ఢిల్లీ -  వారణాశి హై  స్పీడ్ రైల్ కారిడార్ కు సంబంధించిన సవివరమైన నివేదికను తయారు చేసే బాధ్యతను రైల్వే మంత్రిత్వ శాఖ ఎన్ హెచ్ ఎస్ ఆర్ సి ఎల్ సంస్థకు అప్పగించింది.  ఈ కారిడార్ తాత్కాలిక /పరీక్షార్ధక  నిడివి 800 కిలోమీటర్లు.   ప్రభుత్వంతో సంప్రదించి సమలేఖనం మరియు స్టేషన్లు నిర్ణయిస్తారు.  
         


 

***



(Release ID: 1679191) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Hindi , Tamil